మహానటుడిగా మోహన్ బాబు..?
అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆదారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు ఇంకా నటీనటుల ఎంపిక జరుగుతోంది.
సావిత్రి నిజజీవితంలో కీలక పాత్రలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలను యంగ్ హీరోలతో చేయించాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అలనాటి మహానటుడు ఎస్వీ రంగారావు పాత్ర సీనియర్ నటుడు మోహన్ బాబు ను సంప్రదిస్తున్నారట. ప్రస్తుతానికి మోహన్ బాబు క్యారెక్టర్ పై అధికారిక సమాచారం లేకపోయినా.. ఎస్వీఆర్ నటన, దర్పం తెర మీద చూపించాలంటే మోహన్ బాబు అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారు.