సమంత
మధురవాణి పాత్రలో సమంత షూటింగ్ డన్. లేటెస్ట్‌గా ఫస్ట్‌టైమ్ తెలుగులో డబ్బింగ్ ఆల్సో డన్. సో.. సమంత వెల్‌డన్. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన సినిమా ‘మహానటి’. తమిళంలో ‘నడిగర్ తిలగం’ అనే టైటిల్ పెట్టారు.
కీర్తీ సురేశ్, సమంత, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు నటించారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంత నటించారు. ఆల్రెడీ దుల్కర్‌సల్మాన్, భానుప్రియ డబ్బింగ్‌ను కంప్లీట్ చేశారట. తాజాగా సమంత కంప్లీట్ చేశారు. ‘మహానటి’ సినిమాతో తొలిసారి సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ‘‘క్రీమ్ బన్ తింటూ డబ్బింగ్‌ను కంప్లీట్ చేశా’’ అన్నారు సమంత. ‘మహానటి’ చిత్రం మే 9న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment