నిలకడగా ఆడుతున్న భారత్
కటక్: శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు రహానె, ధవన్ జట్టుకు శుభారంభం అందించారు. 15 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది.
భారత జట్టులో రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మురళీ విజయ్ ఆడడం లేదు. వృద్ధిమాన్ సాహా, వరుణ్ ఆరోన్, అక్షర పటేల్ జట్టులోకి వచ్చారు. టీమిండియాకు విరాట్ కోహ్లి, శ్రీలంక జట్టుకు మాథ్యూస్ నేతృత్వం వహిస్తున్నారు.