నా కొత్త బండి ఎలా ఉంది | samantha moped ride in savithri bio pic | Sakshi
Sakshi News home page

నా కొత్త బండి ఎలా ఉంది

Dec 16 2017 12:04 AM | Updated on Dec 16 2017 12:04 AM

samantha moped ride in savithri bio pic - Sakshi

కావాలంటే పడవంత కారులో షికారు చేయవచ్చు. అనుకుంటే విమానంలో ఆనందంగా గగన విహారం చేయవచ్చు. కానీ కథానాయిక సమంత మాత్రం మోపెడ్‌ ఎక్కుతా. లూనాలో గల్లీ గల్లీ తిరుగుతా. అవసరమైతే ఎంత లొల్లికైనా డేర్‌ చేస్తా అంటున్నారీ బ్యూటీ. ఈ గాలింపు, ఈ డేరింగ్‌ ప్రస్తుతానికైతే రీల్‌ లైఫ్‌ కోసమేనండి. అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా ‘ఏవడే సుబ్రమణ్యం’ ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహానటి’. ఇందులో సావిత్రి పాత్రను కీర్తీ సురేశ్‌  చేస్తున్నారు. మోహన్‌బాబు, దుల్కర్‌ సల్మాన్, సమంత కీలక పాత్రలు చేస్తున్నారు.

సమంత జమున పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ‘‘1980కి వెళ్తున్నాం. కొందరి జీవిత చరిత్రలు అందరూ తెలుసుకోవడానికి అర్హమైనవి. అలాంటి సావిత్రిగారు జీవించిన టైమ్‌ని ఇప్పుడు రీ–క్రియేట్‌ చేసిన ప్లేస్‌లో నటించడం ఆనందంగా ఉంది. ఆ కాలం నాటి పీస్‌ (లూనా) నా చెంతకు చేరడం హ్యాపీగా ఉంది. 1960 అండ్‌ 1970లలో జరిగే సినిమా ‘మహానటి’’ అని సమంత  పేర్కొన్నారు. నా కొత్త బండి ఎలా ఉందో చెప్పండి అన్నట్లు ఇన్‌సెట్‌లో మీరు చూస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement