ఒక నటుడిని గుడ్డిగా ప్రేమించాను.. | Samantha Revealed Her Break Up With Ex Boyfriend | Sakshi
Sakshi News home page

నా జీవితమూ ఆమెలా మారేదేమో!

Jun 7 2018 8:49 AM | Updated on Jul 14 2019 4:41 PM

Samantha Revealed Her Break Up With Ex Boyfriend - Sakshi

తమిళసినిమా: సెలబ్రిటీల వ్యాఖ్యలకు, చర్యలకు మీడియా అధిక ప్రాముఖ్యత ఇస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదీ సమంత లాంటి అందాల భామ, అగ్ర కథానాయకి గురించిన సంగతులైతే సామాజిక మాధ్యమాలు పట్టించుకోకుండా ఉంటాయా, ఇక నిజాలను నిర్భయంగా వెల్లడించడానికి ఎప్పుడూ సందేహించని నటి సమంత యువ నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం తన నట ప్రయాణం కొనసాగుతుందని ముందుగానే వెల్లడించిన ఈ క్రేజీ నటి అదే విధంగా నటిస్తున్నారు. అంతే కాదు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు కూడా. సాధారణంగా పెళ్లి అయిన తరువాత హీరోయిన్లు తమ గత ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడరు.

సమంత అందుకు విరుద్ధం అనే చెప్పాలి. ఇటీవల ఒక భేటీలో తన గత ప్రేమ గురించి ప్రస్తావించారు. ఆమె ఏమన్నారో చూద్దాం. మహానటి (తమిళంలో నడిగైయార్‌ తిలగం) చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర కథ నా జీవితంలో జరిగినట్లే భావించాను. అంటే నేనూ ఒక నటుడిని గుడ్డిగా ప్రేమించాను. ఆ తరువాత అతని నుంచి విడిపోయాను. అలా కాకుంటే నా జీవితం కూడా సావిత్రి జీవితంలా అయ్యేది. నా టైమ్‌ బాగుండడంతో నాగచైతన్యను కలిశాను అని సమంత పేర్కొన్నట్లు సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. ఇలాంటి విషయాలు చెప్పడానికి నిజంగా చాలా ధైర్యం కావాలి. అది సమంతలో కట్టలు కట్టలుగా ఉందని అర్థం అవ్వడం లేదూ! ఈ సంచలన నటి తాజాగా యూటర్న్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇది కథానాయకి చుట్టూ తిరిగే కథా చిత్రం అన్నది గమనార్హం. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం సమంత కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకెళుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement