మళ్లీ నటించేందుకు.. | Samantha Ruth Prabhu begins shootING | Sakshi
Sakshi News home page

మళ్లీ నటించేందుకు..

Published Sun, Oct 15 2017 5:21 AM | Last Updated on Sun, Oct 15 2017 5:21 AM

Samantha Ruth Prabhu begins shootING

తమిళసినిమా: చెన్నై చిన్నది బ్యాక్‌ టూ యాక్ట్‌కు రెడీ అయిపోయారు. కోలీవుడ్‌లోనే కాదు దక్షిణాదిలోనే లక్కీయస్ట్‌ నటి అంటే సమంతనే అనాలి. ఏలాంటి వ్యతిరేకతను ఎదుర్కోకుండా ప్రేమించిన ప్రియుడు, అదీ ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన యువ నటుడిని ఇరుకుటుంబ పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసిన వేదికపై పెళ్లి చేసుకున్న నటి సమంత. గత ఆరో తేదీన పెళ్లి వేడుకలో అమాంతం మునిగి తేలిన సమంత ముందుగానే ఒక విషయాన్ని వెల్లడించారు. పెళ్‌లైన మూడో రోజునే షూటింగ్‌లో పాల్గొంటానన్నదే ఆ ప్రకటన.

అన్న మాట నిలబెట్టుకుంటూ పెళ్లి అయిన రెండు రోజులకే సమంత తన మామ నాగార్జునతో కలిసి నటించిన రాజుగారి గది–2 చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక వారం కూడా గడవ కుండానే బ్యాక్‌ టూ యాక్ట్‌ అంటూ తాను నటిస్తున్న మహానది షూటింగ్‌లో శనివారం పాల్గొన్నట్లు సినీ వర్గాల సమాచారం. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సావిత్రిగా నటి కీర్తీసురేశ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో సమంత విలేకరిగా ఒక కీలకపాత్రను పోషిస్తున్నారని తెలిసింది. తదుపరి సమంత తమిళంలో అంగీకరించిన చిత్రాల షూటింగ్‌లో వరుసగా పాల్గొంటారని సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఇరుంబుతిరై, సూపర్‌ డీలక్స్, శివకార్తికేయన్‌తో ఒక చిత్రం అంటూ మూడు చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. విజయ్‌తో నటించిన మెర్శల్‌ చిత్రం దీపావళి పండగ సందర్భంగా తెరపైకి రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement