Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Reacts Raptadu BC Party Worker Kuruba Lingamaiah Incident1
ఏపీలో కక్ష రాజకీయాలకు బలవుతున్న బడుగు, బలహీన వర్గాలు

గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ చేస్తున్న అరాచకాలను, అఘాయిత్యాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. మళ్లీ పగడ విప్పిన ఫ్యాక్షన్‌ రాజకీయానికి.. తాజాగా రాప్తాడులో బలైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య ఉదంతంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏపీలో చట్టబద్ధపాలన లేదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలమీద, నాయకులమీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయి. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. .. రామగిరి మండల ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. రామగిరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల(TDP Atrocities) దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించారు. అయినా పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ పైగా వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం. లింగమయ్య కుటుంబానికి అండగా.. .. కురబ లింగమయ్య(Kuruba Lingamaiah) హత్యను ఖండిస్తున్నా. అధికారపార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారు. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. కురుబ లింగమయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.ఇదీ చదవండి: హత్య చేయించి పరామర్శకు వస్తారా?.. టీడీపీ ఎంపీకి చేదు అనుభవం

YSRCP Leader Chelluboina Venugopal Slams Chandrababu P42
‘చంద్రబాబు.. పీ4 పేరుతో బాధ్యతలను విస్మరిస్తారా ?’

