గన్నవరంలో చిరంజీవికి ఘన స్వాగతం | Megastar Chiranjeevi Receives Grand Welcome in Gannavaram Airport | Sakshi
Sakshi News home page

గన్నవరంలో చిరంజీవికి ఘన స్వాగతం

Published Sun, Oct 6 2019 9:55 AM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

సాక్షి, గన్నవరం: మెగాస్టార్‌ చిరంజీవికి గన్నవరం విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం 9.00 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. చిరంజీవి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లనున్నారు. పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు సెంటర్‌లో నెలకొల్పిన తొమ్మిది అడుగుల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరిస్తారు. సెంటర్‌కు ఎస్‌వీఆర్‌ సర్కిల్‌గా నామకరణం చేస్తారు.

కాగా వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కృషితో విగ్రహ ఆవిష్కరణకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం, చిరంజీవితో మాట్లాడటం, తేదీనిక ఖరారు చేయడంతో ఎట్టకేలకు ఆదివారం ఉదయం విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది. మరోవైపు చిరంజీవి రాక సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement