IMA State Association
-
‘వైద్యులకు అండగా ఉంటాం’
కరీంనగర్ టౌన్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర సదస్సు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. వీ కన్వెన్షన్ హాల్లో జరిగిన సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి వైద్యులు తరలివచ్చారు. వైద్యరంగంలో వేగంగా జరుగుతున్న మార్పులకనుగుణంగా వైద్య సేవలు అందించడం, వైద్యులపై జరు గుతున్న దాడులను ఎదుర్కోవడం వంటి అంశాలతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలపై ఆయా విభాగాల నిపుణులు చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. వైద్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఈటల హామీ ఇచ్చారు. ప్రస్తుత కాలంలో మనిషికి అన్నం ఎంత అవసరమో, వైద్యం కూడా అంతే అవసరమైందని అన్నారు. -
వైద్యులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
నంద్యాలఅర్బన్ : వైద్యులు నిరంతరం తమ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆధునిక విధానాలపై అవగాహన పెంచుకోవాలని ఏపీ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎలమంచలి రాజారావు సూచించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్, ఐఎంఏ నంద్యాల శాఖ సం యుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక శాంతిరాం వైద్య కళాశాల ఆడిటోరియం లో రాయలసీమ స్థాయి వైద్యసదస్సు నిర్వహించారు. శాంతిరాం వైద్యకళాశా ల చైర్మన్ మిద్దె శాంతిరాముడు, ఐఎంఏ జాతీయ నాయకులు డాక్టర్ అప్పారావు, డాక్టర్ గంగాధర్, మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి, కార్యదర్శి అనిల్, కమిటీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, సదస్సు క న్వీనర్ డాక్టర్ మాధవి, విజయభాస్కరరెడ్డి, బుడ్డా శ్రీకాంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజారావు మాట్లాడుతూ సమా జ అవసరాలను గుర్తించి వైద్య విధానాలు రూపొందించుకోవాలని సూచించారు. డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ కేంద్రం నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం తీసుకరావాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభు త్వం ఆమోదించరాదన్నా రు. డాక్టర్ మాధవి మాట్లా డుతూ సదస్సుకు హాజరైన వైద్యులకు మెడికల్ కౌన్సిల్ మూ డు వైద్యపాయింట్లు కేటాయించిందని, ప్రతి ఐదు సంవత్సరాలకు తమ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ చేసే సమయంలో ఈ పాయింట్లు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతిరాం వైద్య కళాశాల ఎండీ డాక్టర్ రవిబాబు, డాక్టర్ బాలమద్దయ్య, డాక్టర్ త్యాగరాజరెడ్డి, సాయిప్రసాద్, ప్రిన్సిపాల్ గిడ్డయ్య, సూపరింటెండెంట్ చంద్రన్న, డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు. మహానందీశుడి సేవలో.. మహానంది: ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఆదివారం సాయంత్రం మహానందీశ్వరుడిని దర్శించుకున్నారు. తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి చంద్రశేఖర్, ఎంపీహెచ్ఈఓ హుసేన్‌రెడ్డి, మిత్ర చంద్రశేఖర్‌తో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ ఇన్స్పెక్టర్ శశిధర్‌రెడ్డి స్వాగతం పలికారు. -
వైద్యం షురూ
- ఆందోళన విరమించిన ప్రైవేటు వైద్యులు - జోక్యం చేసుకున్న ఐఎంఏ రాష్ట్రం సంఘం - వైద్యుల సమ్మెపై కలెక్టర్ అసహనం - మృతుల కుటుంబాలను ఎవరు ఓదారుస్తారని ప్రశ్న - వైద్య సహాయం అందక జిల్లాలో మొత్తం ముగ్గురు మృతి నిజామాబాద్ అర్బన్/కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎట్టకేలకు జిల్లాలో ప్రైవేటు వైద్యులు బుధవారం ఆందోళన విరమించారు. ప్రైవేటు ఆస్పత్రులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నాలుగు రోజులుగా ఆస్పత్రులను మూసివేసి డాక్టర్లు వైద్య సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందక జిల్లాలో ముగ్గురు మరణించారు. మరోవైపు వైద్యుల తీరుపై ప్రజాగ్రహం వ్యక్తమయ్యింది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైద్యుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పరిణామాలు