
నాగ చైతన్య
అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ దర‍్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రల్లో ఎవరు నటిస్తారన్న ప్రశ్న ఇండస్ట్రీ వర్గాలతో సినీ అభిమానుల్లోనూ వినిపిస్తోంది. ముందుగా ఎన్టీఆర్, ఏఎన్నార్‌లుగా జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్యలను నటింపచేయాలని చిత్రయూనిట్ ప్రయత్నించారు.
అయితే ఎన్టీఆర్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. మొదట్లో నాగచైతన్య కూడా నో చెప్పినా.. తాజాగా ఏఎన్నార్ పాత్రలో నటించేందుకు అంగీకిరంచారు. రెండు రోజుల పాటు డేట్స్ కూడా కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 14, 15 తేదిలో నాగచైతన్యకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా ఎస్వీఆర్ గా సీనియర్ నటుడు మోహన్ బాబు నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో సమంత, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, దర్శకులు క్రిష్, తరున్ భాస్కర్‌లు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment