
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీపై మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఎనిమిది రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి కనిపించడం లేదు. బాలిక ఆచూకీలో ప్రభుత్వం వైఫల్యంపై వాల్మీకి, ప్రజాసంఘాలు,మహిళా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.
అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత ఇద్దరు పది, ఒకరు ఆరో తరగతి విద్యార్థులు చెబుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు.
మరోవైపు బాలిక మిస్సింగ్‌పై పోలీసులు సంఘమేశ్వరం, మల్లాల తదితర ప్రాంతాల్లో గాలింపు చేపడుతున్నారు. ముచ్చమర్రిలో కేసును దర్యాప్తు చేసేందుకు భారీ మొత్తంలో పోలీసులు మొహరించారు.

Comments
Please login to add a commentAdd a comment