ఏం జరిగింది..రాత్రి అదృశ్యం.. ఉదయం రైలు పట్టాలపై శవంగా మారింది | Orissa: Girl Missing Goes Dead At Railway Track | Sakshi
Sakshi News home page

ఏం జరిగింది..రాత్రి అదృశ్యం.. ఉదయం రైలు పట్టాలపై శవంగా మారింది

Published Fri, Mar 25 2022 10:36 AM | Last Updated on Fri, Mar 25 2022 10:44 AM

Orissa: Girl Missing Goes Dead At Railway Track - Sakshi

ప్రతికాత్మక చిత్రం

కొరాపుట్‌: అనుమానాస్పదంగా అంజితా కింబుడి(12) అనే బాలిక మృతి చెందిన సంఘటన జిల్లాలోని దమంజొడి రైల్వేస్టేషన్‌ సమీపంలో గురువారం వెలుగుచూసింది. ఖోరాగుడకి చెందిన ఈ బాలిక బుధవారం రాత్రి అదృశ్యం కాగా, ఆ మరుసటి రోజు ఉదయం రైలు పట్టాలపై బాలిక మృతదేహం కనిపించడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటనకు ముందు అటువైపుగా వెళ్లిన హిరాఖండ్‌ రైలు ఢీకొనడంతోనే సదరు బాలిక మృతి చెంది ఉంటుందని ఓ వర్గం అభిప్రాయపడుతుండగా, ఎవరో కిడ్నాప్‌ చేసి, హత్య చేసి మృతదేహం రైలు పట్టాలపై పడేసి ఉంటారని మరో వర్గం సందేహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు రైలురోకోకి దిగారు. దీంతో అటువైపుగా వచ్చే జగదల్‌పూర్‌–హౌరా వెళ్తున్న సమలేశ్వరీ రైలుని ఆపి, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి మృతదేహం తరలించారు. అనంతరం నిరసనకారులకు నచ్చజెప్పి, ఆందోళన విరమింపజేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement