
భువనేశ్వర్/పారాదీప్ : ఒడిశాలోని మహానది పారాదీప్ తీరంలో నలుగురు తల్లీబిడ్డల మృతదేహాలు తేలాయి. గురువారం ఉదయం స్థానికుల దృష్టికి ఈ విషయం తారసపడడంతో పోలీసుల కు సమాచారం చేరవేశారు. మృతుల్లో తల్లి, ఇద్దరు కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. మహానదిలో తలకిందులుగా వీరి మృతదేహా లు తేలుతూ కనిపించాయి.
వీరిని ఇటీవల దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అనంత శెట్టి భార్యాబిడ్డలుగా గుర్తించారు. ఆస్తి చేజిక్కించుకోవడం కోసం ఎవరో కుట్ర పన్ని వీరిని ఇలా హతమార్చినట్లు మృతురాలి సోదరుడు ఆరోపించాడు. ఈ సంఘటన పూర్వాపరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు రంగంలోకి దిగి మహానదిలో తేలియాడిన మృతదేహాల్ని ఒడ్డుకు చేర్చారు. మృతులంతా పారాదీప్ జగన్నాథ్‌పూర్ గ్రామస్తులు. మహానది శని మందిరం తీరంలో ఈ మృతదేహాలు తేలా యి. జగత్‌సింగ్‌పూర్ జిల్లా కుజంగ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment