
ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి(బెంగళూరు): మద్యం అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు తాగిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా వారి ఇళ్లకు వెళ్తుంటారు. అయితే కొందరు మాత్రం కిక్కు ఎక్కువై రోడ్డు మీద నానా రభస చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇటీవల ఈ తరహా ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అధికారులు వీరి మీద చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఆశించినంత ఫలితాలను ఇవ్వడం లేదనే చెప్పాలి.
తాజాగా ఓ యువతి పీకల దాకా మద్యం సేవించిన మత్తులో హల్‌చల్ చేసింది. ఈఘటన నగరంలో జరిగింది. మత్తులో తూలుతూ కాలినడకన వస్తున్న ఆమెను కొందరు వెళ్లి రక్షించే ప్రయత్నం చేయగా వారిని దుర్భాషలాడింది. ఆమెను ఎలాగైన సురక్షితంగా ఇంటిక పంపాలని రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రయత్నం చేశారు. కానీ మహిళా పోలీసు సిబ్బంది లేనికారణంగా యువతిని ఆటోలో కూర్చోబెట్టడానికి ఇబ్బంది పడ్డారు. గంటపాటు ప్రయత్నించిన అనంతరం మరో యువతి సాయంతో ఆమెను ఇంటికి సురక్షితంగా తరలించారు.
చదవండి హైదరాబాద్‌లో అమానుషం.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు
Comments
Please login to add a commentAdd a comment