తండ్రిగా గర్వంగా.. కొడుకుగా ఈర్ష్యగా ఉంది : నాగ్‌ | Naga Chaitanya Look In Mahanati | Sakshi
Sakshi News home page

Published Thu, May 10 2018 4:29 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Naga Chaitanya Look In Mahanati - Sakshi

కింగ్‌ నాగార్జున తన సోషల్‌ మీడియా పేజ్‌ లో ఓ ఆసక్తికర కామెంట్‌ చేశారు. ‘ఈ రోజు నేను తండ్రిగా గర్వపుడుతున్నా.. కొడుకుగా ఈర్ష్య పడుతున్నా.. నేను ఎప్పుడు నా తండ్రి లెజండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించలేదు. కానీ ఈ రోజు నాగచైతన్య ఆ పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది’ అంటూ మహానటి సినిమాలోని నాగచైతన్య లుక్‌ను రిలీజ్ చేశారు నాగార్జున.

ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుగా యువ నటుడు నాగచైతన్య కనిపించారు. సినిమాలోని నాగచైతన్య పాత్రను పరిచయం చేస్తూ రూపొందించిన వీడియోకు యంగ్ హీరో నాని వాయిస్‌ ఓవర్‌ అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement