మహానంది, న్యూస్‌లైన్: మద్యం దుకాణాల్లో నకిలీలు విక్రయిస్తే లెసైన్స్ రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ హెచ్చరించారు. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు శనివారం ఆయన మహానంది వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా 84 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లను నియమించారని, వారు శిక్షణలో ఉన్నారన్నారు. జిల్లాలో కొత్తగా మంజూరైన ఆరు ఔట్‌లెట్లను బుక్కాపురంలో 1, కోవెలకుంట్లలో 2, ఆత్మకూరులో 1, సున్నిపెంటలో 2 ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్రమ నిల్వలపై దాడులు విస్తృతం చేశామన్నారు.
ఇటీవల బేతంచర్ల, మహానంది మండలాల్లో అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పత్తికొండ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ, ఎస్‌ఐల మధ్య జరిగిన గొడవలో బాధ్యులపై క్రమశిక్షణా రాహిత్య చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట నంద్యాల ఎక్సైజ్ సీఐ కేశవులు ఉన్నారు.
నకిలీ మద్యం విక్రయిస్తే లెసైన్స్ రద్దు
Published Sun, Nov 24 2013 4:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement
Advertisement