సావిత్రీ... నిన్నొదల! | Samantha's role in Mahanti Savitri biopic revealed | Sakshi
Sakshi News home page

సావిత్రీ... నిన్నొదల!

Published Mon, Apr 10 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

సావిత్రీ... నిన్నొదల!

సావిత్రీ... నిన్నొదల!

అందాల అభినేత్రి సావిత్రి జీవిత కథతో ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో స్వప్న సినిమాస్‌ నిర్మించనున్న సినిమా ‘మహానటి’. ఇందులో సావిత్రిగా కీర్తీ సురేశ్‌ నటించనున్న సంగతి తెలిసిందే. మరి, సమంత ఏ పాత్ర చేస్తున్నారంటే... కథను ముందుకు నడిపించే విలేకరి పాత్రలో కనిపించనున్నారు.

80వ దశకంలో విలేకరులను స్ఫూర్తిగా తీసుకుని సమంత లుక్‌ను నాగ అశ్విన్‌ డిజైన్‌ చేశారట. ‘‘సావిత్రి గురించి తెలుసుకోవాలని పట్టు వదలకుండా రీసెర్చ్‌ చేసే జర్నలిస్ట్‌గా సమంత కనిపిస్తారు. సినిమాలోని కథ కూడా ఈ జర్నలిస్ట్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఉంటుంది. సావిత్రి చరిత్రను విలేకరి వివరిస్తారు’’ అని యూనిట్‌ వర్గాల సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ సంగీత దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement