Savitri Biopic
-
సావిత్రి బయోపిక్ మహద్భాగ్యం
తిరుపతి కల్చరల్: దక్షిణ భారత సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి సావిత్రి బయోపిక్‌పై చిత్రం తీయడం మహద్భాగ్యమని వైజయంతీ మూవీస్ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఉద్ఘాటించారు. శుక్రవారం రాత్రి తిరుపతి ప్రతాప్ థియేటర్లో ఆయన మహానటి చిత్రాన్ని తిలకించారు. ఆయనకు టీటీడీ ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పుష్పగుచ్ఛంతో ఘనంగా స్వాగతం పలికారు. అశ్వనీదత్ మాట్లాడుతూ తాను నిర్మించిన మొదటి చిత్రం ఎదురులేని మనిషి నుంచి నేటి మహానటి వరకు చిత్రాలను ప్రదర్శించి.. తనకు విజ యాలు అందిస్తున్న తిరుపతి గ్రూప్ థియేటర్స్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో పూర్వ నటీ నటులను, నిర్మాతలను తలుచుకునే అవకాశం లభించిందని తెలి పారు. టెక్నీషియన్స్ అందించిన సహకారం మరువలేనిదన్నారు. ప్రస్తుతం తాను నిర్మాతగా నాగార్జున, నానితో నిర్మిస్తున్న చిత్రం 40 శాతం పూర్తి కావచ్చిందని తెలిపారు. జూన్ 9 నుంచి మహేష్‌బాబు చిత్రం ప్రారంభమవుతుందని చెప్పారు. తర్వాత తమిళ, హిందీ దర్శకులతో కొత్త ప్రాజెక్టులు చేయనున్నట్లు వెల్ల డిం చారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ థియేటర్స్ మేనేజర్ సిద్ధారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఘటోత్కచుడు
పౌరాణికాలు, కమర్షియల్ చిత్రాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు ఎస్వీ రంగారావు. ‘మాయాబజార్’లో ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు..’ అంటూ ‘ఘటోత్కచుడు’ పాత్రను ఆయన పోషించిన తీరుని ఎవ్వరం మర్చిపోలేం. ఇప్పుడు సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో మాయాబజార్ సినిమాలోని ‘ఘటోత్కచుడు’ క్యారెక్టర్‌ను చూపించనున్నారు. ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు యాక్ట్ చేశారు. ఘటోత్కచుడిగా మోహన్‌బాబు లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ లుక్‌కి మంచి స్పందన లభించింది. సావిత్రిగా కీర్తీ సురేశ్ నటించిన ‘మహానటి’ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. -
క్రీమ్ బన్.. డబ్బింగ్ డన్
మధురవాణి పాత్రలో సమంత షూటింగ్ డన్. లేటెస్ట్గా ఫస్ట్‌టైమ్ తెలుగులో డబ్బింగ్ ఆల్సో డన్. సో.. సమంత వెల్డన్. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన సినిమా ‘మహానటి’. తమిళంలో ‘నడిగర్ తిలగం’ అనే టైటిల్ పెట్టారు. కీర్తీ సురేశ్, సమంత, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు నటించారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంత నటించారు. ఆల్రెడీ దుల్కర్సల్మాన్, భానుప్రియ డబ్బింగ్‌ను కంప్లీట్ చేశారట. తాజాగా సమంత కంప్లీట్ చేశారు. ‘మహానటి’ సినిమాతో తొలిసారి సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ‘‘క్రీమ్ బన్ తింటూ డబ్బింగ్‌ను కంప్లీట్ చేశా’’ అన్నారు సమంత. ‘మహానటి’ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. -
సావిత్రిగారి పేరే నా పేరు
పేరు మధురవాణి. అమ్మాయి క్యారెక్టర్ గోల్డ్. చదువులో గోల్డ్ మెడలిస్ట్. మధురంగా మాట్లాడుతుంది కదా అని మధురవాణి మాటల మత్తులో పడ్డారో అంతే. మొత్తం కూపీ లాగేస్తుంది. ఎందుకంటే మధురవాణి జర్నలిస్ట్ కాబట్టి. పైన ఉన్న ఫొటో చూశారుగా. ఎన్ని పేపర్స్ అండ్ ఫైల్స్‌తో మధ్యలో మధురవాణి ఉన్నారో. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహానటి’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించారు. కీర్తీ సురేష్, సమంత, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు నటించారు. షూటింగ్ కంప్లీటైంది. సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. ఏయన్నార్ పాత్రలో నాగచైతన్య నటించగా, మధురవాణి పాత్ర పోషించారు సమంత. ‘‘నా పేరు కన్యాశుల్కంలో సావిత్రిగారి పేరే. మధురవాణి (బీఏ గోల్డ్ మెడల్)’’ అంటూ ‘మహానటి’ సినిమాలో సమంత లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. అన్నట్లు.. మధురవాణి భలేగా ఉన్నారు కదండీ. ‘మహానటి’ సినిమాను మే 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మహానటిని వదల్లేక!
సావిత్రిలా నడవటం, చూడటం. పెదవి విరవడం, డ్యాన్స్ చేయడం... ఇలా కొన్ని నెలలుగా కీర్తీ సురేశ్ తనను తాను సావిత్రిలా ఊహించుకున్నారు. అందుకే ఇక ఆమెలా అభినయించే అవకాశం లేదని ఫీలయ్యారు. ‘మహానటి’ షూటింగ్ చివరి రోజున కీర్తీ సురేశ్ ఎమోషన్ అయ్యారు. సావిత్రి చిత్రపటం దగ్గర దీపం వెలిగించారు. చెమర్చిన కళ్లతో చిత్రబృందం నుంచి వీడ్కోలు తీసుకున్నారామె. అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహానటి’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించారు. సావిత్రి పాత్రలో కథానాయిక కీర్తీ సురేశ్ నటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత ప్రియాంకా దత్ మాట్లాడుతూ – ‘‘మహానటి’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీలక పాత్రలు చేసిన మోహన్‌బాబుగారు, రాజేంద్ర ప్రసాద్‌గారు స్ట్రాంVŠ సపోర్ట్‌గా నిలబడ్డారు. కీర్తీ సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్ ఇలా భారీ తారాగణంతో మా బ్యానర్లో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఏయన్నార్ పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్యకు రుణపడి ఉంటాం. మే 9న చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
తాత పాత్రలో మనవడు..!
అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రల్లో ఎవరు నటిస్తారన్న ప్రశ్న ఇండస్ట్రీ వర్గాలతో సినీ అభిమానుల్లోనూ వినిపిస్తోంది. ముందుగా ఎన్టీఆర్, ఏఎన్నార్లుగా జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్యలను నటింపచేయాలని చిత్రయూనిట్ ప్రయత్నించారు. అయితే ఎన్టీఆర్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. మొదట్లో నాగచైతన్య కూడా నో చెప్పినా.. తాజాగా ఏఎన్నార్ పాత్రలో నటించేందుకు అంగీకిరంచారు. రెండు రోజుల పాటు డేట్స్ కూడా కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 14, 15 తేదిలో నాగచైతన్యకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా ఎస్వీఆర్ గా సీనియర్ నటుడు మోహన్ బాబు నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో సమంత, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, దర్శకులు క్రిష్, తరున్ భాస్కర్లు నటిస్తున్నారు. -
నా కొత్త బండి ఎలా ఉంది
కావాలంటే పడవంత కారులో షికారు చేయవచ్చు. అనుకుంటే విమానంలో ఆనందంగా గగన విహారం చేయవచ్చు. కానీ కథానాయిక సమంత మాత్రం మోపెడ్ ఎక్కుతా. లూనాలో గల్లీ గల్లీ తిరుగుతా. అవసరమైతే ఎంత లొల్లికైనా డేర్ చేస్తా అంటున్నారీ బ్యూటీ. ఈ గాలింపు, ఈ డేరింగ్ ప్రస్తుతానికైతే రీల్ లైఫ్ కోసమేనండి. అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా ‘ఏవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహానటి’. ఇందులో సావిత్రి పాత్రను కీర్తీ సురేశ్ చేస్తున్నారు. మోహన్‌బాబు, దుల్కర్ సల్మాన్, సమంత కీలక పాత్రలు చేస్తున్నారు. సమంత జమున పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ‘‘1980కి వెళ్తున్నాం. కొందరి జీవిత చరిత్రలు అందరూ తెలుసుకోవడానికి అర్హమైనవి. అలాంటి సావిత్రిగారు జీవించిన టైమ్‌ని ఇప్పుడు రీ–క్రియేట్ చేసిన ప్లేస్‌లో నటించడం ఆనందంగా ఉంది. ఆ కాలం నాటి పీస్ (లూనా) నా చెంతకు చేరడం హ్యాపీగా ఉంది. 1960 అండ్ 1970లలో జరిగే సినిమా ‘మహానటి’’ అని సమంత పేర్కొన్నారు. నా కొత్త బండి ఎలా ఉందో చెప్పండి అన్నట్లు ఇన్సెట్లో మీరు చూస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మాయాబజార్లో మిసెస్ నాగచైతన్య!
జస్ట్... తొమ్మిదంటే తొమ్మిది రోజుల క్రితమే సమంత రూత్ ప్రభు... అక్కినేని సమంతగా మారారు. పెళ్లి తర్వాత హనీమూన్‌కి చెక్కేయకుండా నాగచైతన్య, సమంత తమ తమ సినిమాల షూటింగ్స్‌కి డేట్స్ ఇచ్చేశారు. సమంత అయితే నిన్న మొన్నటి వరకు ‘రాజుగారి గది 2’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. సోమవారం ‘మహానటి’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ప్రొఫెషన్ మీద అంత శ్రద్ధ కాబట్టే్ట, ఆమె టాప్ హీరోయిన్ అయ్యారు. ‘మహానటి’ సంగతికొస్తే... అలనాటి గొప్ప నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగఅశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాటి క్లాసిక్ ‘మాయాబజార్’లో సావిత్రి చేసిన శశిరేఖ పాత్రకు సంబంధించిన సీన్స్‌ని తీస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. సమంత జర్నలిస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఉదయాన్నే ‘మహానటి’ షూట్లో జాయిన్ అయ్యేందుకు స్టార్ట్ అయ్యాను. నెర్వస్‌గా, ఎగై్జట్‌మెంట్‌గా ఉంది. న్యూ బిగినింగ్’’ అని సమంత పేర్కొన్నారు. కథానాయిక అయ్యి దాదాపు ఏడేళ్లయింది. ఇప్పుడు న్యూ బిగినింగ్ ఏంటీ అనుకుంటున్నారా? అప్పుడు ‘కుమారి సమంత’గా సెట్స్‌కి వెళ్లేవారు. ఇప్పుడు ‘మిసెస్ నాగచైతన్య’గా వెళుతున్నారు కదా. అందుకే అలా అన్నారు. -
మళ్లీ నటించేందుకు..
తమిళసినిమా: చెన్నై చిన్నది బ్యాక్ టూ యాక్ట్‌కు రెడీ అయిపోయారు. కోలీవుడ్‌లోనే కాదు దక్షిణాదిలోనే లక్కీయస్ట్ నటి అంటే సమంతనే అనాలి. ఏలాంటి వ్యతిరేకతను ఎదుర్కోకుండా ప్రేమించిన ప్రియుడు, అదీ ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన యువ నటుడిని ఇరుకుటుంబ పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసిన వేదికపై పెళ్లి చేసుకున్న నటి సమంత. గత ఆరో తేదీన పెళ్లి వేడుకలో అమాంతం మునిగి తేలిన సమంత ముందుగానే ఒక విషయాన్ని వెల్లడించారు. పెళ్లైన మూడో రోజునే షూటింగ్లో పాల్గొంటానన్నదే ఆ ప్రకటన. అన్న మాట నిలబెట్టుకుంటూ పెళ్లి అయిన రెండు రోజులకే సమంత తన మామ నాగార్జునతో కలిసి నటించిన రాజుగారి గది–2 చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక వారం కూడా గడవ కుండానే బ్యాక్ టూ యాక్ట్ అంటూ తాను నటిస్తున్న మహానది షూటింగ్లో శనివారం పాల్గొన్నట్లు సినీ వర్గాల సమాచారం. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సావిత్రిగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత విలేకరిగా ఒక కీలకపాత్రను పోషిస్తున్నారని తెలిసింది. తదుపరి సమంత తమిళంలో అంగీకరించిన చిత్రాల షూటింగ్లో వరుసగా పాల్గొంటారని సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఇరుంబుతిరై, సూపర్ డీలక్స్, శివకార్తికేయన్‌తో ఒక చిత్రం అంటూ మూడు చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. విజయ్‌తో నటించిన మెర్శల్ చిత్రం దీపావళి పండగ సందర్భంగా తెరపైకి రానుంది. -
తాతల పాత్రల్లో మనవళ్లు?!
తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘క్లాసిక్’ అనదగ్గ సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. ఎన్టీఆర్, ఏయన్నార్ నటించిన ఆ చిత్రాన్ని ఆ ఇద్దరి మనవళ్లు చిన్న ఎన్టీఆర్, నాగచైతన్యతో రీమేక్ చేస్తే బాగుంటుందని చాలామంది అంటుంటారు. ఈ హీరోలిద్దరూ ఆ చాన్స్ వస్తే నటించడానికి సుముఖంగానే ఉన్నట్లు కొన్ని సందర్భాల్లో వ్యక్తపరిచారు. ఆ సంగతలా ఉంచితే.. ఇప్పుడు ఈ ఇద్దరూ తమ తాతల పాత్రల్లో కనిపించనున్నారని టాక్. శనివారం ఫిలిం నగర్లో ఇదే హాట్ టాపిక్. ‘ఎవడే సుబ్రమణ్యం’ ద్వారా దర్శకుడిగా పరిచయమైన నాగ అశ్విన్ ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా ‘మహా నటి’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. సావిత్రితో స్క్రీన్ షేర్ చేసుకున్న నటుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్ కూడా ఉన్నారు. ఆమె కథతో తీసే సినిమాలో ఈ పాత్రలు కూడా ఉంటాయి కాబట్టి, వీటిని ఆ మహా నటులిద్దరి మనవళ్లతో చేయించాలని నాగ అశ్విన్ భావిస్తున్నారట. ఎన్టీఆర్, నాగచైతన్యను సంప్రదించారని సమాచారం. సినిమాకి కీలకంగా నిలిచే ఈ ప్రత్యేక పాత్రలు చేయడానికి హీరోలిద్దరూ అంగీకరించారని భోగట్టా.