ఇంట్లో పులి.. భయపడ్డ జెమినీ | Keerthy Suresh Awesome Look in Mahanati | Sakshi
Sakshi News home page

ఇంట్లో పులి.. భయపడ్డ జెమినీ

Published Sun, Apr 29 2018 1:24 AM | Last Updated on Sun, Apr 29 2018 1:24 AM

Keerthy Suresh Awesome Look in Mahanati - Sakshi

కీర్తీ సురేశ్‌

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన చిత్రం ‘మహానటి’. కీర్తీ సురేశ్‌ సావిత్రి పాత్రను పోషించారు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్‌ బ్యానర్స్‌పై ప్రియాంకా దత్త్‌ నిర్మించిన ఈ సినిమా మే 11న విడుదల కానుంది. దుల్కర్‌ సల్మాన్, సమంత, విజయ్‌ దేవరకొండ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ ‘మహానటి’లో సావిత్రి గురించి మనందరికీ తెలియని సావిత్రి ఇష్టాలు, గమ్మతైన అలవాట్లు చూపించనున్నారు. అందులో కొన్ని...

► సావిత్రి కార్లను ఎక్కువగా ఇష్టపడేవారు. రేస్‌ కార్‌ డ్రైవర్‌ కూడా. ఒకానొక సమయంలో చెన్నైలో ఎక్కువ రేస్‌ కార్ల కలెక్షన్‌ సావిత్రి దగ్గరే ఉండేది. ఇక్కడ కీర్తీ సురేశ్‌ కారు పక్కన నిలబడి ఇచ్చిన పోజు సినిమాలోనిదే.

► ఓసారి మైసూర్‌ వెళ్లినప్పుడు మైసూర్‌ మహారాజ్‌ ప్యాలెస్‌లో టైగర్స్‌ ఉండటం గమనించిన సావిత్రి, పిల్లలు ఆడుకోవటానికి ఒకదాన్ని ఇంటికి తీసుకువెళ్లారట. ఇంట్లో సడన్‌గా పులిని చూసిన ఆమె భర్త ‘జెమినీ’ గణేశన్‌ భయపడ్డారట.

► సావిత్రి విపరీతమైన స్పోర్ట్స్‌ అభిమాని. బ్యాడ్‌మింటన్, షటిల్‌ ఎక్కువగా ఆడేవారు.

► స్విమ్మింగ్‌ మీద అమితమైన ఇష్టంతో ఇంట్లోనే ఓ పెద్ద స్మిమ్మింగ్‌ పూల్‌ని కట్టించుకున్నారు.

► సావిత్రికి గోల్డ్‌ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఏకంగా ఒక  కంసాలిని ఇంట్లో పెట్టుకున్నారట. తనకు నచ్చిన డిజైన్‌తో జ్యూయలరీ తయారు చేయించుకునేవారట. అలాంటి నగలనే సినిమాలో కీర్తీ వాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement