
ఇక్కడున్న ఫొటో చూశారుగా! తమిళ సినిమాలు ఫాలో అయ్యేవారికి అచ్చంగా ప్రముఖ నటుడు జెమినీ గణేశన్‌లాగా ఉన్నారనిపిస్తుంది కదూ! కానీ మీరు చూస్తున్న ఫొటోలో ఉన్నది మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగఅశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహానటి’. ‘నడిగర్ తిలగమ్’ అని తమిళ్‌లో టైటిల్ పెట్టారు.
సావిత్రి పాత్రలో హీరోయిన్ కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నారు. దుల్కర్‌కు సంబంధించిన సీన్స్‌ను బుధవారంతో కంప్లీట్ చేశారు. అందుకని దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను స్వప్నా దత్ నిర్మిస్తున్నారు. మోహన్‌బాబు, దర్శకుడు క్రిష్, సమంత, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే నటిస్తున్న ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment