పేరు మధురవాణి. అమ్మాయి క్యారెక్టర్ గోల్డ్. చదువులో గోల్డ్ మెడలిస్ట్. మధురంగా మాట్లాడుతుంది కదా అని మధురవాణి మాటల మత్తులో పడ్డారో అంతే. మొత్తం కూపీ లాగేస్తుంది. ఎందుకంటే మధురవాణి జర్నలిస్ట్ కాబట్టి. పైన ఉన్న ఫొటో చూశారుగా. ఎన్ని పేపర్స్ అండ్ ఫైల్స్‌తో మధ్యలో మధురవాణి ఉన్నారో. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహానటి’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించారు.
కీర్తీ సురేష్, సమంత, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు నటించారు. షూటింగ్ కంప్లీటైంది. సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. ఏయన్నార్ పాత్రలో నాగచైతన్య నటించగా, మధురవాణి పాత్ర పోషించారు సమంత. ‘‘నా పేరు కన్యాశుల్కంలో సావిత్రిగారి పేరే. మధురవాణి (బీఏ గోల్డ్ మెడల్)’’ అంటూ ‘మహానటి’ సినిమాలో సమంత లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. అన్నట్లు.. మధురవాణి భలేగా ఉన్నారు కదండీ. ‘మహానటి’ సినిమాను మే 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment