రహానె, ధవన్లు సెంచరీలు
కటక్: కటక్ వన్డేలో భారత్ ఓపెనర్లు రహానె, ధవన్ సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. ఆదివారం శ్రీలంకతో జరుగుతున్న తొలివన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 35 ఓవర్లలో వికెట్ నష్టానికి 231 పరుగులు చేసింది. రహానె (109), ధవన్ (113) జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించింది. కాగా సెంచరీ చేసిన అనంతరం ధవన్ ప్రియంజన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. రహానెకు తోడుగా రైనా బ్యాటింగ్కు దిగాడు.