సావిత్రి బయోపిక్‌ మహద్భాగ్యం | aswanidath Prices Savitri biopic | Sakshi
Sakshi News home page

సావిత్రి బయోపిక్‌ మహద్భాగ్యం

Published Sat, May 12 2018 8:29 AM | Last Updated on Sat, May 12 2018 9:04 AM

aswanidath Prices Savitri biopic - Sakshi

తిరుపతి కల్చరల్‌: దక్షిణ భారత సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి సావిత్రి బయోపిక్‌పై చిత్రం తీయడం మహద్భాగ్యమని వైజయంతీ మూవీస్‌ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌  ఉద్ఘాటించారు. శుక్రవారం రాత్రి తిరుపతి ప్రతాప్‌ థియేటర్‌లో ఆయన మహానటి చిత్రాన్ని తిలకించారు. ఆయనకు టీటీడీ ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి పుష్పగుచ్ఛంతో ఘనంగా స్వాగతం పలికారు. అశ్వనీదత్‌ మాట్లాడుతూ తాను నిర్మించిన మొదటి చిత్రం ఎదురులేని మనిషి నుంచి నేటి మహానటి వరకు చిత్రాలను ప్రదర్శించి.. తనకు విజ యాలు అందిస్తున్న తిరుపతి గ్రూప్‌ థియేటర్స్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ చిత్ర నిర్మాణ సమయంలో పూర్వ నటీ నటులను, నిర్మాతలను తలుచుకునే అవకాశం లభించిందని తెలి పారు. టెక్నీషియన్స్‌ అందించిన సహకారం మరువలేనిదన్నారు. ప్రస్తుతం తాను నిర్మాతగా నాగార్జున, నానితో నిర్మిస్తున్న చిత్రం 40 శాతం పూర్తి కావచ్చిందని తెలిపారు. జూన్‌ 9 నుంచి మహేష్‌బాబు చిత్రం ప్రారంభమవుతుందని చెప్పారు. తర్వాత తమిళ, హిందీ దర్శకులతో కొత్త ప్రాజెక్టులు చేయనున్నట్లు వెల్ల డిం చారు. ఈ కార్యక్రమంలో గ్రూప్‌ థియేటర్స్‌ మేనేజర్‌ సిద్ధారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement