SV ranga rao
-
టెన్నీస్ ఆడి పాతాళభైరవి సినిమాకు సెలక్టైన ఎన్టీఆర్..!
పాతాళ భైరవి.. 1951లో రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో 28 కేంద్రాలలో హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకొన్న మూవీ. కేవీ రెడ్డి డైరక్షన్లో ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావులు పోటీ పడి మరీ నటించారు. ఉజ్జయిని రాజకుమారిని ప్రేమించిన తోటరాముడు సర్వ సంపన్నుడు కావడానికి నేపాల మాంత్రికుణ్ణి ఆశ్రయిస్తాడు. ఐతే తోటరాముణ్ణి బలిచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందాలన్నది మాంత్రికుడి ఆలోచన. చివరకు మాంత్రికుడ్ని తోటరాముడు ఎలా మట్టుబెట్టాడన్నదే కథ. (చదవండి: తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు)మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథల్లోని ఓ కథ ఇది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడే ఇలాంటి పాంటసీ ఫిలిం చేయాలనే ఆలోచన రావడం.. అనుకున్నదాన్ని అత్యద్భుతంగా తీసి.. చరిత్రలో నిలిచిపోయేలా చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి.పాతాళభైరవిలో తోటరాముడి రోల్‌కు తొలుత అక్కినేని నాగేశ్వరరావుని, మాంత్రికుడి పాత్రకు గోవిందరాజుల సుబ్బారావు లేదా ముక్కామలను అనుకున్నారట డైరక్టర్. ఓ రోజు వాహినీ స్టూడియో ప్రెమిసెస్‌లో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు టెన్నిస్ ఆడుతుంటే కేవీరెడ్డి అక్కడికొచ్చారు. ఇద్దరు హీరోలూ ఆటలో లీనమైపోయారు. రెండు మూడు సార్లు బాల్ రాకెట్‌కు తగలకపోవడంతో ఎన్టీఆర్‌కు కోపమొచ్చి నెక్ట్స్ బాల్‌ను బలంగా బాదారట. దాంతో అది అడ్రస్ లేకుండా పోయింది. అప్పుడు ఎన్టీఆర్ రాకెట్‌ను పట్టుకున్న విధానం డైరక్టర్ కేవీ రెడ్డికి బాగా నచ్చేయడంతో తోటరాముడి రోల్‌కు ఆయన్ను సెలక్ట్ చేసుకున్నారట. హీరోగా పెద్దగా ఇమేజీ లేని యాక్టర్‌ను తీసుకోవడంతో విలన్‌ను కూడా ముక్కామల కాకుండా కొత్తవాడై ఉండాలని ఎస్వీఆర్ను తీసుకున్నారట. అంటే అప్పటికి ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లు ఇద్దరూ కూడా పెద్దగా పేరున్న నటులు కాదన్నమాట.(చదవండి: టీమిండియా జట్టు వరకు పాకిన 'పుష్ప' క్రేజ్)అప్పట్లో సినిమాలకు డూప్‌లుండేవారు కారు. పాతాళభైరవిలోనూ ఎక్కడా డూప్‌లను పెట్టలేదు. ప్రతిదీ నేర్చుకోవాలన్న ఉత్సాహం అప్పటి నటుల్లో ఉండేది. తెల్లవారుజామున 4.30గంలకే ఎస్వీఆర్, ఎన్టీఆర్‌లు వాహిని స్టూడియోకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన సాండ్ కోర్టులో ఫైట్స్ రిహార్సిల్స్ చేసేవారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ 250 రూపాయలట. అంతేకాదు విజయా సంస్థ కోసం రెండేళ్లలో నాలుగు సినిమాలు చేయాలని ఒప్పందం కూడా జరిగిపోయింది. ఘంటసాల పాటలు ఎవర్ గ్రీన్, మార్కస్ బార్ట్లే కెమెరా మాయాజాలం సినిమాకు ప్రాణం పోశాయి.1952 జనవరిలో గోవాలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారత్ నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక సినిమా పాతాళ భైరవే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా సినిమా కూడా ఇదే. తెలుగులో 1951 మార్చి 15న రిలీజైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది. 1980లో జితేంద్ర హీరోగా ఇదే సినిమాను సూపర్‌స్టార్ కృష్ణ హిందీలో కలర్లో తీశారు. ఈ సినిమాలోని సాహసం సేయరా డింభకా.. రాకుమారి దక్కునురా.. అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. - అలిపిరి సురేష్ -
Missamma Movie: ఆ హీరోయిన్‌పై నిర్మాత ఆగ్రహం.. సావిత్రికి అవకాశం
1955 జనవరి 12న విడుదలైన ‘మిస్సమ్మ’ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్. చక్రపాణి నిర్మాతగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది. ‘మిస్సమ్మ’ మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి దిగ్గజ నటులు ప్రధాన పాత్రలు పోషించారు. హీరోయిన్ సావిత్రికి జమున చెల్లిగా నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘మిస్సమ్మ’. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయినప్పటికీ ఈ సినిమాలో ఎలాంటి కమర్షియల్ హంగులూ ఉండవు. చక్కని హాస్యం, భావోద్వేగాలు, గిల్లికజ్జాలతో సాగుతుంది. సాలూరి రాజేశ్వరరావు అందించిన మ్యూజిక్ ఓ మ్యాజిక్.భానుమతి ప్లేస్‌లో సావిత్రి ‘మిస్సమ్మ’లో ఎస్వీ రంగారావు, సావిత్రి నటన... ఎన్టీఆర్, ఏఎన్నార్లను డామినేట్ చేసేలా ఉంటుంది. సావిత్రి హీరోయిన్గా ఎదుగుతున్న రోజుల్లో వచ్చిన ఈ సినిమా ఆమె కెరీర్‌కి చాలా ప్లస్ అయ్యింది. తన ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో ఆత్మవిశ్వాసం కలిగిన స్ట్రాంగ్ లేడీ రోల్ సావిత్రిది. అలాగే ముక్కోపి. ఈ పాత్రకు భానుమతి కరెక్ట్ అని తొలుత దర్శక–నిర్మాతలు భావించారు. అప్పటికే ఆమె పరిశ్రమకు వచ్చి చాలా ఏళ్లయింది. ‘మల్లీశ్వరి’ వంటి బ్లాక్ బస్టర్లో నటించారు. నిజ జీవితంలో భానుమతి వ్యక్తిత్వం... ‘మిస్సమ్మ’లో మేరీ పాత్రలా ఉంటుంది. భానుమతితో ‘మిస్సమ్మ’ షూటింగ్ కొంత మేర జరిగింది కూడా. అయితే ఓ రోజు ఆమె షూటింగ్‌కి ఆలస్యంగా వచ్చారట. దీంతో నిర్మాత చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం షూటింగ్ అయితే మధ్యాహ్నం రావడమేంటి క్షమాపణలు చెప్పాలన్నారట. అయితే... ఆలస్యమవుతుందని మేనేజర్‌తో కబురు పంపానని... కాబట్టి క్షమాపణలు చెప్పేది లేదన్నారట భానుమతి. దీంతో చక్రపాణి ఆమెను సినిమా నుంచి తొలిగించి అప్పటివరకు షూట్ చేసిన రీల్స్‌ను తగలబెట్టేశారట. అలా ‘మిస్సమ్మ’లో మెయిన్ హీరోయిన్గా చేస్తున్న భానుమతి స్థానంలోకి సావిత్రి వచ్చారు. లేదంటే హీరోయిన్ చెల్లెలుగా చేసిన జమున పాత్ర చేయాల్సి వచ్చేది. బెంగాలీ నవల మన్మొయీ గర్ల్స్ స్కూల్ అనే హాస్య రచన ఆధారంగా నిర్మాత చక్రపాణి ‘మిస్సమ్మ’ తెలుగు కథను సమకూర్చారు. సినిమా చిత్రీకరణంతా మద్రాసు చుట్టు పక్కలే జరిగింది. ‘మిస్సమ్మ’ను తమిళంలో మిస్సియమ్మగా ఏక కాలంలో చిత్రీకరించారు. ఇందులో జెమినీ గణేశన్, సావిత్రి నటించారు. తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ కూడా కమర్షియల్‌గా బంపర్ హిట్టయ్యాయి. 1957లో ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాను హిందీలోనూ తీసింది. హిందీలో మేరి పాత్రను మీనాకుమారి పోషించగా ‘మిస్ మేరి’గా నిర్మించారు. ఇది ఎల్వీ ప్రసాద్‌కి బాలీవుడ్లో దర్శకుడిగా తొలి చిత్రం.– ఇంటూరు హరికృష్ణ -
రూ.2 లక్షల బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రం.. ‘మాయా బజార్’ రికార్డులెన్నో!
చరిత్ర గాని, పురాణాలు గాని... వీటిలో మనకు ఏమాత్రం నచ్చని విషయాల్ని మనకు నచ్చిన విధంగా ఓ కల్పిత కథను తయారు చేసుకుని ప్రేక్షకుడ్ని ఆనందింపజేయడాన్ని ఆల్టర్నేటివ్ హిస్టరీ అని అంటారు. ఉదాహరణకు హిట్లర్ని ఓ థియేటర్లో బంధించి కాల్చి హతమార్చడం, మహాభారతంలో కౌరవుల కుతంత్రాలను బట్టబయలు చేసి వాళ్లని నవ్వులపాలు చేయడం వంటివి. ఇలాంటి ప్రత్యామ్నాయ చరిత్ర కలిగిన కథలు మన అహాన్ని సంతృప్తిపరుస్తాయి కాబట్టి స్వతహాగానే వాటివైపు ఆకర్షితులవుతాం. సరిగ్గా అలాంటి కోవకు చెందినదే ‘మాయాబజార్’ సినిమా. ఈ చిత్రం లక్ష్యం కూడా అదే.మాయాబజార్ అను శశిరేఖా పరిణయంగా...వ్యాస భారతం ప్రకారం బలరాముడుకి శశిరేఖ అని పిలువబడే కూతురే లేదు. మాయాబజార్ నిజానికి శశిరేఖా పరిణయం అనే పేరుతో మన దగ్గర ప్రసిద్ధిగాంచిన ఓ కల్పిత జానపద కథ. దీని ఆధారంగా ‘మాయాబజార్’కి ముందు, తరువాత అనేక చిత్రాలు రూపొందినా కేవీ రెడ్డి రూపొందించిన ఈ ఒక్క సినిమా మాత్రమే అత్యంత ప్రజాదరణకు నోచుకుంది.‘మాయాబజార్’కు తొలుత చాలా పేర్లనే అనుకున్నారు. సినిమాలో ఘటోత్కచుడు పాత్రను ఎస్వీ రంగారావు చేశారు కాబట్టి ముందుగా ఈ సినిమా పేరును ఘటోత్కచుడు అని పెట్టాలని అనుకున్నారట. తర్వాత శశిరేఖా పరిణయం అని పేరు పెట్టారు. ఆ తర్వాత దానిని మాయాబజార్ అను శశిరేఖా పరిణయంగా మార్చారు. చివరికి విడుదలయ్యే సమయానికి అది ‘మాయాబజార్’గా మిగిలింది. ‘మాయాబజార్’ కథకు ఉన్న లక్ష్యం కేవలం శశిరేఖకు, అభిమన్యుడికి పెళ్లి చెయ్యటం కాదు... కొన్ని కారణాల వల్ల వంచించబడ్డ శశిరేఖ తల్లిదండ్రుల మనసు మార్చటం, కౌరవులను నవ్వులపాలు చేసి, వాళ్లని దండించబడటం ఈ కథలోని అంతిమ లక్ష్యం. కృష్ణుడు బలరాముడికి హితబోధ చేసినా, అభిమన్యుడు లక్ష్మణ కుమారుడితో యుద్ధానికి దిగినా శశిరేఖా పరిణయం సాధ్యమయ్యేది.. కానీ కథకున్న అంతిమ లక్ష్యం సాధ్యపడేది కాదు.చిన్న కథ... బలమైన స్క్రీన్ప్లేనిజానికి ‘మాయాబజార్’ కథ చాలా చిన్నది. అయితే బలమైన స్క్రీన్ ప్లేతో దీనిని రక్తి కట్టించారు దర్శకులు కేవీ రెడ్డి. ప్రథమార్ధం కేవలం నాటకీయత మాత్రమే ఉంటుంది. ఆ నాటకీయ పరిణామాలు ఇప్పటికీ సమకాలీన పరిస్థితుల్లానే అనిపిస్తాయి. అమ్మాయి–అబ్బాయి ప్రేమలో పడటం, ఆ ప్రేమకి తల్లిదండ్రులు అడ్డు చెప్పటం, తల్లి కూతుర్ని కొట్టడం, డబ్బు పోగానే ముఖం చాటేసే చుట్టాలు, తండ్రిని ప్రశ్నించే ధైర్యం లేని కూతురు... వంటివి ఇప్పటికీ ప్రతీ ఇంట్లో కనిపించేవే. ప్రేక్షకుడిని ఈ వాస్తవిక పరిస్థితులు ముందుగా కథతో కనెక్ట్ చేస్తాయి. ప్రథమార్ధమంతా లక్ష్యానికి పూర్తిగా దూరం చేసి, ఇక ఏ రకమైన ఆశ మిగలని స్థితికి తీసుకెళ్లి, ఘటోత్కచుడు ప్రవేశించడంతో వడివడిగా లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తారు. పూర్తి విషాదం తర్వాత వచ్చే ఆనందానికి విలువ ఎక్కువ ఉంటుంది. కౌరవుల్ని ఏమీ చెయ్యలేం అనుకునే మాన సిక స్థితికి ప్రేక్షకుడ్ని తీసుకొచ్చి, తర్వాత వాళ్లని వెర్రివాళ్లని చేసి ఆడుకోవటం వల్ల వచ్చే కిక్కు మామూలుగా ఉండదు.ఎస్వీఆర్ మీదే ప్రమోషన్!66 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలోని సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకోవడానికి కారణం కెమెరామేన్ మార్కస్ బార్ట్ లీ. గ్రాఫిక్స్ లేని కాలంలో కెమెరా టెక్నిక్స్‌తో సృష్టించిన మాయాజాలానికి అప్పట్లో ప్రేక్షకులు నిశ్చేష్ఠు లయ్యారు. నిజంగా మాయ జరుగుతున్నట్టుగానే భావించారట. ముఖ్యంగా వివాహ భోజనంబు పాటలో లడ్డూలన్నీ నోట్లోకి సరాసరి వెళ్ళిపోవడం, ఆహార పాత్రలన్నీ వాటికవే కదలడం.. వంటి సీన్లకు మంత్రముగ్ధులయ్యారు. ఈ సినిమాలోనే ఎన్టీఆర్ మొదటిసారిగా శ్రీకృష్ణుడిగా కనిపించారు. అంతకు ముందు 1954లో వచ్చిన ‘ఇద్దరు పెళ్ళాలు’, 1956లో వచ్చిన ‘సొంతవూరు’ సినిమాల్లో కృష్ణుడిగా కనిపించినప్పటికీ, అవి పూర్తి స్థాయి కృష్ణుడి పాత్రలు కావు. ‘మాయాబజార్’ టైమ్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మార్కెట్ కన్నా ఎస్వీఆర్ మార్కెట్ ఎక్కువ. జనాల్లో పాపులారిటీ కూడా ఎక్కువే. అందుకే రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రమోషన్లను ఎస్వీఆర్ పేరు మీదే చేశారట.రెండు లక్షల బడ్జెట్‌తో...‘మాయాబజార్’ను సుమారు రెండు లక్షల బడ్జెట్‌తో నిర్మించారు. అప్పట్లో తెలుగులో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ఇదే. సాధారణంగా 30 వేల బడ్జెట్‌ను మించి సినిమాలు తీయడానికి అప్పట్లో నిర్మాతలు సాహసించేవారు కాదు. కానీ ‘మాయాబజార్’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయా ప్రొడక్షన్స్ ఖర్చుకు వెనకాడలేదు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిన తొలి సినిమా కూడా ఇదే. ఆ తరువాత ఈ సినిమాను హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో డబ్ చేశారు. విడుదలైన అన్నిచోట్లా విజయాన్ని అందుకుంది. అంటే ఒక విధంగా ‘మాయాబజార్’ని తొలి పాన్ ఇండియా మూవీ అనొచ్చేమో. అందుకే నాటికైనా నేటికైనా మరెప్పటికైనా ‘మాయాబజార్’ అనేది ఓ గోల్డ్ మెమరీ. – ఇంటూరు హరికృష్ణ -
SV రంగారావు గారు నా పాట కోసం షూటింగ్ వదిలేసి వచ్చేవారు
-
నటి రోజా రమణి మాటలో SV రంగారావు..!
-
SV రంగారావుకి మేకప్ ఎన్ని గంటలు వేసేవారంటే..
-
అప్పట్లో SV రంగారావు రెమ్యూనరేషన్ ఎంత?
-
SV రంగారావు ఎవరో నాకు తెలీదు
-
సావిత్రి తో షూటింగ్ తర్వాత ఇంటికి వచ్చి భార్యతో SVR ఏం చెప్పేవారంటే..
-
ఎస్.వి. రంగారావు నాతో ఎలా ఉండేవారంటే..
-
SV Ranga Rao: ప్రతి దీపావళి స్డూడియో స్టాఫ్‌కి కొత్త నోట్లు ఇచ్చేవారు
ఎస్. వి. రంగారావు... నిండైన విగ్రహం... వెండితెర మీద కనపడగానే ప్రేక్షకుల చప్పట్లు, ఈలలు ఒక్కసారి కళ్లు చిట్లించి, పెదవి విరిచి, తల కొద్దిగా ఆడిస్తే.. ప్రేక్షకులకు మైమరపే.. మాట పెదవి దాటకుండానే భావం ముఖంలో కనపడుతుంది.. ఘటోత్కచుడు, రావణుడు, కీచకుడు, నేపాళ మాంత్రికుడు, హిరణ్యకశిపుడు.. ఇంటి పెద్దన్నయ్య, మతిమరపు తండ్రి.. ఏ పాత్రయినా ఆయనలో జీవిస్తుంది.. ఆయనపై కోపం తెప్పిస్తుంది. ‘బానిసలకు ఇంత అహంభావమా’, ‘ఎవరూ సృష్టించనిదే మాటలు ఎలా పుడతాయి’ ‘సాహసం సాయరా రాజకుమారి దొరుకుతుంది’ ‘జై పాతాళభైరవీ’ ఈ మాటలు వేటికవే ప్రత్యేకం.. మాయా బజార్, పండంటి కాపురం, బాంధవ్యాలు, నర్తనశాల, సంపూర్ణ రామాయణం, భక్త ప్రహ్లాద.. ఎన్ని చెప్పినా ఏదో ఒకటి మరచిపోయినట్లే. నటనే శ్వాసగా జీవించి, నటిస్తూనే తుదిశ్వాస విడిచారు.ఆయన మేనల్లుడు, ఆయన దగ్గరే పెరిగిన ఉదయ్ కుమార్ బడేటి.. ఎస్. వి. రంగారావు మావయ్య గురించి సాక్షికి వివరించారు. SV Ranga Rao Birth Anniversary: మా మావయ్య కృష్ణా జిల్లా నూజివీడులో జూలై 3, 1918లో జన్మించారు. తండ్రి సామర్ల కోటేశ్వరరావు ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్, తల్లి లక్ష్మీ నరసాయమ్మ. మావయ్య వాళ్లు నలుగురు అన్నదమ్ములు, ఏడుగురు అక్కచెల్లెళ్లు. మావయ్య వాళ్ల తాతగారు కోటయ్యనాయుడు పేరున్న డాక్టరు. మావయ్యకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి విజయలక్ష్మి, అల్లుడు (మేనల్లుడు) సూర్యవరప్రసాద్ శృంగారం, డల్లాస్‌లో ఉంటున్నారు. రెండో అమ్మాయి ప్రమీలారాణి, అల్లుడు సత్యనారాయణ కడిం హైదరాబాద్‌లో ఉంటున్నారు. అబ్బాయి పేరు కోటేశ్వరరావు కాలం చేశాడు. నేను మావయ్య ఆరవ చెల్లెలి కొడుకును. అమ్మ పేరు శకుంతల. బెత్తంతో దెబ్బలు.. మావయ్య వాళ్లని మంచి చదువులు చదివించాలనే ఉద్దేశంతో, మావయ్య వాళ్ల నాయనమ్మ.. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లతో చెన్నై ట్రిప్లికేన్‌లో ఇల్లు తీసుకుని, హిందూ హైస్కూల్లో మావయ్యను పదో తరగతి వరకు చదివించారట. ఆ తరవాత వైజాగ్‌లో ఇంటర్, కాకినాడ పీఆర్ కాలేజీలో బీఎస్సీ చదువుకున్నారు. అక్కడే యంగ్ మెన్స్ క్లబ్లో నాటకాలు వేసేవారట. మావయ్యకు చదువు మీద కంటే, సినిమాలంటేనే ఇష్టం. ప్రతిరోజూ సెకండ్ షోకి వెళ్లేవారట. ఇందుకోసం తమ్ముడితో కలిసి ముందు గదిలో పడుకుని, తమ్ముడి కాలి వేలికి ఒక దారం కట్టి, సినిమా నుంచి రాగానే తమ్ముడి కాలి దారాన్ని లాగ్గానే, తలుపు తీస్తే, వచ్చి పడుకునే వారట మావయ్య. ఒకరోజు కరెంటు పోయిన సమయంలో, మావయ్యను నిద్ర లేపడానికి వాళ్ల నాయనమ్మ వచ్చేసరికి అక్కడ మావయ్య స్థానంలో తలగడలు ఉన్నాయిట. అప్పుడు ఆవిడ తాడును పట్టుకుని మావయ్య వచ్చేవరకు కూర్చుని, రాగానే బెత్తంతో నాలుగు దెబ్బలు వేసిందట. ఉదయ్ కుమార్ బడేటి అదే మొదటి శుభకార్యం... మావయ్య వివాహం 1947 డిసెంబరు 27న ఏలూరులో జరిగింది. మావయ్యది మేనరికం. అత్త పేరు లీలావతి. మావయ్య షూటింగ్‌లతో బిజీగా ఉండేవారు. ఇంటికి వచ్చినవారందరికీ అత్తయ్య వంట చేసేది. మావయ్య 1958 ఏప్రిల్ 30న చెన్నై హబీబుల్లా రోడ్డులో సొంత ఇంటి గృహప్రవేశం చేశారు. మావయ్య పెద్ద కూతురు విజయలక్ష్మి వివాహం మావయ్య వాళ్ల అక్క రాజవల్లి కుమారుడితో జరిగింది. రెండు నెలల పాటు ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. వేసవి సెలవులు మావయ్య వేసవిలో షూటింగ్‌లు లేకుండా ఖాళీ ఉంచుకుని, మా అత్తమ్మ పుట్టిల్లు ఏలూరు వెళ్లేవారు. కాకినాడలో మావయ్య స్నేహితులను కలిసేవారు. నెల్లూరు మైపాడ్ దగ్గర ‘బాంధవ్యాలు’ సినిమా షూటింగ్‌కి నన్ను అత్తయ్యను తీసుకువెళ్లి, అక్కడ మా కోసం బోట్ హౌస్ ఏర్పాటు చేయించారు. షూటింగ్ ఉన్నన్ని రోజులూ అందులోనే ఉన్నాం. అప్పుడప్పుడు మహాబలిపురం దారిలో ఉన్న తోటకు తీసుకువెళ్లేవారు. అక్కడ సరదాగా ఏదో ఒక వంటకం చేసేవారు. కోవళం బీచ్ నుంచి తాజా సముద్రపు చేపలను తీసుకువచ్చేవారు. ఆయనకు భోజనంలోకి నాలుగైదు రకాలు ఉండాలి. అందులో స్వీట్ తప్పనిసరి. మటన్ బాగా ఇష్టం. మావయ్యకు ఇష్టమైన వంటకాలను అత్తయ్య వండి పెట్టేది. ప్రతి దీపావళికి బ్యాంక్ నుంచి కొత్త నోట్లు తెచ్చి స్డూడియో స్టాఫ్‌కి ఇచ్చేవారు. మా అందరికీ కొత్త బట్టలు, ఎన్ని రోజులు కాల్చినా తరగనన్ని టపాసులు తెచ్చేవారు. దసరా పండుగకు బొమ్మల కొలువుతో సందడిగా ఉండేది. మల్టీ టాలెంటెడ్.. మావయ్య ఆల్‌రౌండర్. హంటింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో డబుల్ బ్యారెల్ గన్, రైఫిల్, రివాల్వర్ ఉండేవి. ఖాళీ దొరికితే బొమ్మలు వేసేవారు. కవిత్వం రాసేవారు. బాగా మూడ్ వస్తే ఎస్. రాజేశ్వరరావు సోదరులు ఎస్ హనుమంతరావును పిలిపించి, సరదాగా ట్యూన్స్ చెప్పేవారు. పుస్తకాలు ముఖ్యంగా షేక్స్పియర్ పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. ఆయన అప్పట్లో ‘యువ’లో రాసిన కథలను సేకరించి తిరుపతి ‘కథాప్రపంచం’ వారు పుస్తకం ప్రచురించారు. ప్రకృతి ప్రేమికులు.. ఇంట్లో కుక్కలు, పావురాలు, ఆక్వేరియం ఉండేవి. 24వేల చదరపు అడుగుల స్థలంలో పూల మొక్కలతో పాటు పెద్ద పెద్ద చెట్లు పెంచారు. మామిడి చెట్లకు కాసిన పెద్ద పెద్ద కాయలను అందరికీ పంచేవారు. ఆయనకు నూజివీడు రసాలు, బంగినపల్లి చాలా ఇష్టం. వాచీలు, సిగరెట్ లైటర్లు సేకరించేవారు. ఇంట్లో ఉన్న 16 ఎంఎం ప్రొజెక్టర్ కెమెరాలో సినిమాలు వేసి చూపించే వారు. ప్రివ్యూ చూశాక, సినిమా ఎలా ఉందని అడిగేవారు. మావయ్య ఈజ్ స్పెషల్... తిరుపతి వచ్చిన వారంతా టూరిస్టు బస్సులలో మావయ్యను చూడటానికి చెన్నై వచ్చేవారట. గేటు తీయగానే పరుగుపరుగున లోపలకు వచ్చి, సంతకాలు తీసుకుంటూ, దేవుడిని చూసినట్లు చూసేవారట. మావయ్య చూడటానికి భారీ విగ్రహంలా ఉన్నప్పటికీ చాలా సింపుల్‌గా ఉండేవారు. మా కోసం క్రికెట్ వీఐపీ పాస్‌లు తెప్పించేవారు. ఆయనకు ఖాళీ ఉంటే వెళ్లేవారు. లేదంటే రేడియోలో కామెంటరీ వినేవారు. పిల్లల సినిమాలకు ఎక్కువగా ఇంగ్లీషు సినిమాలకు మావయ్య స్వయంగా తీసుకువెళ్లేవారు. మావయ్య అమెరికా వెళ్తున్నప్పుడు అందరినీ తన వెంట తీసుకువెళ్లి, అమెరికా అంతా చూపించారు. ఆయన పోయేవరకు రైలు అంటే తెలియదు. మావయ్యకు నాలుగు కార్లు ఉండేవి. విమానంలోనో, కారులోనో తిప్పేవారు. అంత అపురూపంగా చేసేవారు. ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నాం. మావయ్య మరణం మాకు చీకటి మిగిల్చింది. నా 13 సంవత్సరాల జీవితం మావయ్య దగ్గరే గడిచింది. మావయ్య మనవల్ని (ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి) పెంచాను, ఇప్పుడు వాళ్లే నన్ను చూస్తున్నారు. మావయ్య నాకు దైవం.. నా కంటే పైన ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు రామారావు. నేను పుట్టిన ఐదు నెలలకు అన్నయ్యకు బాగా అనారోగ్యం చేసింది. రెండు సంవత్సరాల పాటు అమ్మ అన్నయ్యను చూసుకోవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నన్ను అత్తయ్య మావయ్య చేరదీశారు. నేను పుట్టిన దగ్గర నుంచి ఆయన పోయేవరకు ఆయనకు సన్నిహితంగా ఉన్నాను. నన్ను మద్రాసు చర్చ్‌పార్క్ స్కూల్లో చేర్పించారు. అప్పుడప్పుడు దింపేవారు. ఆ దింపటంలో ఒక గమ్మత్తు జరిగేది. ఏదో ఆలోచించుకుంటూ స్కూల్ దగ్గర దింపటం మరచిపోయి షూటింగ్‌కి తీసుకు వెళ్లిపోయి, ‘అయ్యో మర్చిపోయానే’ అని మళ్లీ షూటింగ్ పూర్తయ్యాక ఇంటికి తీసుకువచ్చేసేవారు. ఎప్పుడైనా సినిమాల పని మీద హైదరాబాద్ వెళ్లవలసి వస్తే, నన్ను మా అమ్మ దగ్గర వదిలేసి, మళ్లీ వెనక్కు వెళ్లేటప్పుడు తీసుకువెళ్లేవారు. స్కూల్లో చేరాక కుదరలేదు. అందరితోనూ ఎంతో ప్రేమగా ఉండేవారు. ఎవరితో మనస్ఫర్థలు వచ్చినా సర్దుకుపోయేవారు. పిల్లలు ‘ఇది కావాలి’, ‘ఇది కొనుక్కుంటే బావుంటుంది’ అనుకునేలోపే వస్తువులు ఇంటికి వచ్చేసేవి. బ్రేక్‌ఫాస్ట్‌కి ఉడ్‌లాండ్స్ హోటల్‌కి తీసుకువెళ్లేవారు. నేను చిన్నపిల్లవాడిని కావటం వల్ల ఒంటి నిండా పోసుకునేవాడిని. అందుకని టిఫిన్ కారు దగ్గరకు తీసుకు వచ్చి, డాష్ బోర్డుకి హుక్ పెట్టి, దాని మీద ప్లేట్ పెట్టి తినిపించేవారు. అప్పుడప్పుడు బీచ్‌కి తీసుకు వెళ్లేవారు. బుహారీ హోటల్లో చికెన్ 65, ఐస్‌క్రీమ్, చైనీస్ హోటల్లో ప్రాన్ పకోడా పెట్టించేవారు. – ఉదయ్‌కుమార్ బడేటి (ఎస్.వి. రంగారావు మేనల్లుడు) సంభాషణ: వైజయంతి పురాణపండ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎస్వి రంగారావు అపూర్వ చిత్రాల ఫోటో గ్యాలరీ
-
అతని మాటే కాదు పాట కూడా ఘనం
‘అనగనగా ఒక రాజు... అనగనగా ఒక రాణి’... అంటూ ఆయన గురించే పాడుకున్నారు. ‘రాజశేఖరా.. నీపై మోజు తీర లేదురా’ అని నిండు దర్బార్‌లో ఆయనకే స్తోత్రాలు విడిచారు. ఎస్.వి.రంగారావు. వెండితెర సింహం. కాని ఈ సింహానికి గర్జిండమే కాదు.. వీనులకు విందు కలిగించే పాటకు తల ఆడించడం తెలుసు. పెదాలు తోడు కలపడం కూడా తెలుసు. ఎస్.వి.రంగారావంటే అందరికీ ఆయన మాటలే గుర్తుకొస్తాయి. భీషణ భాషణలే మతికి వస్తాయి. కాని వెండితెర మీద ఆయనకు మంచి పాటలు కూడా దక్కాయి. కొన్ని ఆయన పాడాడు. కొన్నింటిని ఆయన కోసం పాడారు. కొన్నింటిని ఆయన విన్నాడు. ‘నర్తనశాల’లో సైరంధ్రి అను సావిత్రి ఆయన కోసం పాడింది. పరస్త్రీ మీద ఆశ పడిన ఆ యొక్క కీచకుడిని మాయ చేయడానికి ‘దరికి రాబోకు రాబోకు రాజా’ అని పాడింది. ఆ సరసానికి ఆయన మురిసిపోయాడు. చివరకు ఆమె పరిష్వంగానికి బదులు మృత్యుపరిష్వంగంలోకి వెళ్లాడనుకోండి. అది వేరే విషయం. ఎస్.వి.ఆర్ కెరీర్ మొదలులోనే ఆయనకు ‘బంగారుపాప’లో ఎంతో మంచి పాట దొరికింది. మాధవపెద్ది సత్యం గొంతు ఆయనకు సరిగ్గా సరిపోతుందని అప్పుడే అందరికీ అనిపించింది. పాపాయిని నిద్దరుచ్చడానికి కృష్ణశాస్త్రి అందించిన మాటలను ఎస్.వి.ఆర్ ఎంతో ఆర్ద్రతతో అభినయిస్తాడు. ‘తాధిమి తకధిమి తోల్బోమ్మ.. దీని తమాష చూడవె కీల్బొమ్మ’ అని తన మునివేళ్లతో అట్టబొమ్మతో పాటు ప్రేక్షకులను కూడా ఆడిస్తాడు. కాని ఆయన రాక్షసుడు. కంసుడు ఆయనే. హిరణ్యకశిపుడు ఆయనే. భస్మాసురుడూ ఆయనే. ‘మోహినీ భస్మాసురుడు’లో ఆయన తన రాక్షస ప్రతిభతో ఏకంగా డాన్సింగ్ స్టార్ పద్మినితోనే పదం కలుపుతాడు. ‘విజయమిదిగో లభించే’ పాటలో తాండవం ఆడి చూసేవారికి భయోద్విగ్న అనుభూతి కలిగిస్తాడు. అయితే ‘మాయాబజార్’ వచ్చేసరికి ఆయన అందరికీ ప్రియమైన రాక్షసుడు అయ్యాడు. అందులో ఆయన తెలుగువారికి శాశ్వతంగా ఒక భోజనపు గీతం ఇచ్చాడు. ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు’... లడ్లను ఎగరేసి తిని మనకు తీపి మిగిల్చాడు. సావిత్రిలా ‘అహ నా పెళ్లి అంట’ పాడుతూనే మధ్యలో తనలాగా మారి ‘తధోంతోంతోం’ అని బెదరగొట్టి నవ్విస్తాడు. సోషల్ పిక్చర్స్‌లో ఆయన పాటలు ఘంటసాల గొంతుతో గుండెల్లో బరువు నింపుతాయి. జీవనమర్మాలు విప్పి చెబుతాయి. ‘బాబూ... వినరా... అన్నాదమ్ముల కథ ఒకటి’... ‘పండంటి కాపురం’లో ఈపాట ఆయన పాడుతుంటే మనింట్లో కూడా ఇలాంటి పెదనాన్న ఉండాలని అలాంటి నీడ కింద బతకాలని అనిపిస్తుంది. ‘లక్ష్మీ నివాసం’లో ‘ధనమేరా అన్నింటికీ మూలం... ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం’ పాట ఈ కలికాలంలో గీతోపదేశం కాకుండా ఎలా ఉంటుంది. ‘తాత మనవడు’లో ‘అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం... ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం’ అని ఆయన నిర్థారిస్తూ ఉంటే కాదనడానికి సిగ్గేస్తుంది. అయితే ఎస్.వి.రంగారావు అల్లరి పాటలు పాడలేదా? పాడాడు. ‘అందరూ దొంగలే’లో నాగభూషణంతో కలిసి ‘చంటి బాబు.. ఓ బుజ్జిబాబు.. నీ పంట పండితే నవాబు’ చాలా సరదాగా ఉంటుంది. చలం చేసిన ‘సంబరాల రాంబాబు’లో ఎస్.వి.రంగారావు పాత్రే కీలకం. ‘విన్నారా విన్నారా ఈ వింతను విన్నారా... సంబరాల రాంబాబు శ్రీమంతుడయ్యాడు’ అని చాలా సందడి సృష్టిస్తాడు. తెలుగులో చాలా అందమైన పాటలకు ఆయన శ్రోత. ప్రమేయకర్త. ‘బాలభారతం’లో ‘మానవుడే మహనీయుడు’ అని ఆయన సమక్షంలోనే తెలుస్తుంది. ‘మిస్సమ్మ’లో అమాయక జమీందారులా ఆయన ఆ దొంగ మొగుడూ పెళ్లాల పాటలు ఎన్ని వినలేదు. ‘రావోయి చందమామ’ అని వాళ్లు పడితే ఆ వెన్నెల తన పిల్లలదే అనుకున్నాడు. ఆయన రేడియోలో వినడం వల్లే ‘ఇది మల్లెల వేళ అనీ’ పాటకు భావ గాంభీర్యం వచ్చింది. ‘దేవుడు చేసిన మనుషులు’లో ‘విన్నారా.. అలనాటి వేణుగానం’ పాటలో పాడే ఎన్.టి.ఆర్తో పాడని ఎస్.వి.ఆర్ అంతే సరిగ్గా తుల తూగుతాడు. సామర్ల వెంకట రంగారావు అను ఎస్.వి. రంగారావు మన మనోరంజనం కోసం వెండితెర మీద మాట్లాడాడు. పద్యాలు పాడాడు. పాటలు వినిపించాడు. నేడు ఆయన జయంతి. ఒకనాటి ఆ నటుడికి కృతజ్ఞతగా నేటికీ ముకుళితం అయ్యే చేతులు ఉన్నాయని చెప్పడానికే ఈ చిన్న నివాళి. – సాక్షి ఫ్యామిలీ -
ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి
-
గన్నవరంలో చిరంజీవికి ఘన స్వాగతం
-
గన్నవరంలో చిరంజీవికి ఘన స్వాగతం
సాక్షి, గన్నవరం: మెగాస్టార్ చిరంజీవికి గన్నవరం విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం 9.00 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. చిరంజీవి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లనున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు సెంటర్లో నెలకొల్పిన తొమ్మిది అడుగుల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరిస్తారు. సెంటర్‌కు ఎస్వీఆర్ సర్కిల్‌గా నామకరణం చేస్తారు. కాగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కృషితో విగ్రహ ఆవిష్కరణకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం, చిరంజీవితో మాట్లాడటం, తేదీనిక ఖరారు చేయడంతో ఎట్టకేలకు ఆదివారం ఉదయం విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది. మరోవైపు చిరంజీవి రాక సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వేట మొదలైంది..
చీకటి. కాటుకలాంటి చీకటి. పిరికివాడి భయంలా చిక్కగా ఉండి. అడవిలో నిశ్శబ్దం చూసుకొని మరింత నల్లగా నవ్వుతోంది. ప్రమాద పరిస్థితిలో పసివాడి చిరునవ్వులా నింగిన చుక్కలు అమాయకంగా మెరుస్తున్నాయి. మొహం చెల్లక, కడుపులో ప్రమాదాలు దాచిపెట్టుకున్న చీకటి కూడా మిణుగురులతో ఇకిలిస్తుంది. పెద్ద పెద్ద చెట్లు రూపు ధరించిన చీకట్లలా లీలగా కనబడి మాయమవుతున్నాయి. మంచు కురుస్తోంది. చలి కరుస్తోంది. గాలి సన్నగా, వాడిగా రంపపు కోతలా ఒరుసుకుపోతోంది. చెవుల మీద నుంచి చోటు దొరికిన చోటాల్లా గాఢంగా గుచ్చుకుంటోంది. ఆర్కెస్ట్రాలో అసందర్భపు క్లారినెట్‌లా ఎక్కడో నక్కలు అపశ్రుతిగా అరుస్తున్నాయి...భయం...భయంగా.... ఇలకోడి ఎగురుతాళంలో కూస్తోంది. భయసందేహాల వల్ల లయ లేకుండా పడుతున్న మా అడుగుల సవ్వడిని కాబోలు ఆగి ఆగి అలకిస్తోంది. మెయిన్‌రోడ్డు మీద నడిచిన అలవాటు వల్ల కాబోలు దారి నిండా ఇన్ని గతుకులేమిటని విసుక్కుంటున్నాయి పాదాలు. వెనక మేమున్నామన్న ధీమాతో బ్యాటరీలైటు కాంతికిరణం ఒకటి మా ముందు చెంగు చెంగున ఎగురుతూ పోతోంది. సాక్షాత్తు మృత్యువులాంటి పెద్దపులులు పచ్చటి ఎర్రటి కనుపాపలు పెద్దవి చేసుకొని ఊపిరి బిగబట్టి పొంచి ఉండే పొదలలోకి కూడా తొంగి చూసి వస్తోంది ఆ కిరణం. ఒక్క క్షణం ఆగాను. ఇంత చలిలోనూ కూడా చిరుచెమట పోసింది నొసట...అలసట చేత...భయం చేత కూడాను. రుమాలుతో మొహం తుడుచుకొని డబుల్ బారెల్ గన్ను ఆ భుజం నుంచి ఈ భుజానికి మార్చుకున్నాను. ఆటవిక నిశ్శబ్దం నన్ను చెవిటివాణ్ణి చేసింది. నా వెనక వస్తున్న నా మిత్రుడు పొడిదగ్గాడు. ఉలిక్కిపడ్డాను. ‘ఊ?’’ అన్నాను వెనక్కితిరక్కుండానే. ‘అబ్బే’ అన్నాడు అతడు. ‘చలా?’ ‘ఉహు’ ‘‘భయమెందుకోయ్’’ అన్నాను భయం అణుచుకుంటూ. అతను నవ్వాడు–ధైర్యం తెచ్చుకొంటూ (అతనికిదే తొలిసారి) నాది భయమా? భయమైతే నేనెందుకు షికారుకు వెళ్లాలి? ధైర్యముంటే అతనెందుకు భయపడాలి? మేము అడవిని చూసి భయపడితే అడవి మమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి? అడవిలో పులులు ఎందుకు ముందుకురావు? చీకటి నిశ్శబ్దంలో, నిశ్శబ్దం చీకట్లో ఎందుకు దాక్కున్నాయి? కుట్ర చేస్తున్నట్లుగా ఎందుకు నిశ్శబ్దం? పొంచి ఉన్న ఈ ‘ప్రమాదాల’ మధ్య, మృత్యుపరికరాల మధ్య, అణగి ఉన్న ఈ ప్రకృతిశక్తి చైతన్యాల మధ్య రంగారావుకు చోటెంత? అణువంత. కాని అణువులోని శక్తి ఎంత? ఆ సంగతి తెలిసే ధైర్యముగా అడవిలోకి ఆరుమైళ్ళ దూరం వచ్చానా? ఏ ధైర్యం నన్ను ముందుకు నడిపించింది? స్వతహాగా పిరికివాణ్ని గదా...చేతిలో తుపాకి ఉన్నదన్న ధైర్యంతో కాబోలు. కాని ‘మృత్యువు’ గాండ్రుమని గర్జించి మీదికి లంఘించినప్పుడు ఎదిరించి కాల్చే సాహసమెంత? ఈ రంగారావులో భయమూ వుంది. సాహసం ఉంది. భయం కోరి తెచ్చుకున్నది. సాహసం ఆవహింపజేసుకున్నది. శత్రువు(?)ని కొట్టేవరకూ ‘ప్రమాదం’ ఎక్కడ పొంచి ఎట్నించి మీద పడుతుందోనని భయం. ఆ భయం–అప్పటి ఉత్కంఠ ఒక అద్భుతమైన అనుభూతి. అనిర్వచనీయమైన సుఖం. అదే వేటగాడి కష్టానికి తెగింపుకూ ప్రతిఫలం. ప్రాణం పణంగా ఒడ్డి గెల్చుకున్న మధురఫలం. అందుకోసమే, ఆ భయం కోసమే, సుఖం కోసమే షికారీ వేటకెళ్తాడేమో. ‘‘ప్రమాదం తన పచ్చటి ఎర్రటి కళ్ళతో అమేయమైన శక్తితో తన వేపు గురి చూసి ఉన్న తుపాకీకేసీ, ఆ వెనుక ఉన్న మనకేసి చూసి–గాండ్రుమంటూ అడవి జడుసుకేలా అరచి దూకినప్పుడు– తుపాకి ట్రిగ్గర్ నొక్కి, అందులో నుంచి గుండు బయల్దేరి ముందుకు వెళ్తున్నప్పుడు– పులిపంజా, తెరచిన నోరు, తొమ్మిది అడుగుల భారీ శరీరం, చిన్న తుపాకి గుండుకు ఎదురుగా వస్తున్నప్పుడు– ఆ పులికీ, ఈ బుల్లెట్కీ భేటి కుదరకపోతే? ఆ అరక్షణం తరువాత ఏమి జరుగుతుందీ అని అర క్షణంసేపు షికారీ నరాలను మెలిపెట్టి దహించివేసే విద్యుదాఘతంలాంటి ఆలోచన– అదే భయం– ఆదే సుఖం– ఆ క్షణమే స్వర్గం– ఆ క్షణమే భరింపరాని నరకం. అదే అంతవరకూ వేటగాడు ఎదురుచూచిన ముహుర్తం. సాధారణంగా వేటకు వెళ్తే మనం ఎక్కడో భద్రంగా కూర్చుని, పులి వచ్చే వరకూ కాసుకుని కొట్టేస్తాం. అది చూచినా దానికి అందని పద్దతిలో ఉంటాం. విశాఖజిల్లా మన్యపా్రంతాలలో అడ్డతీగెల, ఎర్రకుండి, మర్రిపాకల అడవులలోనే, తూర్పుగోదావరిలో జిడ్డంగి, కాకరపాడు దగ్గర మంప వగైరా ప్రాంతాలలోనూ నేను నా మిత్రులు అప్పుడప్పుడు వేటకు వెళ్తునే ఉంటాం. ఒకసారి అడ్డతీగలలో–పెద్ద వేటగాళ్లుతో పోల్చుకుంటే ఏమి అనుభవం లేని నాకు, అప్పటికి అనుభవం అనదగ్గ సంఘటన ఒకటి జరిగింది. భోజనాలు చేసి, జెర్కిన్లు బిగించి, స్వెట్టర్లు తొడిగి, మఫ్లరీలు చుట్టి ఒక జీపులో బయల్దేరాం నలుగురం. రాత్రి పదకొండున్నర అయింది. నేను ముందు సీట్లో కూర్చున్నాను తుపాకి దట్టించి. గతుకుల్లో జీప్ నెమ్మదిగా వెళ్తోంది. ఎదుట చీకటి. కాటికలాంటి చీకటి. అంతటా నిశ్శబ్దం. మధ్య మధ్య అపశ్రుతిగా ఎక్కడో నక్కలు అరుస్తున్నాయి. ఇలకోడి ఎదురు తాళంలో కూస్తోంది. జీపు కారు శబ్దాన్నీ ఇవీ మిగతా నిశ్శబ్దమూ కలిసి మింగేశాయి కాబోలు, వినబడటమే లేదు. అంతలో నా మిత్రుడు జీపుకు బ్రేక్ వేశాడు. ‘ష్’ అన్నాడు నిష్కారణంగా. ఎదర 15 గజాల దూరాన చోటు తెరిపిగా ఉంది. జీపు హెడ్లైట్ల కిరణాలు నీరసించి మసకమారిపోతున్న చోట లీలగా జంతువు కదలిక కనిపించింది. నేను ఆలోచించే స్థితిలో లేను. కొత్త ఉత్సాహం. గబుక్కున తుపాకి గురి చేసి ట్రిగ్గర్ నొక్కాను. అడవీ, నిశ్శబ్దమూ, నా గుండే, పొదల్లో కుందేళ్ళూ, చెట్ల మీద పక్షులు దడదడలాడిపోయాయి తుపాకి మోతకి. ఒక్క క్షణం నిశ్శబ్దం. అంతలో గర్జనలతో అరణ్యం మళ్ళీ మారుమోగింది. నేను గబుక్కున జీపులోంచి కిందకు దూకాను. క్లియరింగ్ వేపు బయల్దేరాను. నా మిత్రులు గట్టిగా వారించారు. వెనుక్కులాగారు, విదిలించుకుపోయాను. నిజానికి అది చాలా మూర్ఖమైన పని...అని ఇప్పుడు తెలుసు. ఆచూకీ తెలియకుండా పొంచి ఉన్నప్పుడు అలా దిగిఅటు వేపు పోకూడదు. నేను మొండిధైర్యంతో–బహుశా అది అజ్ఞానం వల్ల నిలబడ్డ ధైర్యంతో అనుకొంటాను–అలా ముందుకు పోతున్నాను. వెనకాల జీపు వస్తోంది నెమ్మదిగా పది అడుగుల తరువాత ఆగిపోయినట్టుంది. నేను వెనక్కి చూడలేదు. తుపాకిని పొజిషన్లో పట్టుకొని దాని మీద క్లాంప్ వేసిన లైట్‌ను వెలిగించి సర్వేంద్రియాలకూ హెచ్చరిక చెప్పి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఇంకా ముందు వెళ్లాను. నేల మీద ఒకచోట నల్లటి డాగు కనబడింది. పెద్ద డాగు. ఆగి పరీక్షగా చూశాను. రక్తం. అంత భయంలోనూ గర్వం. గురి తప్పక కొట్టగలిగానని. ఆనందంతో గర్వంతో వెనక్కు చూశాను. అంతలోనే నేను ఉన్న స్థితి గుర్తుకు వచ్చింది. చిరుతపులి నాకు కుడివైపు నుండి ఎడమవైపుకు పోతూ ఉండగా కొట్టాను. బహుశా దెబ్బతిని ఎదర ఉన్న పొదలలోకి దూకి ఉంటుంది. ఎక్కడా అలికిడి లేదు. ఆయాసంగా ఊపిరి తీస్తున్న సవ్వడి కూడా లేదు–నాది తప్పు. క్లాంప్లాంప్ను పొదల మీదకు ప్రసరించి నెమ్మదిగా జరుపుతూ పరిశీలిస్తున్నాను. అంతలో హఠాత్తుగా నా కుడి వైపు దగ్గరగా బాటరీలైటు కిరణం పడింది. పరాకుగా ఉన్న వాడి పక్కన బాంబు పేలినట్లయింది. చిక్కటి చీకటిలో ఆ వెలుగు కిరణం అలా పగలడంతో గుండె ఝల్లుమంది. కదలకుండానే ఎటూ తిరక్కుండానే పక్కకు వాల్చి ఆ కిరణం కేసి చూశాను. అది నా పాదాల దగ్గర నుండి కుడివేపుకు వెళ్ళి మళ్లీ వెనక్కువచ్చి మళ్ళీ కుడివైపుకు వెళ్తోంది. నాకేదో చెప్పాలని నానా హైరానా పడుతూ–నా వెనక జీపులోంచి నా మిత్రుడు వేస్తున్న లైటు అని తెలుసు. గట్టిగా అరవవచ్చుననీ తెలుసు. అరవడానికి కంఠం పెగల్లేదు. ఒకడు అలా గాయపడ్డ జంతువును వెదుకుతూ ఉండగా వెనకనించి మరొకడు అలా లైటు వెయ్యకూడదు. అలా చేస్తే పొంచి ఉన్న జంతువుకు ఇతను స్పష్టంగా కనబడి పోతాడు. అది ప్రమాదమని నా మిత్రులకు నా కన్న బాగా తెలుసు. గత్యంతరం లేకనే ఈ పని చేస్తూ ఉండి ఉండాలి. నేను నిలబడ్డ చోటు వైశాల్యం పది చదరపు గజాల లోపు. శాంతి కిరణాన్ని అనుసరిద్దామని ఆ వెంటే వెనక్కి తిరిగి, నా తుపాకీ మీద బాటరీ లైటు పొదలవైపు వేసి చూశాను. అంతే, ఇప్పుడంతా అర్థమైంది. ఆలోపలే గుండె ఝల్లుమంది. క్షణంలో ఒళ్ళు కొయ్యబారి పోయింది. ఒక్కసారిగా నిడివడింది. అంత చలిలోనూ ముచ్చెమటలు పోసేశాయి. నా ఎదురుగుండా 20 అడుగుల దూరంలో పొద పక్కన కూర్చుని ఉంది–దెబ్బ తిన్న చిరుపుతి. దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు కూర్చుంది. నాకేమీ తోచలేదు. ఆలోచనకు అవకాశమే లేదు. నన్నెవరూ ఆ క్షణంలో ఆదుకోలేరు. కాపాడలేరు. ఆ క్షణంలోనే ఒళ్లు తెలియకుండా ఆలోచన లేకుండా బాటరీ దాని మొహం మీద వేశాను. ఆ కాంతికి చిరుతపులి ఒక్క మాటు కళ్లు ముడుచుకున్నది. కళ్లు చీకట్లు కమ్మి ఉండాలి. అది కళ్ళు తెరిచి తమాయించుకుంటే తరువాత ఆ దెబ్బతిన్న పులిని అడ్డేవాడుండడు. నా దగ్గర తుపాకిలో ఇంక ఒక్కటే గుండు ఉన్నదన్న ఊహ కూడా స్ఫురించింది. అయితే ఒకటే ధైర్యం. గుండు గురి తప్పి, అది మీదకు ఉరికినా ఒక్క ఆశ ఉంది. అంది పెద్దపులి కాదు. చిరుతపులి కాబట్టి కలియబడవచ్చు. అప్పుడు జయపజయాలు–ఏమో. ఒక పక్క చెమటలు పోస్తున్నాయి. మరోపక్క ఒళ్ళు గజగజ వణికిపోతుంది. తెగించి, గురి పెట్టి కాల్చారు. తుపాకి శబ్దానికి అడవి మారుమోగింది...కాని దానికి ప్రతిధ్వనిగా గర్జన రాలేదు. మూలుగులాటిది వినబడింది. పులి నా మీద కురక లేదు. పొద అదిరిపోలేదు. ఇక ఫరవాలేదు అది దెబ్బతింది అనుకున్నాను. గబగబ పెద్దపెద్ద అంగలు వేస్తూ జీపు వేపు నడిచిపోయాను. నా మిత్రులు ముగ్గురూ ఆమాంతం ఎదురువచ్చి కౌగిలించుకున్నారు. కారులో కూర్చోబెట్టి మొహం తుడిచారు. కాంగ్రాచ్యులేషన్స్ కురిపించారు. ఫ్లాస్కులోంచి వెచ్చటి టీ తీసి ఇచ్చారు. అది తాగి సిగరెట్ ముట్టించాను. కసితీరా రెండు పీల్పులు పీల్చాక ప్రాణం కుదుటపడింది. ఎవరితోను మాట్లాడ బుద్ధి కావటం లేదు. చెప్పరానంత ఆనందగా గర్వంగా హాయిగా వుంది, కన్నులరమూసి కూర్చున్నాను. పావుగంట తరువాత, వాళ్ళతో వెళ్లి నేను చంపిన చిరుతపులిని సాయం పట్టి జీపు బాలెట్ పడేశాను. తృప్తిగా కూర్చున్నాను. జీపు అడ్డతీగెల గ్రామం వేపు సాగిపోతుంది నెమ్మదిగా, మిత్రులు, నేనెంత మూర్ఖపుపని చేయబోయానో, ఎంతటి గండం తప్పిందో చెబుతున్నారు. క్రమంగా అవన్నీ వినబడడం మానేశాయి. వాళ్ళ సంతోషం పంచుకోలేకపోతున్నాను. నేను సాధించిన విజయం ఏమిటి? పగ సాధించానన్న ఈ తృప్తి ఎందుకు కలగాలి? పగ ఎందుకు వచ్చింది? పులికి నా మీద కోపం ఉన్నట్లు ఎవరూ చెప్పలేదు. నాకు దాంతో పరిచయం లేదు. పనిమల్లె నేను ఇక్కడికి దాని రాజ్యంలోకి ప్రవేశించాను. నేనే శత్రువుని. దాని దారిన అది పోతూ ఉంటే, హెచ్చరించకుండా దెబ్బ కొట్టాను. నాకన్న అది బలమైనదని తెలుసు. ధైర్యం ఎక్కువని తెలుసు. నాకు అదంటే భయమని తెలుసు. మరొక్కటి తెలుసు. అది జంతువని దానికి బుద్దిబలం లేదనీ, వంచనా శిల్పం బాగా తెలీదనీ, నేను నాగరిక మానవుడిననీ, దానికి లేని బుద్ధిబలం నాకు ఉండదనీ పైగా వంచనా శిల్పం, ఆయుధసంపద నా అధీనంలో ఉన్నాయనీను. అదే, పంజా ఎత్తిన పులికాక. తుపాకి పట్టిన మరో మనిషి లాగే ఆ పొదలో నిలిచి ఉంటే? నేనూ అతడూ సమానస్థాయిలో ఉందుము. అపుడు ఎవరేమయ్యేవారో! నేను నిరాయుధుడనై వెళ్తే పులి నన్ను బలి చేస్తుందని ఊహించి. నాకన్న అది బలశాలి అని గుర్తించి, దానికి తెలీకుండా, అది నాతో సవాలు చేసినట్టు అనుకుని, ప్రతీకారం కోసం అయినట్టు పనిమల్లె వెళ్ళి చంపాను. కాని ఇది ప్రతీకారమా, నాలో అహంకారానికి ఉపశమనమా? ఏమో. తెలీదు...తెలుసుకోవడం ఇష్టం ఉండదు. అది తెలుసుకుంటే, నేను చాలా ధైర్యశాలిని అని వెన్ను చరుచుకోవడానికి అవకాశం ఉండదనా? ఏమో... ‘‘వాట్ రంగారావ్...ఏమిటలా ఉన్నావు?’’ అంటున్నారెవరో. ‘‘కొత్తగదయ్యా...పోను పోను అతనే సర్దుకుంటాడు’’ అంటున్నారింకెవరో. జీపు ఊరివేపు, నాగరికత వేపు, సంస్కారం వేపు ముందుకు సాగిపోతుంది. - ఎస్వీ రంగారావు -
సదాశివా...చంద్రమౌళి!
ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, దేవిక, రాజశ్రీ...నటించిన, ఆరుద్ర పాటలు, మాటలు రాసిన చిత్రంలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘మహాదేవా...మహాదేవా! దక్షప్రజాపతి ఉగ్రనేత్రుడై వస్తున్నాడు. పాల ముంచినా నీట ముంచినా మీదే భారం స్వామి’’ అంటూ మహాశివుడి శరణుజొచ్చాడు చంద్రుడు. ‘‘భయపడకు చంద్రా’’ అంటూ అభయమిచ్చాడు శంకరుడు. ఇంతలో దక్షప్రజాపతి పట్టలేనంత ఆవేశంగా అక్కడికి దూసుకు వచ్చాడు. ‘‘ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు! ముల్లోకాలలో నీ మాటకు తిరుగుండదని బాస చేసి నీచాతి నీచమైన చంద్రుడికి ఆశ్రయం ఇస్తావా!’’ అంటూ కోపంతో ఊగిపోతున్నాడు దక్షప్రజాపతి. ‘‘దక్షా! ఆవేశం చెందకు. జరిగింది సావధానంగా విను. కూర్చో’’ అన్నాడు శంకరుడు. ‘‘కూర్చోవడానికి రాలేదు. ముందు ఆ శాపగ్రస్తుడిని విడిచిపెట్టు’’ చంద్రుడిని ఉద్దేశించి అన్నాడు దక్షప్రజాపతి. ‘‘నువ్వు శాపం ఇచ్చిన సంగతి తెలియక చంద్రుడికి అభయం ఇచ్చాను. శరణు ఒసంగిన పిమ్మట విడిచిపెట్టడం సముచితం కాదు’’ చెప్పాడు శంకరుడు. శంకరుని మాటలు దక్షుడి ఆవేశానికి ఆజ్యం పోశాయి. ‘‘అల్పునికి ఆశ్రయమిచ్చి నావంటి అధికుడికి ఇచ్చిన మాట తప్పడం సముచితమా?’’ అడిగాడు దక్షుడు. ‘‘ఆర్తత్రాణ పరాయణత్వంలో అల్పుడు, అధికుడు అనే తారతమ్యాలు పాటించడం పాడి కాదు’’ అన్నాడు శివుడు. ‘‘ప్రజాపతులలో ప్రముఖుడైన నన్ను పరాభవించడం పాడియా?’’ అడిగాడు దక్షుడు. ‘‘దక్షా! నువ్వు నా భక్తుడివి. నిన్ను పరాభవించెదనా?’’ అన్నాడు శాంతస్వరంతో శివుడు. ‘‘పరాభవం కాక ఇంకేమిటి! అభిమానవంతుడిని అలక్ష్యం చేసింది చాలక అవమానిస్తావా?’’ అంటూ రుసరుసలాడాడు దక్షుడు. ‘‘దక్షా! యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు పొరపాటు చేసినప్పుడు దిద్దుట నా కర్తవ్యం. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపం ఇచ్చావు. నేను చంద్రునికి అభయమిచ్చి, నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను’’ అన్నాడు శివుడు. ‘‘నా కుమార్తెల గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదులే’’ అని శివుడు చెప్పినదాన్ని తోసిపుచ్చుతూ... ‘‘శుష్కవాదాలతో కాలయాపన చేయక తక్షణం చంద్రుడిని విడిచి పెట్టు లేదా నా శక్తిని ప్రదర్శించక తప్పదు’’ అని శివుడికి హెచ్చరిక చేశాడు దక్షుడు. ‘‘దక్షా! అహంకారం అనర్థదాయకం సుమా!’’ హితవు చెప్పాడు శివుడు. ‘‘ఇది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం. నా శక్తిసామర్థ్యాలతో చంద్రుడిని ఎలా శిక్షిస్తానో నీవే చూడు’’ అన్నాడు దక్షుడు. ‘‘నీ చేతనైతే ప్రయత్నించు’’ అని దక్షుడి మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు శివుడు. ‘‘శంకరా! మరోసారి హెచ్చరిస్తున్నాను. మర్యాదగా చంద్రుడిని విడిచిపెట్టు. లేదా నా గదాదండంతో నిన్ను ఖండఖండలుగా చండాడగలను’’ కన్నూమిన్నూ కానకుండా అన్నాడు దక్షుడు. శివుడి కోపం ఆకాశాన్ని అంటింది. ‘‘మదాంధా! కండకావరంతో కళ్లు మూసుకుపోయి... నాపైనే గదాదండం ఎత్తెదవా! ఈ ఫాలాక్షుడి త్రిశూల ధాటికి గురికాక ముందే క్షమాపణ వేడుకో’’ ఆగ్రహంతో ఊగిపోతూ అన్నాడు శివుడు. ‘‘ఛీ...ఈ దక్షప్రజాపతి నీవంటి నీచుణ్ణి క్షమాభిక్ష కోరేంత నీచుడు కాదు. నిన్నే పాదాక్రాంతం చేసుకోగల ప్రతిభావంతుడు’’ అన్నాడు దక్షుడు అహంకరిస్తూ. ఇరువైపుల ఆవేశాగ్నులు ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో మహావిష్ణువు ప్రత్యక్షమై... ‘‘దక్షా! నీకు ఈ దురహంకారం తగదు. ఫాలక్షుడితో బాంధవ్యమే నీకు శ్రేయోదాయకం. కాని విరోధం సమంజసం కాదు’’ హితువు పలికాడు విష్ణువు. శివుడి ఆగ్రహాన్ని చల్లర్చడానికి... ‘‘శాంతించు మహాదేవా! మీ ఇరువురి ప్రతిజ్ఞలకు భంగం వాటిల్లకుండా చేస్తాను. సమ్మతమేనా?’’ అని ఇరువురినీ అడిగాడు. ‘‘నేను ఇచ్చిన అభయం ఎట్టి పరిస్థితుల్లోనూ నిష్ఫలం కాకూడదు’’ అన్నాడు శివుడు పట్టుదలగా. ‘‘కాదు...కానే కాదు’’ అన్నాడు విష్ణువు. ‘‘ఆ శాపం అప్రతిహతం కావల్సిందే’’ అన్నాడు దక్షుడు గట్టి పట్టుదలతో. ‘‘అవుతుంది’’ అన్నాడు విష్ణువు. ఆ తరువాత... ‘‘వినండి. నా ప్రభావంతో చంద్రుడిని రెండు భాగములుగా విభజిస్తాను. ఒక భాగం దక్షప్రజాపతి శాపఫలితం అనుభవించేదిగానూ, రెండో భాగం పరమేశ్వరుడి అభయఫలాన్ని అనుభవించేదిగానూ చేసెదను. ఇది మీకు సమ్మతమే కదా!’’ అడిగాడు విష్ణువు. ‘‘ఉభయతారకం నాకు అంగీకారమే’’ అన్నాడు శివుడు. ‘‘ఏం దక్షా!’’ అంటూ దక్షుడి అభిప్రాయం అడిగాడు విష్ణువు. ‘‘సరే’’ అన్నాడు దక్షప్రజాపతి. అప్పుడు... ‘‘చంద్రా ఇటురా’’ అంటూ పిలిచాడు విష్ణువు. ‘‘నమస్కారం దేవా!’’ అంటూ భయభక్తులతో అక్కడికి వచ్చాడు చంద్రుడు. అలా వచ్చిన చంద్రుడిని ఇద్దరిగా చేశాడు విష్ణువు. ‘‘చంద్రా మీ మామగారి ఆజ్ఞను మన్నించి దినమున ఒక నక్షత్రకాంతతో కాపురం చేస్తూ సుఖించు. శాపగ్రస్తుడవై దినదినము క్షీణించి వెను వెంటనే దినదినాభివృద్ధి నొందుచుండగలవు. అదే శుక్లపక్షం–కృష్ణపక్షం పేరున నీయందు వర్తించును’’ ఆదేశించాడు విష్ణువు. ‘‘తమ ఆదేశం శిరసావహిస్తాను స్వామి’’ అన్నాడు చంద్రుడు. ‘‘దక్షా! నీ మాట చెల్లుబాటు అయినందుకు సంతోషమే కదా’’ అడిగాడు విష్ణువు. ‘సంతోషమే’ అన్నట్లుగా ఉన్నాయి అతడి హావభావాలు. ‘‘చంద్రా! బాలచంద్ర రూపమున నీవు సదా శివ సాన్నిధ్యంలో ఉందువుగాక’’ ఆజ్ఞ ఇచ్చాడు మహావిష్ణువు. ‘‘మహాప్రసాదం’’ అంటూ శివుడి కాళ్లకు నమస్కరించి కూర్చున్నాడు చంద్రుడు. ‘‘చంద్రా...నువ్వు ఉండాల్సిన చోటు అది కాదు’’ అంటూ నెలవంకగా మారిన చంద్రుడిని శిరస్సున ధరించాడు శివుడు. అది చూసి... ‘‘సదాశివా! ఇప్పుడు నవ్వు చంద్రమౌళివై విలసిల్లు’’ ఆనందంగా అన్నాడు మహావిష్ణువు. -
మహానటి: అచ్చం ఎస్వీరంగారావులా మోహన్‌బాబు
-
‘మహానటి’లో మోహన్‌బాబును చూశారా?
అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’.. నాగ్ అశ్విన్ దర్శకుడిగా వైజయంతి మూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, కేవీ రెడ్డిగా క్రిష్ కనిపించనున్నారంటూ ప్రకటించిన చిత్ర బృందం శనివారం నాని చేతుల మీదుగా వీడియోలను విడుదల చేసింది. కాగా ఇవాళ ఎస్వీ రంగారావు పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని పంచుకుంది. ఇందులో మోహన్‌బాబు అచ్చం ఎస్వీరంగారావులా కనిపించి, ఆకట్టుకున్నారు. ‘పౌరాణికమైనా, సాంఘీకమైనా.. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడు మన ఎస్వీ రంగారావు. ‘వివాహ భోజనంబు’ అంటే ‘వింతైన వంటకంబు’ అని అనని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆ ఘనత ఎస్వీ రంగారావుదే. అలాంటి మహానటుడిని మాయ శశిరేఖగా అనుకరించి మనందరి మన్ననలు పొందారు మన మహానటి సావిత్రి. అలాంటి మహానటుడి పాత్రలో మనముందుకు రాబోతోంది ఎవరు అనుకుంటున్నారా? అవును.. మీ గెస్ కరెక్ట్.. వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్‌బాబు గారికే అది సాధ్యం’ అంటూ నాని ఆ పాత్రను వీడియోలో పరిచయం చేశారు. -
మిస్సవకమ్మ
పాత సినిమాల గురించి ఓ ముక్క రాయాలంటే... క్రియేటివిటీకి పాతరేసినంత భయం వేస్తుంది! ఈ రోజుల్లో క్రియేటివిటీ... మోస్ట్ అబ్యూజ్డ్. కొంచెం అర్థం కాకుండా ఏదైనా చేస్తే దాన్ని క్రియేటివిటీ అంటున్నాం. తేడాగా చేస్తే... అదే... కొంచెం డిఫరెంటుగా చేస్తే... క్రియేటివిటీ అనుకుంటున్నాం. మరి ‘మిస్సమ్మ’ లాంటి మాస్టర్ పీస్ గురించి నాలుగు ముక్కలు రాయాలంటే... అది... సూర్యుడికి దీపం చూపించే ప్రయత్నమే. మా ఈ ప్రయత్నం... గొప్పగా కనపడకపోయినా... కూసింత కలాపోసన ఉందనుకుంటే చాలు. వెండితెర మీద వచ్చిన బంగారంలాంటి సినిమాలను మీకు తరచు ఇలా అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీ మనసు గెలుచుకోగలమని నమ్ముతున్నాం. ఎంజాయ్! ‘గుడ్మాణింగ్’. సావిత్రికి ఎన్టీఆర్ అరకొర గుడ్మాణింగ్. ‘గుడ్మాణింగ్’. ఎన్టీఆర్‌కి సావిత్రి కొరకొర గుడ్మాణింగ్. సీన్ ‘మిస్సమ్మ’. హీరో... కూల్ గయ్. హీరోయిన్... చిటపటల టపాకాయ్. చాలా చూశాం. ‘తన మతమేదో తనదోయ్... పర మతమసలే పడదోయ్..’ చాలా విన్నాం. అవునా! ఇవాళేం చూడబోతున్నారు? ఏం వినబోతున్నారు? బయటికెళితే... బాహుబలి, జిల్లా, జేమ్స్‌బాండ్, మిర్చిలాంటి కుర్రాడు, పాండవుల్లో ఒకడు, ధనలక్ష్మి తలుపు తడితే, మంత్ర-2, ఛాలెంజ్... ఇంట్లో ఉంటే ప్లెంటీ! బ్లేడు బాబ్జి, హార్ట్ ఎటాక్, నాయక్, నవ్వు నాకు నచ్చావ్, రక్తచరిత్ర, పొట్టేలు పున్నమ్మ, మాధవయ్యగారి మనవడు, మంచి మనుషులు, సారాయి వీర్రాజు, అఖండుడు, బిగ్‌బాస్, పార్టీ, పెళ్లి సందడి, సీమ టాపకాయ్, ఆ రోజు, అంతకుముందు ఆ తర్వాత, ఒకే ఒక్కడు... ఓ పని చేద్దాం. మిస్సమ్మను చూడొద్దు. వినొద్దు. ఊరికే చదువుదాం. టైమ్పాస్కా? కాదు. టైమ్ టెస్ట్ కా? కాదు. ఇప్పుడెందుకీ బ్లాక్ అండ్ వైట్!! ఎల్వీ ప్రసాద్ రికార్డెడ్ ఎవ్రీథింగ్... ‘ఇన్ బ్లాక్ అండ్ వైట్’. ఐతే ఏం చేస్కోవాలి? అప్పుడప్పుడూ చూస్కోవాలి. మిస్సమ్మనా? కాదు. మరి?! మనల్నే. ఎక్కడ చూస్కోవాలి? మిస్సమ్మలోనే... ఎన్టీఆర్, సావిత్రి, ఏఎన్నార్, జమున పక్కన... మనమెందుకు కనిపిస్తాం? కనిపించం. రేలంగి పాడే వీధి పాటల గుంపులో మన యాన్సెస్టర్స్ కనిపిస్తారా? కనిపించరు. మరి? మనలో ఏదో మిస్ అవుతోంది బాస్. అది కనిపిస్తుంది. కథ. తెలుసు. మిస్ అయిన అమ్మాయి... ‘మిస్’ అమ్మగా దొరకడం. అదొక్కటే కాదు. ఒక్కటే ఎలా ఉంటుంది లెండి. కథ మధ్యలో కొన్ని కామెడీ సీన్లు. కొన్ని ఎమోషన్లు. కామనే కదా. అన్‌కామన్ థింగ్ ఒకటి ఉంది. అన్‌కామన్ అంటే? అరవై ఏళ్ల నాటి సినిమా... అరవై ఏళ్ల తర్వాత కూడా... కాంటెంపరరీ అనిపించేలా ఉండడం. ఎవరు చూడొచ్చారూ? ఎవరో చూడనక్కర్లేదు. మీరొక్కసారి చూస్తే చాలు. చూశాం. చెప్పండి. చూశాక కూడా ‘చెప్పండి’ అంటున్నారంటే మళ్లొక్కసారి మీకు సినిమా చూపించాల్సిందే. ఎస్వీ రంగారావు జమీందార్. ఆయన భార్య రుష్యేంద్రమణి. వాళ్లకో స్కూలు. మహాలక్ష్మి ప్రాథమిక పాఠశాల. వాళ్ల చిన్నమ్మాయి జమున. పెద్దమ్మాయి సావిత్రి. రంగారావు మేనల్లుడు అక్కినేని నాగేశ్వరరావు. సావిత్రి చిన్నప్పుడు కాకినాడ సముద్రతీరంలో తప్పిపోతుంది. నాలుగేళ్లప్పుడు! తప్పిపోయి పదహారేళ్లు. అంటే ఇప్పుడు సావిత్రి ఇరవై ఏళ్ల యువతి! ఆమెను వెదకి కనిపెట్టాలంటే ఒకటే గుర్తు. కుడికాలి మీద దమ్మిడీ అంత పుట్టుమచ్చ. ఇంకో గుర్తు మెడలో పులిగోరు. ఎవరు కనిపెడతారు? ‘నేను కనిపెడతాను’ అంటాడు అక్కినేని. అతడో లోకల్ డిటెక్టివ్. కామెడీకి కనెక్టివ్. ఎస్వీఆర్, రుష్యేంద్రమణి తర్వాత... సినిమాలో ఇంకో జంట ఎన్టీ రామారావు, సావిత్రి. వీళ్లిద్దరూ భార్యాభర్తలు కాదు. నిరుద్యోగులు. ఉద్యోగం కోసం భార్యాభర్తలుగా నటిస్తారు. ‘భార్యాభర్తలు అయినవాళ్లు టీచర్లుగా కావలెను’ అనే ప్రకటన చూసి జమీందారుగారి స్కూల్లోనే జాయిన్ అవుతారు. ఈ సావిత్రి ఎవరో కాదు. చిన్నప్పుడు తప్పిపోయిన జమీందారు గారి పెద్దమ్మాయి. ఈ విషయం మనకు తెలుస్తుంది. మనకు అంటే ఆడియెన్స్‌కి. లోపలి పాత్రలకు తెలీదు. తప్పిపోయినప్పుడు ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి. తప్పిపోయి క్రిస్టియన్ దంపతులకు దొరికాక ... మేరీ. మూడో జంట... అక్కినేని, జమున. వీళ్లూ భార్యాభర్తలు కాదు. కాబోయే భార్యాభర్తలు. నాలుగో జంట సావిత్రిని పెంచిన అమ్మానాన్నలు. ఈ నాలుగు జంటలు ప్లస్ రేలంగి ప్లస్ రమణారెడ్డి, మరికొన్ని చిన్నా చితక పాత్రలు, ఆరోగ్యకరమైన హాస్యాలు, సరదా సెటైర్లు వీటితో మిస్సమ్మ నడుస్తుంది. రేలంగిది ‘బాబ్బాబ్బాబు’ క్యారెక్టర్. తర్వాత్తర్వాత ఎన్టీఆర్‌కి సహాయక పాత్ర అవుతాడు. రమణారెడ్డి అప్పిచ్చినవాడు. మేరీ పేరెంట్స్‌కి అప్పిచ్చి, మేరీనిచ్చి పెళ్లి చేస్తే ఆ అప్పు తీర్చనవసరం లేదని మేరీ ఎదురుపడినప్పుడల్లా అంటుంటాడు. చివరికొచ్చేసరికి క్యార్టెర్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి. అలా రాసేశారు చక్రపాణి. అలా తీసేశారు ఎల్వీ ప్రసాద్. ఎట్ ది ఎండ్. నిజాలు తెలుస్తాయి. సావిత్రి... పాల్ దంపతుల సొంత కూతురు కాదని తెలుస్తుంది. మిస్ మేరీ తమ కూతురు మహాలక్ష్మీనేనని ఎస్వీరంగారావు ఫ్యామిలీకి తెలుస్తుంది. ఎన్టీఆర్, సావిత్రి భార్యాభర్తలు కాదని తెలుస్తుంది. ఇంకా చివరికొచ్చేసరికి... సావిత్రి తనను పెంచిన తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోతానంటుంది. ఎన్టీఆర్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఎన్టీఆర్‌కీ సావిత్రికి, ఏఎన్నార్‌కి జమునకు పెళ్లి ఫిక్స్ చేసేస్తారు ఎస్వీరంగారావు. ఆ వెంటనే శుభం. ఇక్కడితో పైపై సినిమా అయిపోతుంది. అసలు సినిమా... అద్భుతమైన ఆ డైలాగుల్లో ఉంది. అసలు సీన్లు ఆహ్లాదకరమైన ఆ పాటల్లో ఉన్నాయి. మిస్సమ్మ కథ మొత్తాన్నీ చక్రపాణి చక్కటి మాటల్లో చెప్పేస్తే... అంతకన్న చక్కటి పాటల్లో పింగళి నాగేంద్రరావు శిల్పంలా చెక్కి వదిలిపెట్టారు. సంగీతాన్ని సాలూరు రాజేశ్వరరావుకు సమర్పించి ఇక చూస్కోమన్నారు. అందుకే సినిమా అంత తియ్యగా ఉంది. సాఫ్ట్‌గా, స్మూత్‌గా సాగింది. ఇక డైలాగ్స్. విన్నా, చూసినా... వన్స్‌మోర్. శాంపిల్‌గా చిన్నముక్క. డిటెక్టివ్ అక్కినేని... ఎన్టీఆర్, సావిత్రిల కదలికల్ని అనుమానిస్తుంటాడు. ఆ అనుమానాన్ని క్లియర్ చేసుకోడానికి రేలంగి దగ్గరికి వస్తాడు. అక్కినేని: ఏవోయ్... మీ పంతులు, పంతులమ్మ ఎంతో ప్రేమించుకున్నారన్నావ్, అట్లా పోట్లాడుతున్నారేమోయ్. రేలంగి : అసలు మొగుడూ పెళ్లాల సంగతి మీకెందుకు సార్. పగలు పోట్లాడుకుంటారు. రాత్రుళ్లు మాట్లాడుకుంటారు. అక్కినేని : అదేమిటోయ్ మరి రాత్రిళ్లే పోట్లాడుకుంటున్నారే. రేలంగి : ఆ... మరి బిఏలంటే ఏమనుకున్నారు... రాత్రుళ్లు పోట్లాడుకుంటారు. పగలు మాట్లాడుకుంటారు. మిస్సమ్మలో రొమాన్స్ కూడా చాలా సున్నితంగా, నిశితంగా కనిపిస్తుంది. రెండుమూడు ముక్కల్లో తేలగొట్టేస్తారు మాటల రచయిత. సావిత్రి... ఎన్టీర్కి దూరంగా ఉంటుంది. అలాగని జమున ఎన్టీఆర్‌కి దగ్గరవుతుంటే (మానసికంగా కాదు, మాస్టారిగా) చూడలేదు. ఒక సందర్భంలో జమున ఎన్టీఆర్ మీద మీద పడుతుండడం, ఎన్టీఆర్ ఆమెను ఎంటర్టైన్ చెయ్యడం చూసి ఉడికిపోతుంది సావిత్రి. పరుగున వెళ్లి తను మెడ్రాస్ వెళ్లిపోతున్నట్టు లెటర్ రాసి ఎస్వీరంగారావుకి పంపిస్తుంది. అది తెలుసుకుని సావిత్రిని సముదాయించడానికి ఎన్టీఆర్ వెళతాడు. ఆ సందర్భంలో... ఎన్టీర్ : చూడండి సావిత్రి : ఏమిటి ఎన్టీఆర్ : మీతో ఏం చెప్పాలన్నా భయమే. సావిత్రి : ఇంకా భయమెందుకు... రెండ్రోజుల్లో నే వెళుతున్నాగా. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. ఈ నాలుగు మాటల్లోనే సావిత్రికి ఎన్టీఆర్‌పై ప్రేమ మొదలైన విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది. పాత... సాగతీత అనుకుంటాం. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అనుకుంటాం. అప్పటి హాస్యం కాస్త హెవీగా ఉంటుందనుకుంటాం. మిస్సమ్మలో అలా ఉండదు. అన్నీ సహజంగా, తేలిగ్గా, సాఫీగా సాగిపోతుంటాయి. రెండు గంటల 45 నిమిషాల నిడివి గల సినిమా పెట్టేంత ప్రెషర్ని... మిస్సమ్మ మన మైండ్ పై గానీ సోల్‌పై గానీ పెట్టదు. కానీ మన మైండ్, సోల్ మళ్లీ ఒకసారి ఆ సినిమాని చూడాలని ఇప్పటి లైఫ్స్టెయిల్లో ఒక్కసారైనా కోరుకుంటాయి. కనీసం అందులోని ఒక్కపాటైనా వినాలని గానీ, చూడాలని గానీ కోరుకుంటాయి. ఇంతకీ... మనలో ఏం మిస్ అవుతోంది? మిస్సమ్మలో అది ఎక్కడ కనిపిస్తుంది? ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఏ పాత్రా అతికష్టం మీద ప్రయాసపడి జీవించదు. లైట్ లైట్‌గా ఉంటుంది. మనమూ అంతే తేలిగ్గా మనం ఈ జీవితాన్ని మోయాలి. బరువనిపిస్తే దించి మళ్లీ ఎత్తుకోవాలి. అంతే తప్ప, కాంప్లికేట్ చేసుకోకూడదు. లైఫ్ ఈజ్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్. - సాక్షి ఫ్యామిలీ మిస్సమ్మ... స్మూత్ అండ్ నేచురల్ ‘‘మా పెదనాన్న గారు ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘మిస్సమ్మ’ లాంటివి ఎవర్గ్రీన్. చిన్నప్పుడెప్పుడో చూసిన ఆ సినిమా ఇప్పటికీ చూస్తుంటే, ఎంత మంచి సినిమా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా, ఆ సినిమాలో తెరపై కథ చెప్పే ఆ విధానం, ఎడిటింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ఎల్వీ ప్రసాద్ గారి నుంచి ఎడిటింగ్‌లో నేనొక టెక్నిక్ నేర్చుకున్నా. రెండు పాత్రలు మాట్లాడుకుంటూ ఉంటే, ఒక పాత్ర డైలాగ్‌కీ, మరొక పాత్ర రెస్పాన్స్కీ మధ్య ఒక నేచురల్ పాజ్, టైమింగ్ ఉంటాయి. కోపం, బాధ, ప్రేమ, కొట్లాట - ఇలా ఆ సన్నివేశంలోని సందర్భాన్ని బట్టి అవి మారిపోతుంటాయి. ఎల్వీ ప్రసాద్ గారు సరిగ్గా ఆ టైమింగ్‌ను ఒడిసిపడుతూ షూటింగ్ చేసేవారు. ఎడిటింగ్ కూడా ఆ నేచురల్ టైమింగ్ ఉండేలా చేసేవారు. అందుకే, ఇవాళ్టికీ ఆ సినిమాలు కానీ, ఆ ఎడిటింగ్ కానీ స్మూత్‌గా, నేచురల్‌గా ఉంటాయి. కానీ, ఇటీవల చాలామంది అది పాటించకుండా, స్పీడ్ పెంచేశారు. అందువల్లే మనకవి సహజంగా ఉన్నట్లనిపించవు. ‘మిస్సమ్మ’ అలా కాదు. అందుకే, ఇవాళ్టికీ ఆ సినిమా, అందులోని హాస్యం ఆకట్టుకుంటాయి. ఎల్వీ గారి నుంచి నేర్చుకున్న ఆ టెక్నిక్‌నే ఎడిటింగ్‌లో నేను ఇప్పటికీ పాటిస్తుంటా.’’ - ఎ. శ్రీకర్‌ప్రసాద్, ఎనిమిది నేషనల్ అవార్డులందుకున్న ఎడిటర్ -
హహ్హహహ్హహహ్హహా..!
... వివాహభోజనంబు.. వింతైన వంటకంబు.. వియ్యాలవారి విందు.. ఒహ్హొహ్హొ నాకె ముందు! ఔరౌర గారెలల్ల... అయ్యారె బూరెలిల్ల... ఒహోరే అరిసెలుల్ల... ఇయెల్ల నాకె చెల్ల... పెళ్లి భోజనం ఎలా ఉందో... అధరాన్ని, ఉదరాన్ని మధురంగా ఊదరగొడుతూ పంచేంద్రియాలనూ అదిలించి కదిలిస్తారు ‘మాయాబజార్’ సినిమాలో ఎస్వీ రంగారావు! గారెలు, బూరెలు, అరిసెలేనా? లడ్లు, జిలేబీలు, అప్పడాలు.. పులిహోర దప్పళాలు.. పాయసాలు... ఎన్ని లేవు ఆ లిస్టులో! వాటిల్లో ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని కలిపి ఇవాళ మీ చేత లొట్టలు వేయించబోతోంది ‘ఫ్యామిలీ’! వివాహభోజనానికి ఏ మాత్రం తక్కువకాని ఈ దీపావళి భోజనాన్నిహహ్హహహ్హహహ్హహా... అంటూ ఆరగించండి. మీ ఆత్మీయులకు కొసరి కొసరి తినిపించండి. హ్యాపీ దీపావళి! సజ్జప్పాలు లేదా హల్వా పూరీ కావలసినవి: స్టఫింగ్ కోసం... బొంబాయి రవ్వ - కప్పు; పంచదార - కప్పు; నీళ్లు - రెండున్నర కప్పులు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు - పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు పై భాగం కోసం... మైదా పిండి - కప్పు; ఉప్పు - చిటికెడు; నూనె - అర కప్పు (మైదా పిండి నానబెట్టడానికి); నూనె - డీప్ ఫ్రైకి తగినంత తయారీ: బాణలిలో నెయ్యి వేసి వేడి చేశాక, జీడిపప్పులు వేయించి తీసేయాలి అదే బాణలిలో రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాక, వేయించి ఉంచుకున్న రవ్వ, జీడిపప్పు పలుకులు వేసి మిశ్రమం దగ్గరపడే వరకు కలిపి, ఆ తరవాత పంచదార జత చేయాలి బియ్యప్పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, మిశ్రమం చల్లారాక, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలిపి, అర కప్పు నూనె జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నానబెట్టాలి చేతికి నెయ్యి రాసుకుని నానబెట్టుకున్న మైదాపిండి ముద్ద తీసుకుని, చేతితో చపాతీలా ఒత్తి, అందులో బొంబాయిరవ్వ మిశ్రమం ఉండను ఉంచి, బొబ్బట్టు మాదిరిగా సజ్జప్పం ఒత్తాలి. ఇలా మొత్తం తయారుచేసి పక్కన ఉంచుకోవాలి బాణలిలో నూనె కాగాక ఒక్కో సజ్జప్పం వేసి వేయించి తీసేయాలి ఇవి సుమారు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి. జిలేబీ కావలసినవి: మైదా పిండి - కప్పు; బేకింగ్ పౌడర్ - అర టీ; స్పూను; పెరుగు - కప్పు; నూనె - వేయించడానికి తగినంత; పంచదార - కప్పు; కుంకుమ పువ్వు - చిటికెడు; ఏలకుల పొడి - పావు టీస్పూను; మిఠాయి రంగు - రెండు చుక్కలు; రోజ్ వాటర్ - 2 టేబుల్ స్పూన్లు తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి బాగా కలిపి ఒక రోజంతా నాననివ్వాలి మూతకు రంధ్రం ఉన్న మ్యాగీ సీసా వంటి దానిలో ఈ మిశ్రమాన్ని పోయాలి ఒక పాత్రలో పంచదార, నీళ్లు, రోజ్ వాటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపాక, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు జత చేయాలి బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి (మంట మధ్యస్థంగా ఉండాలి) పిండి ఉన్న సీసాను తీసుకుని జిలే బీ ఆకారం వచ్చేలా నూనెలో తిప్పాలి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి వెంటనే పంచదార పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి వేడివేడిగా అందించాలి. అప్పడాల కూర మీకు అప్పడాలంటే ఇష్టం ఉంటే, ఈ కూరను కూడా ఇష్టపడతారు. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. రాజస్థానీయులు ఎక్కువగా తయారుచేసే ఈ కూరను చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. కావలసినవి: అప్పడాలు - పావు కిలో; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా; నెయ్యి లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూను; ఉల్లి తరుగు - పావు కప్పు; అల్లం ముద్ద - టీ స్పూను; వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూను; ధనియాల పొడి - 2 టీ స్పూన్లు; పసుపు - అర టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; చిక్కగా గిలక్కొట్టిన పెరుగు - ఒకటిన్నర కప్పులు; కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత తయారీ: అప్పడాలను నూనెలో వేయించి నాలుగు ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి (మైక్రోవేవ్‌లో కూడా చేసుకోవచ్చు) స్టౌ (సన్నని మంట) మీద బాణలి ఉంచి, నెయ్యి లేదా నూనె వేసి, కాగాక జీలకర్ర వేసి వేయించాలి ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంగువ, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలపాలి పెరుగు, కప్పుడు వేడి నీళ్లు జత చేయాలి అప్పడం ముక్కలను వేసి జాగ్రత్తగా కలిపి, కొద్దిసేపు ఉడకనిచ్చి దింపే ముందు కొత్తిమీరతో అలంకరించి, అన్నంతో వడ్డించాలి. దప్పళం కావలసినవి: కందిపప్పు - పావు కప్పు; బెల్లం - 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర - చిన్న కట్ట; చింతపండు గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు; సాంబారు పొడి - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; చిలగడదుంప ముక్కలు - అర కప్పు; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి - 6 (పొడవుగా మధ్యకు చీల్చాలి); మునగకాడ ముక్కలు - కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; దొండకాయ ముక్కలు - పావు కప్పు; అరటికాయ ముక్కలు - పావు కప్పు; తీపి గుమ్మడికాయ ముక్కలు - కప్పు; సొరకాయ ముక్కలు - అర కప్పు; సెనగ పిండి - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; కారం - 2 టీ స్పూన్లు; పోపు కోసం... ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 10; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; ఇంగువ - కొద్దిగా తయారీ: పప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, పచ్చి మిర్చి, చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాక, మెత్తగా మెదిపిన పప్పు వేసి బాగా కలిపి, బెల్లం తురుము జత చేయాలి సాంబారు పొడి, కారం వేసి కాసేపు ఉడికించాలి కొద్దిగా నీళ్లలో సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న దప్పళంలో వేసి కలపాలి ఈలోగా పక్కన చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, సెనగపప్పు, మెంతులు, ఇంగువ వేసి వేయించి, మరుగుతున్న దప్పళంలో వేసి బాగా కలిపి కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి. పేణీ లడ్డు కావలసినవి: సెనగపిండి - కప్పు; పేణీ - కప్పు; పంచదార - ముప్పావు కప్పు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; డ్రై ఫ్రూట్ పొడి - 2 టేబుల్ స్పూన్లు తయారీ: స్టౌ (సన్న మంట) మీద బాణలి ఉంచి సెనగపిండి వేసి పచ్చి వాసన పోయి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపి చల్లారనివ్వాలి మిక్సీలో పంచదార, పేణీలు వేసి రవ్వలా చేసి, సెనగపిండి ఉన్న పాత్రలో వేయాలి డ్రైఫ్రూట్ పొడి జత చేయాలి కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ లడ్డూ కట్టాలి. పేణీ పాయసం పాలు వేడి చేసి, బెల్లం పొడి జత చేసి కలిపాక, డ్రై ఫ్రూట్ పొడి జత చేయాలి ఒక పాత్రలో పేణీ వేసి అందులో పాలు బెల్లం మిశ్రమం వేయాలి తేనె వేసి బాగా కలిపి బాగా చల్లారాక అందించాలి. కట్టె పొంగలి కావలసినవి: బియ్యం - ముప్పావు కప్పు; పెసరపప్పు - పావు కప్పు; మిరియాల పొడి - టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; పచ్చి మిర్చి - 4; జీలకర్ర - టీ స్పూను; జీడిపప్పులు - 10; కరివేపాకు - 2 రెమ్మలు; నెయ్యి - 5 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత తయారీ: బియ్యం, పెసర పప్పులను శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి దించేయాలి పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేయాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్ది సేపు వేయించాక, జీడిపప్పు పలుకులు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి కరివేపాకు, మిరియాల పొడి, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించి, అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి కలియబెట్టాలి చట్నీ, సాంబారులతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. సేకరణ: డా. వైజయంతి -
నాకు, జనానికి నచ్చింది.. కానీ ఆడలేదు
నటుడు గిరిబాబు విజయవాడ కల్చరల్ : మంచినటుడిగా, ఉత్తమ అభిరుచిగల సినీ నిర్మాతగా గిరి బాబుకు పేరు ఉంది. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా రావినూతల. అసలు పేరు యర్రా శేషగిరిరావు. ఆయన గురువారం విజయవాడలో ఎస్.వి.రంగారావు స్మారక పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి కల్చరల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... ప్రశ్న : మీ సుదీర్ఘ సినీ జీవితం తృప్తినిచ్చిందా? జవాబు : నేను సినిమాల్లోకి వచ్చి 42 ఏళ్లు. నాటక రంగం నుంచి సినీ రంగానికి వచ్చాను. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు చూసి నటుడిని కావాలనుకున్నా. నటుడిగా నా మొదటి సినిమా జగమేమాయ. ఇప్పటి వరకూ 550 సినిమాల్లో నటించా. సినీ జీవితం చాలా తృప్తిగా ఉంది. ప్ర : రాష్ట్రం విడిపోయాక తెలుగు సినిమా భవిష్యత్ ? జ : తెలుగు సినిమాకు ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రెండు ప్రభుత్వాల చొరవతో పరిశ్రమ ముందుకు సాగుతుందనే భావిస్తున్నా. ఎవరైనా ఇప్పటికిప్పుడు కొత్తగా పరిశ్రమను సృష్టించలేరుకదా. ప్ర : సినిమా పరిశ్రమను వారసత్వ నటులు శాసిస్తున్నారు కదా? ప్రతిభ గల నటులు రావటం లేదని వస్తున్న విమర్శపై మీ స్పందన? జ : వారసత్వం అనేది సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఉంది. అన్ని భాషల సినిమాల్లో వారసత్వ నటులు వస్తూనే ఉన్నారు. తెలుగులో కాస్త ఎక్కువ. నటుడుగా నిలబడాలంటే వారసత్వం ఒక్కటే చాలదు. ప్రతిభ ఉంటేనే ఎవరైనా రాణిస్తారు. ప్ర : తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే ప్రతిభగల నటులు రావటంలేదుకదా? జ : కరెక్టుకాదు. పొరుగింటి పుల్లకూర రుచి సామెత ఉంది కదా. అందుకే మనవారు పొరుగు భాషల నుంచి విలన్లను తెస్తున్నారు. అలాగని మన విలన్లు పరాయి భాషలో నటిం చిన సందర్భాలు చాలా తక్కువ. మనదే ఆ ప్రత్యేకత. ప్ర : గతంలో సినిమాలు నిర్మించిన మీరు ఇప్పుడు ఎందుకు నిర్మించడం లేదు? జ : ఇప్పటికి ఎనిమిది సినిమాలు నిర్మించాను. ఇప్పటి సినిమాలు కోట్లతో పని. ఈ పరిస్థితుల్లో సినిమాలు తీయడం నావల్ల కాదు. కుటుంబ సమేతంగా నిర్మించే సినిమాలే తీశాను. నా సినిమాలకు నేనే కథ, నేనే దర్శకత్వం వహించాను. ప్ర : నిర్మాతగా మీ తొలి చిత్రం? జ : దేవతలారా దీవించండి. ఆ తరువాత వరుసగా మెరుపుదాడి, సింహగర్జన, ముద్దుముచ్చట, సంధ్యారాగం మొదలైన సినిమాలు నిర్మించాను. ప్ర : ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లోనూ ప్రతిభకు అన్యాయం జరుగుతోందిగా? జ : నిజమే. 550 సినిమాల్లో నటించిన నాకు నంది అవార్డులు రాలేదు. కానీ న్యాయ నిర్ణేతగా ఉన్నందుకు మాత్రం నాలుగు నందులు వచ్చాయి. ప్ర : మీరు సినిమాల్లోకి వచ్చి 40 ఏళ్లు దాటుతోందికదా. మీ సినీ చరిత్ర దాని గురించి ఏమైనా రాస్తున్నారా జ : నా జీవిత చరిత్ర రాసే పనిలో ఉన్నా. అయితే కొంత సమయం తీసుకోవచ్చు. ప్ర : మీకు నచ్చిన మీ సినిమా? జ : నాకు నచ్చిన సినిమా ‘సంధ్యారాగం’. ఈ సినిమా జనానికీ నచ్చింది. కానీ ఆడలేదు. ప్ర : ఈనాటి నటులకు మీరిచ్చే సలహా? జ : అద్భుతమైన కృషిచేస్తే తప్ప నటుడుగా నిలబడే రోజులు కావు. వారసత్వ నటులతో ఇబ్బందే. ప్ర : ఒత్తిడికి గురైతే ఏమిచేస్తారు? జ : వృత్తిపరంగా ఒత్తిళ్లు ఉన్నపుడు స్వగ్రామం వెళ్లిపోతా. అక్కడే సేదతీరుతా. మా ఊరి కోసం జూనియర్ కాలేజీ, కల్యాణ మండపం నిర్మాణంలో నా వంతు సహాయం చేశా. -
అపురూపం: విజయం వెనుక...
ఎస్వీ రంగారావు... గుమ్మడి... రేలంగి... స్వర్ణయుగపు టాప్ క్లాస్ క్యారెక్టర్ నటులు వీరు! తెలుగువారు గర్వించే కళామూర్తులు! అంతర్జాతీయ బహుమతులు పొందిన నటుడు ఎస్వీ రంగారావుగారైతే... డాక్టరేట్ గౌరవాన్ని పొందిన సహజ నటుడు శ్రీ గుమ్మడి. అలాగే ‘పద్మశ్రీ’ అందుకున్న తొలి హాస్యనటుడు మన రేలంగి! ఇలా అందరూ అందరే! ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుందంటారు పెద్దలు. అలా వీరి విజయం వెనుక వీరి శ్రీమతులున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలకు ఎన్నెన్నో ఒత్తిడులు ఉంటాయి. ఎంతో బిజీగా ఉంటారు. కుటుంబ బాధ్యతలకు సమయం చిక్కదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రా గగనమే. ఇటువంటి వాతావరణంలో నేర్పుతో, ఓర్పుతో ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు ఉంటే తప్ప, వారు గొప్ప లక్ష్యాలను సాధించలేరు. అలాంటి సతీమణులను పొందారు కాబట్టే నటనకు పర్యాయపదంగా ఎదిగారు ఈ మహానటులు! ఆ కృతజ్ఞతను వివిధ సందర్భాలలో ప్రకటించేవారు కూడా. ఎస్వీ రంగారావుగారు తన మేనమామ కుమార్తె అయిన లీలావతిని వివాహం చేసుకున్నారు (1947). గుమ్మడిగారు లక్ష్మీసరస్వతిని (1944), రేలంగిగారు బుచ్చియమ్మను (1933) పరిణయమాడారు. ఆ ఆదర్శ దంపతుల అపురూప ఛాయాచిత్రాలివి. సినిమా వారి వైవాహిక జీవితాలు ఒడిదుడుకుల మయం... కానీ వీరివి ఆనందమయం! కారణం... ఒకరికొకరుగా జీవించారు... తోడు నీడగా సాగారు... సాటివారికి స్ఫూర్తిగా నిలిచారు! అన్యోన్య దాంపత్యం అంటే ఏమిటో చూపారు... తరువాతి తరానికి జీవితమంటే ఇదని తెలిపారు!!