తాడేపల్లి: హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా నిర్వహించిన పీ–4 కార్యక్రమం ప్రారంభంతోనే అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ పీ4 ప్రారంభ కార్యక్రమంలో బీసీల పట్ల చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పట్ల చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపేనని మరోసారి నిరూపించుకున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే...పేదల విషయంలో చంద్రబాబుది రెండు నాలుకల దోరణి. చంద్రబాబు పేదల అభ్యున్నతి, సంక్షేమం అంటూ మాట్లాడటమే తప్ప వాస్తవంగా వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ఒక్క కార్యక్రమం కూడా చేపట్టరు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక వర్గం వారి సొంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకి పేదలన్నా, దళితులన్నా, బీసీలన్నా ఎప్పుడూ చులకన భావమే. దళిత కుటుంబంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని బహిరంగంగా వ్యాఖ్యానించిన కుల దురహంకారి. తాజాగా నిన్నటికి నిన్న ఉగాది పండగ రోజున ఆర్భాటంగా నిర్వహించిన పీ–4 కార్యక్రమంలోనూ మళ్లీ ఇదే తరహా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ బడుగు, బలహీన వర్గాల ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడొచ్చారు. సగం మంది వెళ్లిపోయారు. వారి ఆలోచన అంతా.. మీటింగ్‌ అయింది.. మా పని అయిపోయింది’ అనుకుంటారు.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదలను గొప్పోళ్లను చేస్తానంటూ ఉగాదినాడు ఆర్భాటంగా కార్యక్రమం మొదలుపెట్టి, ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటే, ఆ ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వారిని చూసి చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. వారి పట్ల తన మనసులో ఉన్న మాటను వెళ్లగక్కి బడుగులంటే తనకు ఏమాత్రం గిట్టదని మరోసారి రుజువు చేసుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత, బలహీన వర్గాల నుద్దేశించి అంత దారుణంగా మాట్లాడడం అత్యంత హేయం.ఆది నుంచి ఆయనకు పేదలంటే అలుసేచంద్రబాబుకు ఆది నుంచి పేదలంటే అలుసే. ఆయన దళితులు, బడుగు, బలహీనవర్గాలపై తనకు అలవాటైన రీతిలో మళ్ళీ మళ్ళీ నోరు పారేసుకుంటునే ఉంటారు. బడుగు, బలహీనవర్గాల ఆలోచన ఆ పూట వరకే ఉంటుందని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. పేదలను ధనికులను చేస్తానంటూ జీరో పావర్టీ పీ–4 పేరుతో నిర్వహించిన సభలోనే వారిపై తనకున్న ఏహ్య భావాన్ని చంద్రబాబుగారు బయటపెట్టారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో నాడు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబుగారు బీసీలపై తన అక్కసు వెళ్లగక్కారు. తమ బాధలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణు­లను.. ‘మీ తోకలు కత్తిరిస్తా.. ఏం తమాషాలు చేస్తున్నారా? అసలు మిమ్మల్ని ఇక్కడి వరకూ రానివ్వడమే తప్పు..’ అంటూ హూంకరించారు.ఇంకా నేనిచ్చిన బియ్యం తింటున్నారు. నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు. నాకెందుకు ఓటు వేయరు. అంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సమయంలో బ్లాక్‌మెయిల్‌ తరహాలో పేదలను బెదిరించారు. నాయకుడి బాటలో నడుస్తున్న టీడీపీ నేతలు కూడా నోరు పారేసుకుంటున్నారు. దళితులు, బీసీల పట్ల తరచూ హీన వ్యాఖ్య­లు చేస్తూనే ఉన్నారు. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు..?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఒక సభలో ఎస్సీల పట్ల అవమానకరంగా మాట్లాడటం తెలిసిందే. ‘ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వాళ్లు దగ్గరకు వస్తే వాసన వస్తుంది. వాళ్లకి చదువు రాదు..’ అంటూ టీడీపీలో ఉండగా మాజీ మంత్రి ఆది­నారాయణ­రెడ్డి దారుణంగా మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడితే టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకుంటారు. అసలు బీసీలన్నా, దళితులన్నా ఆయనకు పడనే పడదు. వారి కోసం చిత్తశుద్ధితో చేసింది ఒక్కటీ లేదు. ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి, నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేయడం తప్ప. టీడీపీ నుంచి రాజ్యసభకు పంపిన వారిని చూస్తే.. దళితులు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అభిప్రాయం, ఆయన వైఖరి అందరికీ అర్ధమవుతుంది.రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనఇక గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, ప్రతిపక్షంపై దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగయ్యను దారుణంగా హత్య చేశారు. ఉగాది పండగ రోజున గుడికి వెళ్లొస్తుండగా, దారి కాచిన దుండగులు దారుణంగా హతమార్చారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్యెల్యే పరిటాల సునీత బంధువులే హత్యకు కారణమంటూ, లింగయ్య బంధువులు ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోవడం లేదు. అనుమానితుల పేర్లు చెప్పినా, పోలీసులు ఖాతరు చేయడం లేదు. ఆ దిశలో కేసు దర్యాప్తు చేయడం లేదు. మరోవైపు లింగయ్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతోందా? లేక మంత్రి నారా లోకేష్‌ పదే పదే చెబుతున్నట్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందా? రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. ఈ పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తోంది. ఇది మంచి సంప్రదాయం కాదని హెచ్చరిస్తున్నాం. చర్యకు అనుగుణంగా ప్రతి చర్య ఉంటుందని గుర్తు చేస్తున్నాం.పీ4 పేరుతో బాధ్యతలను విస్మరిస్తారా?చంద్రబాబు పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో నిరుపదలను ధనవంతులు సహాయం చేయడం ద్వారా వారి పేదరికాన్ని తొలగిస్తానని చెప్పారు. ఆయన బీఆర్ అంబేద్కర్‌ను కోట్ చేశారు. ఆయనకు కూడా ఇలా సహయం అందడం వల్లే ఆయన ఉన్నత చదువులు చదువుకుని, ఉన్నత స్థానానికి చేరుకున్నారని గుర్తు చేశారు. ఇదే అంబేద్కర్ రాజ్యాంగంలో కొన్ని అంశాలను పేదల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనను బాధ్యతగా తీసుకుంటేనే వారు పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. ప్రజలు తాము చెల్లిస్తున్న పన్నులతో నడుస్తున్న ప్రభుత్వం తమకన్నా దిగువన ఉన్న వారికి సంక్షేమం ద్వారా చేయూతను అందించాలని, సమాజంలో అసమానతలను తగ్గించాలని కోరుకుంటారు. కానీ చంద్రబాబు దీనికి భిన్నంగా పీ4 పేరుతో పేదలను ఆదుకునే బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. అంబేద్కర్‌ గారు ఇచ్చిన రాజ్యాంగ మౌలిక సూత్రాకుల అనుగుణంగా పాలించాల్సిన వారు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. షెడ్యూల్ కులాలకు ఎస్సీ సబ్‌ప్లాన్, బీసీ కులాలకు బీసీ సబ్‌ప్లాన్‌లు ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా సమాజంలోని ధనవంతులు పేదలను దత్తత తీసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుందని చంద్రబాబు సూత్రీకరించారు. మీరు ఈ రాష్ట్రంలో పేదరికం ఉందనే విషయం ఆలస్యంగా అయినా చంద్రబాబు తెలుసుకున్నారు. కరోనా వంటి ప్రపంచ విపత్తు సమయంలోనే రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది, నేను ఏమీ చేయలేనని చెప్పకుండా ఎంతో బాధ్యతగా పేదలకు అండగా నిలిచిన వైయస్ జగన్ గారిని చూసి నేర్చుకోండి. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ఖజానాలో ఉన్నది కేవలం రూ.100 కోట్లు మాత్రమే. అలాగే వేలాది కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినా బెంబేలెత్తలేదు. పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఎగ్గొట్టాలని ఏనాడు అనుకోలేదు. పేదల ఇళ్ళలో విద్యాజ్యోతిని వెలిగిస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని ఆనాడు స్వర్గీయ వైయస్ఆర్ ఫీజురీయింబర్స్‌మెంట్‌ను తీసుకువచ్చారు. చంద్రబాబు మాట్లాడితే బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు దృష్టిలో కేవలం కులవృత్తులతోనే బతకాలని అనుకుంటున్నారు. అంతేకానీ బీసీలకు ఉన్నత విద్యను అందించాలని, వారి జీవితాల్లో మార్పులు తేవాలని ఏనాడు ఆలోచన చేయలేదు.

CM Revanth Reddy Serious On SRH And HCA Controversy3
SRH Vs HCA వివాదంపై సీఎం రేవంత్‌ సీరియస్‌

సాక్షి,హైదరాబాద్‌ : హెచ్‌సీఏ- సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యాన్నివేధింపులు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్‌ ఎంక్వైరీ చేయాలని సూచించారు. విజిలెన్స్‌ డీజీ కొత్తకోట శశ్రీకాంత్‌కు ఆదేశాలు జారీ చేశారు.ఎస్‌ఆర్‌హెచ్‌ను పాసులు విషయంలో ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పాసుల వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. తాజా, ఇదే అంశంపై సీఎం రేవంత్‌ సైతం స్పందించారు. అసలేం జరిగిందంటే?ఉచిత పాస్‌ల విషయంలో (ఐపీఎల్‌ 2025) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. పాసుల కోసం​ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్‌రైజర్స్‌ జనరల్‌ మేనేజర్‌ టిబి శ్రీనాథ్‌ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్‌ రావు ఓ ఘాటు లేఖ రాశారు.ఇలాంటి ప్రవర్తన సహించంఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు మేం వెనకాడం. మేము ఉప్పల్‌ స్టేడియంను హోం గ్రౌండ్‌గా ఎంచుకుని మ్యాచ్‌లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాం. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యానికి తెలియజేయగలరు. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదరాబాద్‌ నుంచి తరలిపోతామని సన్‌రైజర్స్‌ ప్రతినిథి హెచ్‌సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్‌లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్‌అయినా పట్టించుకోకుండా హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్‌ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్‌ బాక్స్‌కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్‌సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్‌ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్‌ తన ఈ-మెయిల్‌లో హైలెట్‌ చేశారు. కాగా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్‌ స్టేడియం) హోం గ్రౌండ్‌గా ఉన్న విషయం తెలిసిందే.

IPL 2025: Mumbai Indians vs Kolkata Knight Riders Live Updates And Highlights4
కేకేఆర్‌కు బిగ్ షాక్.. డికాక్ ఔట్‌

MI vs KKR live Updates And highlights: ఐపీఎల్‌-2025లో వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియన్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ తొలి వికెట్ డౌన్‌.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే బిగ్‌షాక్ త‌గిలింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సునీల్ నరైన్‌.. ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. క్రీజులోకి అజింక్య ర‌హానే వ‌చ్చాడు.తుది జ‌ట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్‌), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి.ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్.

Cell Phone Lokesh Babu Chandrababu Naidu5
ఫోన్‌లో రికార్డింగ్ ఆప్షన్ తీసేయమని బాబుగారికి చెబితే పోలా..!

‘‘ఈరోజు ప్రపంచం ఇలా ఉందంటే అందుకు కారణం నేనే.. మన చేతుల్లో సెల్ ఫోన్ ఉందంటే అందుకు కారణం కూడా నేనే. సెల్ ఫోన్ తో ప్రపంచాన్ని క్షణాల్లో వీక్షించి వస్తున్నామంటే అందుకు కారణమూ నేనే’’ ఈ తరహా గప్పాలు కొట్టుకోవడం మన బాబుగారికి బాగా అలవాటు. ఏదైనా మంచి విషయం వెలుగులోకి వస్తే చాలు అందుకు ఆద్యుడిని తానే అంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబుగారికి చెప్పుకోవడం అలవాటు. ఇది కేవలం బాబుగారికి మాత్రమే చెల్లిన అలవాటు. పొరపాటున కూడా ఆ అలవాటు మార్చుకోరు మన బాబు గారు. లోకేష్‌కు సెల్‌ఫోన్‌ భయం..మరి ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ కు సెల్ ఫోన్ ను చూస్తే భయవేస్తోందట. ఎవరి చేతుల్లోనైనా సెల్ ఫోన్ చూస్తే అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మన చినబాబు. అనకాపల్లి జిల్లా యలమంచి నియోజకవర్గ కార్యకర్తలతో ఈరోజు(సోమవారం) లోకేష్ సమావేశమయ్యారు. వారికి ముందుగా ఒకే ఆజ్ఞ చేశారు చినబాబు. ‘సెల్ ఫోన్ లలో ఏమీ రికార్డు చేయొద్దమ్మా’ అంటూ తన స్టైల్ లో ఆదేశాలిచ్చారు లోకేష్. ఇదంతా ఎందుకంటే తనను ఎవరైనా నిలదీసి అది రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడితే పరిస్థితి ఏమటనే కోణంలోనే లోకేష్ ముందుగా జాగ్రత్తలు పడ్డారు. ఈ భేటీలో సూపర్ సిక్స్ హామీలపై ఎవరైనా నిలదీసి అది సోషల్ మీడియా వరకూ చేరితే ట్రోలింగ్ గురి కావాల్సి వస్తుందని ముందే గ్రహించిన లోకేష్ దీన్ని మాత్రం చక్కగా అమలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా రికార్డింగ్ చేస్తే సెల్ ఫోన్స్ అమ్మి కార్యకర్తల నిధికి ఇచ్చేస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దీనిపై టీడీపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. మన లోకేష్ బాబు ఏంటి.. ఇలా మాట్లాడుతున్నారంటే అనుకోవడం అక్కడకు వచ్చిన కార్యకర్తల వంతైంది.లోకేష్‌ వ్యాఖ్యలను వినడానికి ఫోటోపై క్లిక్‌ చేయండి..మరి నాన్నగారైన చంద్రబాబు సెల్ ఫోన్ కు రావడానికి కారణం తానేనని, ఆరోజు అప్పటి ప్రధాని వాజ్ పేయికి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే సెల్ ఫోన్ వచ్చిందని బాబుగారు గర్వంగా చెప్పుకుంటున్నారు ఇప్పటికీ. మామూలుగా ఫోన్ చేసుకోవడానికే కాదు.. డబ్బులు సంపాదించుకోవడానికి సెల్ ఫోన్ అవసరం ఎంతో ఉంది. అదొక నిత్యావసర వస్తువంటూ 2023లో ఓ సందర్భంలో కామెంట్స్ చేశారు చంద్రబాబు. భార్య లేకపోతే భర్త ఉంటాడని, భర్త లేకపోతే భార్య ఉంటుందని, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఎవరూ ఉండరంటూ బాబుగారు తన గొప్పను గొప్పగానే చెప్పుకున్నారు. ఇలా సమయం దొరికినప్పుడల్లా బాబుగారు సెల్‌ ఫోన్‌ కు ఎక్కువ ప్రమోషన్‌ ఇస్తూ.. తనను కూడా ప్రమోట్‌ చేసుకుంటూ ఉంటారు.కొసమెరుపు: మరి ఇప్పుడు అదే సెల్ ఫోన్ చూసి లోకేష్ భయపడుతున్నారంటే ఏమనాలి. ఇక నుంచి సెల్ ఫోన్ లో రికార్డింగ్ ఆప్షన్ తీసేయమని ఇప్పుడు బాబుగారికి చెబితే బాగుంటుందేమో మరి.

Former Union Minister Girija Vyas Burn Injuries While Doing Aarti At Home6
Girija Vyas : హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రికి తీవ్ర గాయాలు

జైపూర్: సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ (Girija Vyas) అగ్ని ప్రమాదంలో పడ్డారు. రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయపూర్‌లోని తన నివాసంలో పూజ చేసే సమయంలో హారతి (harathi) ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్‌ సోదరుడు గోపాల్‌ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్‌ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు ఆమె దుప్పటాకు మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. पूर्व केन्द्रीय मंत्री डॉ. गिरिजा व्यास जी के आग से झुलसकर घायल होने का समाचार चिंताजनक है। मैं ईश्वर से उनके जल्द स्वास्थ्य लाभ की प्रार्थना करता हूं।— Ashok Gehlot (@ashokgehlot51) March 31, 2025 గిరిజా వ్యాస్‌ అగ్నిప్రమాదానికి గురయ్యారన్న వార్తలపై రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాత్‌ స్పందించారు. మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ గిరిజా వ్యాస్‌ అగ్ని ప్రమాదంలో గాయపడడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.ప్రముఖ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పదవులు నిర్వహించారు.1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు1991లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 1996, 1999లో ఉదయపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి,2009లో చిత్తోరగఘ్ నుండి లోక్ సభ సభ్యురాలిగా పనిచేశారుకేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్ పర్సన్‌గా సేవలందించారు.

How Alice Walton world Richest Woman Spendings7
ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు

ప్రముఖ రిటైల్‌ కార్పొరేషన్‌ వాల్‌మార్ట్‌కు చెందిన ఆలిస్ వాల్టన్ 102 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.46 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలుగా నిలిచారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం వాల్‌మార్ట్‌ షేరు ధర పెరగడం వల్ల ఆమె సంపద గత సంవత్సరంతో పోలిస్టే 46 శాతం పెరిగింది. దాంతో 75 ఏళ్ల ఆలిస్‌ వాల్టన్‌ ప్రపంచ మహిళ కుబేరులు జాబితాలో టాప్‌లో నిలిచారు. వాల్‌మార్ట్‌ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె అయిన ఆలిస్ తన సోదరులు రాబ్, జిమ్ వాల్టన్ మాదిరిగా కాకుండా ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు వారసత్వంగా సమకూరిన అపారమైన సంపదను వ్యక్తిగత అభిరుచులకు, దాతృత్వం కోసం ఖర్చు చేస్తున్నారు. వాల్టన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ అండ్‌ వాల్టన్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా కంపెనీలో సుమారు 11.5 శాతం వాటాను కలిగి ఉన్నారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.వాల్టన్‌కు చిన్నతనం నుంచే కళలపట్ల ఉన్న ఇష్టంతో వాటిని సేకరించి పరిరక్షిస్తున్నారు. వాల్టన్ తన పదో ఏటే పికాసో రిన్యూవేట్‌ పెయింటింగ్‌ను రెండు డాలర్లకు కొనుగోలు చేశారు. ఆండీ వార్హోల్, నార్మన్ రాక్వెల్, జార్జియా ఓకీఫ్ వంటి ప్రసిద్ధ అమెరికన్ కళాకారుల ఒరిజినల్ కళాకృతులను ఆమె సేకరించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం ఆమె 2011లో అర్కాన్సాస్‌లోని బెంటన్విల్లేలో 50 మిలియన్ డాలర్లతో క్రిస్టల్ బ్రిడ్జెస్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ ఆర్ట్ అని పిలువబడే మ్యూజియంను కూడా ప్రారంభించారు. టెక్సాస్ గుర్రాల సంతానోత్పత్తి వ్యాపారంలోనూ తనకు ప్రవేశం ఉంది. ఆమె 2017లో రాకింగ్ డబ్ల్యు రాంచ్ అని పిలువబడే టెక్సాస్‌లోని గుర్రాల స్థావరాన్ని 16.5 మిలియన్‌ డాలర్లకు విక్రయించినట్లు సమాచారం. ఇది 250 ఎకరాలకు పైగా పచ్చిక బయళ్లు, పశువులు, గుర్రాల పరిరక్షణ కోసం వీలుగా ఉన్న ప్రాంతం. తన సంపదను అభిరుచులు తీర్చుకోవడానికి, కళలను కాపాడేందుకు ఖర్చు చేస్తున్నారు.ఇదీ చదవండి: మరో ఆరు నెలల్లో దేశీయ తొలి మైక్రోకంట్రోలర్‌ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు, పీఏసీలకు మద్దతుగా నిలిచారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2016లో హిల్లరీ క్లింటన్‌ విక్టరీ ఫండ్‌కు 3,53,400 డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో వాల్టన్ మొదటిస్థానంలో నిలువగా, 67 బిలియన్ డాలర్ల సంపదతో లోరియల్‌కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్, 60 బిలియన్ డాలర్లతో కోచ్ ఇండస్ట్రీస్‌కు చెందిన జూలియా కోచ్ అండ్ ఫ్యామిలీ, 53 బిలియన్ డాలర్ల సంపదతో మార్స్‌కు చెందిన జాక్వెలిన్ మార్స్, 40 బిలియన్ డాలర్ల సంపదతో హెచ్‌సీఎల్‌కు చెందిన రోష్ని నాడార్ అండ్ ఫ్యామిలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Shiv Sena Sanjay Raut Satires Modi Nagpur RSS Visit8
మోదీ రిటైర్మెంట్‌.. మాకు ఆ అవసరమే లేదు!

