తొలి షెడ్యూల్లో మాయాబజార్ మేకింగ్ | Mahanati Savitri Biopic Shooitng first Schedule | Sakshi
Sakshi News home page

తొలి షెడ్యూల్లో మాయాబజార్ మేకింగ్

Published Tue, May 30 2017 11:54 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

తొలి షెడ్యూల్లో మాయాబజార్ మేకింగ్

తొలి షెడ్యూల్లో మాయాబజార్ మేకింగ్

లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తుండగా అనుష్క, సమంతలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాలో షూటింగ్లో భాగంగా తొలి షెడ్యూల్ లో ఓ సాంగ్ మేకింగ్ను షూట్ చేస్తున్నారు. మాయాబజార్ సినిమాలోని ఓ పాట షూటింగ్ సందర్భాన్ని ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఐదు రోజుల్లోనూ ముగియనుంది.

రెండో షెడ్యూల్ను మాత్రం భారీగా ప్లాన్ చేస్తున్నారు. జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్ 25 రోజుల పాటు కొనసాగనుంది. కోలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, యంగ్ హీరో విజయ్ దేవరకొండలు నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై తెరకెక్కుతున్న మహానటి సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement