ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు ఉపయోగించకూడదని, ఆ సమయంలో కాల్స్ మాట్లాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే అలా ఫోన్ చార్జింగ్ పెట్టి ఉపయోగిస్తుంటే.. అందులోంచి మంటలు రావడం, బ్యాటరీ పేలి.. గాయపడిన ఘటనలు బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ యువతి ఫోన్‌కు చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందింది. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. అయితే ఆ దేశంలో ఈ తరహా ఘటన జరగడం ఇది మూడో సారి. అది కూడా ఒక వారంలోనే.
ది సన్‌లో వచ్చిన సమాచారం ప్రకారం.. 18 ఏళ్ల రాడ్జా తన ఫోన్‌ని ఉపయోగిస్తుండగా, శాంటారెమ్‌లోని తన ఇంటిపై పిడుగుపడింది. దీంతో ఆమె విద్యుత్ షాక్‌కు గురై స్పృహ కోల్పోయింది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, రాడ్జా అప్పటికే మృతి చెందింది. గతవారం కూడా అపొలినారియా జిల్లాలో చార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించి పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. అలాగే కౌన్సిలర్ రాయ్‌ముండో బ్రిటో కూడా ఇలాగే చార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించి.. పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో.. ఫోన్ చార్జింగ్ పెట్టి.. ఎవ్వరూ కాల్స్ ఎత్తకూడదని.. ఫోన్ ఉపయోగించకూడదని.. బ్రెజిల్ ప్రభుత్వ అధికారులు ప్రజలను హెచ్చరించారు.
చదవండి: Fact Check: హెలికాప్టరుకు ఉరేసి ఉరేగించిన తాలిబన్లు?.. అసలు నిజం ఇది!
Comments
Please login to add a commentAdd a comment