![Mahanati, upcoming biopic on legendary south Indian actress Savitri biopic - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/23/Mahanati.jpg.webp?itok=5qHM8ipk)
కీర్తీ సురేశ్
సావిత్రిలా నడవటం, చూడటం. పెదవి విరవడం, డ్యాన్స్ చేయడం... ఇలా కొన్ని నెలలుగా కీర్తీ సురేశ్ తనను తాను సావిత్రిలా ఊహించుకున్నారు. అందుకే ఇక ఆమెలా అభినయించే అవకాశం లేదని ఫీలయ్యారు. ‘మహానటి’ షూటింగ్ చివరి రోజున కీర్తీ సురేశ్ ఎమోషన్ అయ్యారు. సావిత్రి చిత్రపటం దగ్గర దీపం వెలిగించారు. చెమర్చిన కళ్లతో చిత్రబృందం నుంచి వీడ్కోలు తీసుకున్నారామె. అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహానటి’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించారు.
సావిత్రి పాత్రలో కథానాయిక కీర్తీ సురేశ్ నటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత ప్రియాంకా దత్ మాట్లాడుతూ – ‘‘మహానటి’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీలక పాత్రలు చేసిన మోహన్‌బాబుగారు, రాజేంద్ర ప్రసాద్‌గారు స్ట్రాంVŠ సపోర్ట్‌గా నిలబడ్డారు. కీర్తీ సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్ ఇలా భారీ తారాగణంతో మా బ్యానర్‌లో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఏయన్నార్ పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్యకు రుణపడి ఉంటాం. మే 9న చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment