మహానటి సినిమాలో ఎక్కువ శాతం మహిళలే పనిచేశారు. నిర్మాతలు మహిళలే. లీడ్ క్యారక్టర్ కూడా మహిళే. ఈ సినిమా కోసం ఎక్కువ మంది మహిళలే పనిచేశారని ఆడియో వేడుకల్లో కింగ్ నాగ్ కూడా పేర్కొన్నారు. ఒక సినిమా మొదలు కావాలంటే మొదటగా కావాల్సింది నిర్మాతలే. నిర్మాతలు ధైర్యం చేస్తేనే గొప్ప సినిమాలు వస్తాయి. మహానటి సినిమా నిర్మాతలు ప్రియాంక, స్వప్నలు ధైర్యం చేసి ఈ సినిమా బాధ్యతను తీసుకున్నారు. తెరపై ఆ మహానటి సాధించిన విజయాల్ని మళ్లీ అదే తెరపై ఆవిష్కరించేందుకు ఈ మహిళమణులు పూనుకున్నారు. అందుకే ‘మహానటి’ రూపు దాల్చింది.
అలనాటి మహానటి సావిత్రిని గుర్తుకు తెచ్చేలా నటించడం మామూలు విషయం కాదు. కీర్తి సురేశ్ మాత్రం సావిత్రి పాత్రకోసమే పుట్టిందేమో అన్నట్టుగా జీవించేసినట్టుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు అచ్చం సావిత్రిని గుర్తుకుతెచ్చేలా ఉన్నాయి. తెర వెనుక ఇంకా ఎందరో మహిళామణుల కష్టం దాగి ఉంది. ఈ సినిమా విడుదలై సంచలనాలు సృష్టిస్తుందని, అప్పుడు ఈ క్రెడిట్ అంతా సినిమాకు పనిచేసిన మహిళలదే అవుతుందని అందుకే మహిళా శక్తి అని సమంత ట్వీట్ చేసి ఉంటుంది. కీర్తి సురేశ్, సమంత, షాలినీ, దుల్కర్ సల్మాన, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, క్రిష్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘మహానటి’మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Girl power 💪💪#Mahanatipromotions #Mahanation9th @VyjayanthiFilms @KeerthyOfficial pic.twitter.com/Dp9HPhMHcT
— Samantha Akkineni (@Samanthaprabhu2) May 6, 2018
Comments
Please login to add a commentAdd a comment