Mahanaty
-
సావిత్రిగారి పేరే నా పేరు
పేరు మధురవాణి. అమ్మాయి క్యారెక్టర్ గోల్డ్. చదువులో గోల్డ్ మెడలిస్ట్. మధురంగా మాట్లాడుతుంది కదా అని మధురవాణి మాటల మత్తులో పడ్డారో అంతే. మొత్తం కూపీ లాగేస్తుంది. ఎందుకంటే మధురవాణి జర్నలిస్ట్ కాబట్టి. పైన ఉన్న ఫొటో చూశారుగా. ఎన్ని పేపర్స్ అండ్ ఫైల్స్‌తో మధ్యలో మధురవాణి ఉన్నారో. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహానటి’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించారు. కీర్తీ సురేష్, సమంత, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు నటించారు. షూటింగ్ కంప్లీటైంది. సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. ఏయన్నార్ పాత్రలో నాగచైతన్య నటించగా, మధురవాణి పాత్ర పోషించారు సమంత. ‘‘నా పేరు కన్యాశుల్కంలో సావిత్రిగారి పేరే. మధురవాణి (బీఏ గోల్డ్ మెడల్)’’ అంటూ ‘మహానటి’ సినిమాలో సమంత లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. అన్నట్లు.. మధురవాణి భలేగా ఉన్నారు కదండీ. ‘మహానటి’ సినిమాను మే 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సావిత్రీ ఇంకొంచెం బరువు పెరగాలమ్మా!
మలయాళీ కుట్టి కీర్తీ సురేశ్ కొంచెం బొద్దుగానే కనిపిస్తారు. ఇతర కథానాయికలతో పోలిస్తే ఆమె కాస్త లావుగానే ఉంటారనే చెప్పుకోవాలి. కానీ, దర్శకుడు నాగ అశ్విన్‌కు మాత్రం ఈ మలయాళీ కుట్టి సన్నగా కనిపించారు. వెంటనే... ‘ఇంకొంచెం బరువు పెరగలామ్మా’ అని రిక్వెస్ట్ చేశారట! ఎందుకంటే... ఆయన కీర్తీ సురేశ్‌ను కథానాయికగానో... కీర్తీ సురేశ్గానో... చూడడం లేదు. ఆమెలో అలనాటి మేటినటి సావిత్రిని చూస్తున్నారు. సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ అశ్విన్ రూపొందిస్తున్న ‘మహానటి’లో కీర్తీ సురేశ్ సావిత్రిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అశ్వినీదత్ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. సావిత్రి యంగ్‌స్టర్‌గా ఉన్నప్పటి సీన్స్ తీస్తున్నారిప్పుడు. ముప్ఫై–నలభై ఏళ్ల వయసులో సావిత్రి కొంచెం లావుగా, బొద్దుగా ఉండేవారు. సో, సావిత్రిగా నటిస్తున్న కీర్తీ సురేశ్ కూడా కథ పరంగా కొన్ని సీన్స్‌లో లావుగా కనిపించాలి కదా! అందుకే, దర్శకుడు కీర్తీ సురేశ్‌ను బరుపు పెరగమని అడిగారన్న మాట!