తీవ్ర మవుతుండడంతో ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ రాష్ట్ర సంఘం జోక్యం చేసుకుంది. ఆస్పత్రులను మూసివేసి వెద్య సేవలు బంద్ చేయడం సమంజసం కాదని ఐఎంఏ జిల్లా నేతలకు హితవు పలికింది. తర్జనభర్జన అనంతరం వైద్యులు తమ ఆందోళనను విరమించి వైద్యసేవలను ప్రారంభించారు. అంతకు ముందు వైద్యులు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్నను కలిసి ప్రైవేటు ఆస్పత్రులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వెద్యులు ఆస్పత్రులను మూసివేసి వైద్యసేవలను నిలిపివేసిన తీరుపై తీవ్రంగా నిరసించారు. ‘‘మీ ఆందోళన వల్ల వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఎవరిది బాధ్యత. వారి కుటుంబ సభ్యులను ఎలా ఓదార్చుతారు. ముందు దీనికి సమాధానం చెప్పండి. ఆ తర్వాతే మాట్లాడండి’’ అంటూ కలెక్టర్ మండిపడ్డారు. ‘‘మీ వల్ల అమాయకులైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక చాలు. ఆందోళన విరమించి ఆస్పత్రులు తెరవండి’’ అని సూచించారు. ఐఎంఏ జిల్లా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కేంద్ర సంఘం నాయకుడు అప్పారావు, అప్నా రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్‌రెడ్డి, సభ్యులు నరేందర్‌రెడ్డి. వీఎస్.రావు, బాపురెడ్డి, అశోక్‌రెడ్డి కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. ఆస్పత్రులపై జరుగుతున్న దాడుల గురించి వివరించారు. దీంతో కలెక్టర్ స్పందించారు. దాడులు చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పినా వైద్యులు వినకుండా ఆస్పత్రులను బంద్ చేసి ఆందోళనకు దిగారన్నారు. ప్రైవేట్ వైద్యుల చర్య వల్ల వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమ్మెకు వెళ్లేముందు మానవతా దృక్పథంతో ఆలోచించి ఉండాల్సిందని పేర్కొన్నారు. వైద్యుల మధ్య విభేదాలుకలెక్టర్ను కలిసి వెళ్లిన అనంతరం వైద్యులు ఐఎంఏ హాల్లో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ర్ట, జిల్లా నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆస్పత్రులు మూసివేసి నిరసన తెలపడం సమంజసం కాదని, వెంటనే నిరసన విరమించాలని రాష్ట్ర నాయకుడు నీలి రాంచందర్ ఇతర వైద్యులను కోరారు. రాష్ట్ర నాయకత్వం ఆయనను సమర్థించింది. దీనిని కొందరు వైద్యులు వ్యతిరేకించారు. దీంతో రాంచందర్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. నిరసన వల్ల జిల్లా యంత్రాంగం, ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుందని గమనించాలని కోరినా కొందరు వైద్యులు వినిపించుకోలేదు. అయితే ఎట్టకేలకు నిరసనను విరమించడానికి వైద్యులు అంగీకరించారు. ఇటు జిల్లా యంత్రాంగం, అటు పలు సంఘాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చేసేదేమీలేక వైద్య సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వివాదం ఇలా మొదలైంది బోధన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో మంగళవారం పూజ (20) అనే యువతి ఇద్దరు కవలలకు జన్మనిచ్చి మరణించింది. కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు మైరుగైన వైద్య సేవలు అందించలేదని ఆరోపిస్తూ ఆస్పత్రిపై దాడికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి జనరేటర్‌కు నిప్పు పెట్టారు. మరుసటి రోజే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బొంబాయి నర్సింగ్ హోమ్‌లో అర్షమొలలకు చికిత్స పొందిన సుమలత అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. ఆమె బంధువులు ఆస్పత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నిప్పంటిచారు. దీంతో సంఘటితమైన వైద్యులు జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఆస్పత్రులను మూసివేసి వైద్యసేవలను బంద్ చేశారు. వీరికి మద్దతుగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సైతం ఒకరోజు వైద్య సేవలను నిలిపి వేశారు. దీంతో జిల్లాలో వేలాది మంది రోగులు తీవ్ర అవస్థలకు లోనయ్యారు. జిల్లాలో సకాలంలో వైద్య సహాయం అందకపోవడంతో ఓ బాలికతో పాటు ఇద్దరు మృత్యువాత పడ్డారు.