భువనేశ్వర్: కటక్‌లో జరిగిన జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 2–0తో మధ్యప్రదేశ్‌ను ఓడించింది. ఈ జట్టులో ఎక్కువ మంది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన అమ్మాయిలే ఉన్నారు. విజేతగా నిలిచిన జట్టుకు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి రొనాల్డ్ రోస్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment