మహానటిలో మోహన్ బాబు
అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, ప్రకాష్ రాజ్, షాలిని పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సావిత్రి నిజజీవితంలో కీలక పాత్రలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలను యంగ్ హీరోలతో చేయించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక అలనాటి మహానటుడు ఎస్వీ రంగారావు పాత్రలో సీనియర్ నటుడు మోహన్ బాబు అలరించనున్నారు. చాలా రోజులుగా ఈ వార్త వినిపిస్తున్నా.. ఇంత వరకు అధికారిక సమాచారం లేదు. అయితే తాజాగా మంచు లక్ష్మీ ఓ పత్రికలో వచ్చిన వార్తను రీట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.
— Lakshmi Manchu (@LakshmiManchu) 16 September 2017