అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’.. నాగ్ అశ్విన్ దర్శకుడిగా వైజయంతి మూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, కేవీ రెడ్డిగా క్రిష్ కనిపించనున్నారంటూ ప్రకటించిన చిత్ర బృందం శనివారం నాని చేతుల మీదుగా వీడియోలను విడుదల చేసింది. కాగా ఇవాళ ఎస్వీ రంగారావు పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని పంచుకుంది. ఇందులో మోహన్‌బాబు అచ్చం ఎస్వీరంగారావులా కనిపించి, ఆకట్టుకున్నారు.
‘పౌరాణికమైనా, సాంఘీకమైనా.. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడు మన ఎస్వీ రంగారావు. ‘వివాహ భోజనంబు’ అంటే ‘వింతైన వంటకంబు’ అని అనని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆ ఘనత ఎస్వీ రంగారావుదే. అలాంటి మహానటుడిని మాయ శశిరేఖగా అనుకరించి మనందరి మన్ననలు పొందారు మన మహానటి సావిత్రి. అలాంటి మహానటుడి పాత్రలో మనముందుకు రాబోతోంది ఎవరు అనుకుంటున్నారా? అవును.. మీ గెస్ కరెక్ట్.. వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్‌బాబు గారికే అది సాధ్యం’ అంటూ నాని ఆ పాత్రను వీడియోలో పరిచయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment