మా ఇద్దరి అదృష్టం ఇది | it is good luck to both of us | Sakshi
Sakshi News home page

మా ఇద్దరి అదృష్టం ఇది

Published Fri, Apr 11 2014 2:01 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

మా ఇద్దరి అదృష్టం ఇది - Sakshi

మా ఇద్దరి అదృష్టం ఇది

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం ‘మనం’ కోసం ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ప్రచార చిత్రానికి వచ్చిన స్పందనే అందుకు గొప్ప నిదర్శనం. రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో క్లిక్స్ దీనికి లభించాయి. ఈ విషయంపై అక్కినేని నాగార్జున ఆనందం వెలిబుచ్చారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘మనం ప్రచార చిత్రాలకు ఈ స్థాయిలో స్పందన రావడం ఆనందంగా ఉంది. చాలా కొత్తగా ఉన్నాయని ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. మా కుటుంబం కలిసి నటించిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ రీతిలో ఉంటుందని నమ్మకంగా చెప్పగలను.
 
 దర్శకుడు విక్రమ్‌కుమార్ సరికొత్త శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాన్న చివరి సినిమాలో ఆయనతో పాటు భాగం పంచుకునే అదృ ష్టాన్ని నాకు, నాగచైతన్యకు కలిగించిందీ సినిమా’’ అని చెప్పారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, మే నెల 23న ఘనంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత సుప్రియ తెలిపారు. శ్రీయ, సమంత కథానాయికలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement