మహిళలకు రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి సహజంగానే వస్తుంది. కొందరికీ మరీ ఎక్కువగా సమస్యాత్మకంగా ఉంటుంది. కొద్దిమందిలో మొదటి రెండు రోజులు తట్టుకోలేని నొప్పి ఉంటుంది. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో పెయిన్ తట్టుకోలేకపోతే వైద్యుల సూచించిన లేదా నొప్పి ఉపశమించే మందులను వాడుతుంటారు మహిళలు. అలానే ఇక్కడొక అమ్మాయి కూడా మాత్రలు వేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన యూకేలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని లైలా అనే అమ్మాయి పిరియడ్ నొప్పి భరించలేక అల్లాడిపోయింది. దీంతో ఆమె స్నేహితులు ఆ నొప్పి తగ్గాలంటే గర్భనిరోధక మాత్రలు వేసుకోవాలని సూచించారు. లైలా వారి చెప్పినట్లే నవంబర్ 25 నుంచి ఆ టాబ్లెట్లు వేసుకోవడం ప్రారంభించింది. అంతే ఆ ట్యాబ్లెట్లు వాడిన మూడు వారాల తర్వాత నుంచి ఆమెకు తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమేణ పరిస్థితి సీరియస్‌గా మారిపోయింది. డిసెంబర్ 5 నుంచి తీవ్రమైన వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. ఇక క్రమక్రమంగా పరిస్థితి విషమించడం మొదలైంది. ఆమె కడుపు నొప్పిని తాళ్లలేక పోవడంతో కుటుంబ సభ్యలు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు ఆమెకు కడుపులో ఏదైనా గడ్డ ఉందేమోనని అనుమానించారు. కానీ సీటీ స్కాన్‌లో వైద్యులకే దిమ్మతిరిగేలా అసలు విషయం బయటపడింది. కడుపు నొప్పి ..అంటే కడుపులో సమస్య అనుకుంటే అసలు సమస్య బ్రెయిన్‌లోనే ఉండటం వైద్యులనే ఆశ్చర్యపరచడమే గాక కలవరపరిచింది. ఆమె మెదడులో వేగంగా రక్తం గడ్డకడుతుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో వారు వెంటనే డిసెంబర్ 13న ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. అయితే ప్రయోజనం లేకుండాపోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..దయచేసి ఎవ్వరూ కూడా ఇలా ఆ మాత్రలు వేసుకుంటే త్గగుతుంది అనంగానే ఆమెలా అనాలోచితంగా వేసుకోవద్దు. ఒక వేళ అలా వేసుకోవాలనుకున్నా ముందు మీ పెద్దవాళ్లకు కూడా చెప్పండి. ప్రతి ఒక్కరి శరీరం విభిన్నంగా ఉంటుంది. మాత్రలు అందరీకి ఒకేలా రియాక్షన్ ఇవ్వవు. దీన్ని కూడా గుర్తించుకోవాలి. మన శరీర ఆరోగ్య పరిస్థితి, మనకున్న ఆహారపు అలవాట్లు అన్నింటిని పరిగణించి వైద్యులు మాత్రలు ఇస్తారు. ఒక్కొసారి డాక్టర్లు ఇచ్చినవే మనకు ఇబ్బందిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలా తెలిసిన మాత్రలో లేక ఎవరో చెప్పారనో ఎలాంటి మందులు తీసుకోవద్దు. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుని కుటుంబసభ్యులకు తీరని ఆవేదనను మిగల్చకండి అని చెబుతున్నారు వైద్యులు.
(చదవండి: తొమ్మిది పదుల వయసులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!)
Comments
Please login to add a commentAdd a comment