ముంబై: బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాన్ని(RSS Headquarters) సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన నేపథ్యంతో.. మోదీ రాజకీయ నిష్క్రమణపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆరెస్సెస్‌ మోదీని తప్పించి వారసుడ్ని ఎంపిక చేసే పనిలో ఉందని.. అందుకే ఆయన నాగ్‌పూర్‌కి రావాల్సి వచ్చిందని శివసేన(థాక్రే) నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ‘తండ్రి’ వ్యాఖ్యలతో గట్టి కౌంటరే ఇచ్చారు. ఈ ఏడాదిలో మోదీ రాజకీయాల నుంచి నిష్క్రమించబోతున్నారని.. ఆ విషయాన్ని తెలియజేసేందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను కలిశారంటూ ముంబైలో మీడియా ప్రతినిధుల సమావేశంలో రౌత్‌ అన్నారు. ప్రధాని మోదీ(PM Modi) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ దరఖాస్తును సమర్పించేందుకే ఆయన ఆరెస్సెస్‌ నాగ్‌పూర్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. గత 10 ఏళ్లలో ఆయన ఏనాడూ అక్కడికి వెళ్లలేదు. కేవలం ఆరెస్సెస్‌ చీఫ్‌కు వీడ్కోలు చెప్పేందుకే ఇప్పుడు వెళ్లారు అంటూ సంజయ్‌ వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ సమయం ముగిసిపోయింది. ఈ సెప్టెంబర్‌తో ఆయన 75 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. ఆ వయసు, దానిని మించినవాళ్లు పదవుల్లో కొనసాగవద్దని ఆ పార్టీ(BJP)లో అప్రకటిత నిబంధన ఉంది. దేశ నాయకత్వాన్ని మార్చాలని సంఘ్‌ పరివార్‌ బలంగా అనుకుంటోందని, బీజేపీ జాతీయ నాయకత్వంలోనూ త్వరలో మార్పులు ఉండబోతున్నాయని అన్నారాయన. ఇదిలా ఉంటే.. 2000 సంవత్సరంలో ప్రధాని హోదాలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి(Atal bihari Vajpayee) సందర్శించగా.. మళ్లీ ఇప్పుడు మోదీ ఆరెస్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సందడి చేశారు. అయితే మోదీ వారసుడిని ఆరెస్సెస్‌ ఈ సెప్టెంబర్‌లో ఎంపిక చేయబోతుందన్న రౌత్‌ వ్యాఖ్యలకు బీజేపీ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌(Devendra Fadnavis) కౌంటర్‌ ఇచ్చారు. తండ్రి ఉండగా వారసుడు అనేవాడి అవసరమే ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ నాయకత్వాన్ని మార్చడమా?. మాకు ఆ అవసరమే లేదు. మోదీకి వారసుడిని వెతకాల్సిన అవసరమూ లేదు. మోదీజీనే మా నేత. భవిష్యత్తులోనూ ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతాం. 2029 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా దేశ ప్రధానిగా కొనసాగుతారు. కాబట్టి ఇలాంటి వ్యవహారాన్ని చర్చించడం కూడా తగదు. బీజేపీలో వయసు దాటితే రిటైర్‌మెంట్‌లాంటి నిబంధనేదీ బీజేపీలో లేదన్న ఫడ్నవిస్‌.. 80 ఏళ్ల వయసులో మంతత్రి పదవి చేపట్టిన బీహార్‌ నేత జితన్‌ రామ్‌ మాంజీ పేరును ప్రస్తావించారు. ఈ టర్మ్‌లోనే కాదు.. వచ్చే టర్మ్‌లోనూ ఆయన మా నాయకుడు. మోదీ రాజకీయాలను వీడతారని వ్యాఖ్యానించేవాళ్లది మొఘలుల ఆలోచన ధోరణిగా అనిపిస్తోంది. ఎందుకంటే.. మన సంప్రదాయంలో తండడ్రి బతికి ఉండగా.. వారసత్వం అనే ప్రస్తావనే ఉండదు. ఇలాంటివి మొఘలుల సంప్రదాయంలోనే ఎక్కువగా ఉంటాయి. వన్‌ షాట్‌.. టూ బర్డ్స్‌లాగా ఔరంగజేబ్‌ సమాధి వివాదం నడుస్తున్న వేళ.. ఫడ్నవిస్‌ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే కిందటి ఏడాది స్వార్వత్రిక ఎన్నికల టైంలో మోదీ రాజకీయ రిటైర్‌మెంట్‌ గురించి చర్చ నడిచింది. ఆ టైంలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. మోదీ స్థానంలో అమిత్‌ షా ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు.

We Are Ready Shiv Sena style Welcome: To Kunal Kamra Rahool Kanal9
‘అప్పుడు నీకు మామూలు ‘‘వెల్‌కమ్‌’’ ఉండదు’

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి శివసేన ఆగ్రహానికి గురైన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు మద్రాసు హైకోర్టు మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై కునాల్ కమ్రా షోలు చేసే స్టూడియో కూల్చివేసిన ఘటనలో అరెస్టై బెయిల్ పై విడుదలైన శివసేన పార్టీ యువసేన జనరల్ సెక్రటరీ నేత రాహుల్ కనాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కునాల్ కమ్రా బెయిల్ పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూనే.. కునాల్‌ కమ్రా మహారాష్ట్రకు వచ్చినప్పుడు గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు శివసేన సిద్ధంగా ఉందంటూ ప్రతీకార చర్య వ్యాఖ్యలు చేశారు. జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడిన రాహుల్ కనాల్.. ‘ కునాల్ కమ్రాకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుతో కునాల్ కు ఊరట లభించింది. ఇది కేవల ఏప్రిల్ 7 వరకు మాత్రమే. ఆ తర్వాత కునాల్ చట్టపరమైన సమస్యలు తప్పవు. ఈ క్రమంలో ముంబైకి రాక తప్పదు. అప్పుడు నేను కునాల్ గ్రాండ్ వెల్ కమ్ ఏర్పాటు చేస్తా.. అది కూడా శివ సేన స్టైల్ లోనే ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కునాల్ కు అక్కడ ఎవరు రక్షణ కల్పిస్తున్నారన్నది అనవసరం. షిండే పై చేసిన వ్యాఖ్యలకు గాను ముంబైకు కునాల్ తప్పకుండా రావాల్సి ఉంటుంది. అప్పుడు అతని మామూలు ‘ వెల్ కమ్’ ఉండదు’ అంటూ కామెంట్స్ చేశారు.అంతకుముందు తాను విచారణకు హాజరుకావడానికి కొంత సమయం కావాలని ముంబై పోలీసుల్ని కునాల్ కమ్రా కోరగా దాన్ని వారు నిరాకరించారు. అయితే తనకు ప్రాణ హాని ఉందంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు కునాల్ కమ్రా. ఈ కేసులో కునాల్ కమ్రాకు గత శుక్రవారం మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ముంబైలోని హాబిటాట్ స్టూడియో(ల జరిగిన ఈవెంట్‌లో కునాల్‌ కమ్రా ఓ షో చేస్తూ ఏక్‌నాథ్‌ షిండేను ద్రోహిగా వర్ణించడంతో షిండే శివసేన యువ విభాగం భగ్గుమంది. కునాల్‌కు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగింది. అదే టైంలో.. హాబిటాట్‌ స్టూడియోపై దాడికి దిగి విధ్వంసానికి పాల్పడింది. ఈ కేసులో రాహుల్ కనాల్ తో పాటు 11 మందిని అరెస్టు చేయగా, వారికి బెయిల్ కూడా లభించింది.

Director Sanoj Mishra Arrested Who Offered Chance To Monalisa10
మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్

ప్రయాగరాజ్ మహాకుంభమేళా వల్ల పూసలమ్మే మోనాలిసా అనే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈమెకు ఏకంగా సినిమా హీరోయిన్ ఛాన్స్ కూడా వచ్చింది. అయితే ఈమెకు అవకాశమిచ్చిన దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు బెదిరిస్తున్నాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?)బాధితురాలు చెప్పిన దాని ప్రకారం.. 2020లో టిక్ టాక్, ఇన్ స్టా ద్వారా దర్శకుడు సనోజ్ మిశ్రాకు ఉత్తరప్రదేశ్ ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఈ యువతి పరిచయమైంది. 2021 జూన్ 17న ఈమెకు ఫోన్ చేసిన సనోజ్ మిశ్రా.. తాను ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గర ఉ‍న్నానని రావాలని కోరాడట. కానీ ఆమె రాలేదు. కలవడానికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో భయంతో సనోజ్ ని వెళ్లి కలిసింది.సదరు యువతిని ఓ రిసార్ట్ కి తీసుకెళ్లిన సనోజ్ మిశ్రా.. మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడట. ఈ విషయం బయటకు చెప్తే.. ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడట. ఇలా పెళ్లి, సినిమా అవకాశాలు పేరు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడట. దీంతో ఈమె దిల్లీలోని నబీ కరీమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. సనోజ్ మిశ్రాను అరెస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement