సావిత్రీ ఇంకొంచెం బరువు పెరగాలమ్మా!
మలయాళీ కుట్టి కీర్తీ సురేశ్ కొంచెం బొద్దుగానే కనిపిస్తారు. ఇతర కథానాయికలతో పోలిస్తే ఆమె కాస్త లావుగానే ఉంటారనే చెప్పుకోవాలి. కానీ, దర్శకుడు నాగ అశ్విన్‌కు మాత్రం ఈ మలయాళీ కుట్టి సన్నగా కనిపించారు. వెంటనే... ‘ఇంకొంచెం బరువు పెరగలామ్మా’ అని రిక్వెస్ట్ చేశారట! ఎందుకంటే... ఆయన కీర్తీ సురేశ్‌ను కథానాయికగానో... కీర్తీ సురేశ్‌గానో... చూడడం లేదు. ఆమెలో అలనాటి మేటినటి సావిత్రిని చూస్తున్నారు.
సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ అశ్విన్ రూపొందిస్తున్న ‘మహానటి’లో కీర్తీ సురేశ్ సావిత్రిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అశ్వినీదత్ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. సావిత్రి యంగ్‌స్టర్‌గా ఉన్నప్పటి సీన్స్ తీస్తున్నారిప్పుడు. ముప్ఫై–నలభై ఏళ్ల వయసులో సావిత్రి కొంచెం లావుగా, బొద్దుగా ఉండేవారు. సో, సావిత్రిగా నటిస్తున్న కీర్తీ సురేశ్ కూడా కథ పరంగా కొన్ని సీన్స్‌లో లావుగా కనిపించాలి కదా! అందుకే, దర్శకుడు కీర్తీ సురేశ్‌ను బరుపు పెరగమని అడిగారన్న మాట!