మోహన్‌బాబు
పౌరాణికాలు, కమర్షియల్ చిత్రాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు ఎస్వీ రంగారావు. ‘మాయాబజార్’లో ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు..’ అంటూ ‘ఘటోత్కచుడు’ పాత్రను ఆయన పోషించిన తీరుని ఎవ్వరం మర్చిపోలేం. ఇప్పుడు సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో మాయాబజార్ సినిమాలోని ‘ఘటోత్కచుడు’ క్యారెక్టర్‌ను చూపించనున్నారు.
ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు యాక్ట్ చేశారు. ఘటోత్కచుడిగా మోహన్‌బాబు లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ లుక్‌కి మంచి స్పందన లభించింది. సావిత్రిగా కీర్తీ సురేశ్ నటించిన ‘మహానటి’ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment