Dhawan
-
ఈ సెలబ్రిటీల పెట్టుబడులు ఎక్కడో తెలుసా?
చదువవగానే లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగానికే స్థిరపడకుండా సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయింది. కొత్తగా పరిశ్రమ స్థాపించాలనే వారి కలలకు పారిశ్రామిక రంగం దన్నుగా నిలుస్తోంది. దాంతో, ప్రపంచంలో స్టార్టప్ అనుకూల వాతావరణం ఉన్న దేశాల్లో మన దేశం మూడోస్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 1,16,000 గుర్తింపు పొందిన అంకుర పరిశ్రమలు ఉన్నాయి. దేశంలో లక్షకు పైగా ఉన్న అంకుర పరిశ్రమలు 56 విభిన్న విభాగాల్లో రకరకాల సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్నాయి. ప్రత్యేకించి టెక్ స్టార్టప్స్‌లో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానం మనదే. నాస్కామ్ నివేదిక ప్రకారం 27 వేలదాకా చురుగ్గా పనిచేస్తున్న టెక్ స్టార్టప్స్ ఉన్నాయిక్కడ. యువతరం ఎంతో ఇష్టంగా ఈ రంగంలోకి వస్తోంది. పెట్టుబడిదారులు పెరిగారు, ఇంక్యుబేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలానా ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుందనే కంపెనీల్లో సెలబ్రిటీలు సైతం మదుపు చేసి కోట్లు గడిస్తున్నారు. వీరు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు యూనికార్న్‌లుగా ఎదుగుతున్నాయి. ఇదీ చదవండి: రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే! సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన స్టార్టప్‌లు.. శిఖర్‌ధావన్: అప్‌స్టాక్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. సచిన్ తెందూల్కర్: స్పిన్నీ, కార్లు సెల్లింగ్ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. శ్రద్ధాకపూర్: మైగ్లామ్, నేచురల్ బ్యూటీ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. విరాట్‌కోహ్లీ: ఎంపీఎల్, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్. సెప్టెంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. అనుష్కశర్మ: డిజిట్ ఇన్సూరెన్స్, ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఫ్లాట్‌ఫామ్. జనవరి 2021లో పెట్టుబడి పెట్టారు. ఎంఎస్ ధోని: కార్స్24, ఆన్లైన్ కార్స్ సెల్లింగ్ ప్లాట్‌ఫామ్. నవంబర్ 2020లో పెట్టుబడి పెట్టారు. -
ఢిల్లీ దంచేసింది
నీరు పల్లమెరుగు అన్నట్లే పరుగు ప్రవాహామెరిగిన మ్యాచ్ ఇది. రహనే శతకంతో రాజస్తాన్ భారీ స్కోరే చేసింది. గెలుపు ఆశలతో ఉంది. కానీ ప్రత్యర్థి ఢిల్లీ కూడా ఛేదనలో ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా శిఖర్ ధావన్ తాను ఉన్నంతసేపు దంచేస్తే... రిషభ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో బంతి పదేపదే బౌండరీని తాకింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయం వరించింది. జైపూర్: ఐపీఎల్లో మళ్లీ బంతి బలయింది. బ్యాట్ చెలరేగింది. దీంతో లక్ష్యం పెద్దదైనా ఛేదన సులువైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ (36 బంతుల్లో 78 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) పవర్ హిట్టింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అజింక్య రహానే (63 బంతు ల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. కెప్టెన్ స్మిత్ (32 బంతుల్లో 50; 8 ఫోర్లు) రాణించాడు. రబడకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ధావన్ (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఛేజింగ్‌కు అవసరమైన బ్యాటింగ్ చేశాడు. గోపాల్ 2 వికెట్లు తీశాడు. పంత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మార్పుల్లేని రాయల్స్ జట్టు బరిలోకి దిగగా... ఢిల్లీ క్యాపిటల్స్‌లో సందీప్ లమిచానే స్థానంలో మోరిస్ తుది జట్టులోకి వచ్చాడు. సామ్సన్ డకౌట్... టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రహానేతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు క్రీజులోకి వచ్చిన సంజూ సామ్సన్ (0) ఒక్క బంతి ఆడకుండానే రనౌటయ్యాడు. తర్వాత రహానేకు కెప్టెన్ స్మిత్ జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలతో జట్టును నడిపించారు. రహానే 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన (ఇన్నింగ్స్ ఐదోది) ఓవర్లో రెండో బంతిని ఎదుర్కొన్న రహానే షార్ట్ ఫైన్ లెగ్‌లోకి షాట్ ఆడాడు. అక్కడే ఉన్న ఇషాంత్ శర్మ సులభమైన క్యాచ్‌ను నేలపాలు చేయడంతో బతికి పోయిన రహానే ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ వెంటనే రెండు బంతులను 6, 4గా తరలించాడు. రహానే కళాత్మక వేగం... లైఫ్ దక్కిన రహానే అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగించాడు. కళాత్మక షాట్లతో అలరించాడు. రబడ వేసిన ఆరో ఓవర్లో సిక్స్, ఫోర్‌తో 14 పరుగులు సాధించాడు. దీంతో పవర్‌ప్లేలో రాయల్స్ స్కోరు 52/1కు చేరింది. మరుసటి ఓవర్లోనే రహానే చూడచక్కని బౌండరీ బాది 32 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మిత్ కూడా ఫోర్లు బాదడంతో స్కోరు వేగం పెరిగింది. దీంతో 10 ఓవర్లలో రాజస్తాన్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. స్మిత్ 11వ ఓవర్లో 2, 12వ ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి కెప్టెన్ శ్రేయస్ శతవిధాలా కష్టపడినా ఫలితం పొందలేకపోయాడు. మరోవైపు స్మిత్ కూడా 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. కానీ ఆ తర్వాతి బంతికే అతను నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మిగతా వారెవరూ నిలకడగా ఆడలేకపోయారు. స్టోక్స్ (8), టర్నర్ (0), పరాగ్ (4) పెద్దగా కష్టపడలేదు. స్టువర్ట్ బిన్నీ (19; 2 ఫోర్లు) అండతో 58 బంతుల్లో రహానే శతకం సాధించాడు. అయితే రబడ ఆఖరి ఓవర్లో బిన్నీ, పరాగ్ వికెట్లను పడగొట్టడంతో జట్టు 200 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయింది. ధనాధన్ ఆరంభం... ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 192 పరుగులు. అంటే ఓవర్‌కు దాదాపు 10 పరుగులు చేయాలి. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షాలిద్దరు కూడా ఛేదించాల్సిన లక్ష్యానికి తగ్గట్లే ధనాధన్ ఆరంభమిచ్చారు. దీంతో క్యాపిటల్స్ స్కోరు క్రమపద్ధతిలో దూసుకెళ్లింది. రెండో ఓవర్ వేసిన కులకర్ణి బౌలింగ్‌లో 6, 4 బాదిన ధావన్ తన అర్ధసెంచరీ చేసేదాకా ఇదే ధాటిని కొనసాగించాడు. దీంతో ధావన్ ఉన్నంత సేపూ ప్రతీ ఓవర్లోనూ బౌండరీలు, సిక్సర్లు అలవోకగా వచ్చాయి. 25 బంతుల్లోనే (7 ఫోర్లు, 2 సిక్సర్లు) శిఖర్ అర్ధశతకం పూర్తయింది. ఆ వెంటనే మరో బౌండరీ కొట్టిన అతను నిష్క్రమించడంతో 72 పరుగుల శుభారంభం ముగిసింది. పంత్ పటాకా... అనంతరం వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (4) విఫలమయ్యాడు. 77 పరుగుల వద్ద రెండో వికెట్. రాజస్తాన్ శిబిరంలో ఆనందం. కానీ ఈ ఆనందం ఆవిరయ్యేందుకు, ఢిల్లీ చితగ్గొట్టేందుకు ఎక్కువ సమయం పట్టనే లేదు. ఓపెనర్ పృథ్వీ షా (39 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్)కు జతయిన హిట్టర్ రిషభ్ పంత్ ఆద్యంతం తన ధాటిని కొనసాగించాడు. ఇద్దరు మరో భాగస్వామ్యానికి తెరలేపారు. ఒక ఓవర్లో çపృథ్వీ షా బౌండరీలు బాదితే మరుసటి ఓవర్లో పంత్ సిక్సర్లు కొట్టాడు. ఇలా ఒకర్నిమించి మరొకరు రాజస్తాన్ బౌలింగ్‌ను తుత్తునియలు చేయడంతో కొండంత లక్ష్యం చిన్నదైంది. పంత్ 26 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించాక పృథ్వీ ఆట ముగిసినా... రూథర్‌ఫర్డ్ (11) ఎక్కువసేపు క్రీజులో నిలువకపోయినా... రిషభ్ పంత్ తన సిక్సర్ల ధాటితో మ్యాచ్‌ను విజయవంతంగా ముగించాడు. కులకర్ణి, పరాగ్ చెరో వికెట్ తీశారు. ►ఈ మ్యాచ్‌లో డకౌట్ కావడం ద్వారా టి20 చరిత్రలో వరుసగా ఐదు ఇన్సింగ్స్‌లో ఖాతా తెరవకుండా ఔటైన తొలి బ్యాట్స్‌మన్‌గా ఆస్టన్ టర్నర్ గుర్తింపు పొందాడు. ►ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టుపై నమోదైన సెంచరీలు. ►ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో నమోదైన సెంచరీలు. సామ్సన్ (రాజస్తాన్), బెయిర్‌స్టో, వార్నర్ (హైదరాబాద్), లోకేశ్ రాహుల్ (పంజాబ్), కోహ్లి (బెంగళూరు), రహానే (రాజస్తాన్) ఈ ఘనత సాధించారు. -
ధోని, ధావన్ సాధన
సిడ్నీ: ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా చేరిన టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్ బుధవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లోని నెట్స్‌లో సాధన చేశారు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సమక్షంలో ధోని ఇండోర్ నెట్స్‌లో గడపగా... రాయుడు, ధావన్ పూర్తిగా కుడి, ఎడమ త్రో డౌన్స్‌ను ఎదుర్కొన్నారు. జాదవ్ రెండు నెట్స్‌లోనూ పాల్గొన్నాడు. ప్రాక్టీస్ ఐచ్ఛికం కావడంతో టెస్టు సిరీస్ నెగ్గిన మిగతా జట్టు సభ్యులెవరూ రాలేదు. -
ధావన్‌పై వేటు పడితే ఆశ్చర్యం లేదు!
ఇంగ్లండ్‌లో క్రికెట్ సీజన్ భారత్‌కు అనుకూలంగా మారిపోతుందనుకున్న దశలో కుర్రాడు స్యామ్ కరన్ నేతృత్వంలో ఆ జట్టు పేసర్లు ఒక్కసారిగా ఆశలు కూల్చేశారు. తొలి టెస్టును ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో గెలుచుకొని ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగిందంటే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్ వల్లనే. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ను ఒక వైపు కాపాడుకుంటూ మరో వైపు పరుగులు చేస్తూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని కేవలం 13 పరుగులకే పరిమితం చేయడం కన్నార్పకుండా చూడగలిగిన ప్రదర్శన. ఇతరులతో పోలిస్తే పరిస్థితికి తగినట్లుగా మానసికంగా సిద్ధం కావడం గొప్ప ఆటగాళ్ల లక్షణం. కోహ్లి తాను ఎదుర్కొన్న ప్రతీ బంతి ద్వారా దానిని నిజం చేసి చూపించాడు. ఆరంభంలో బంతి విపరీతంగా స్వింగ్ అవుతున్న సమయంలో పట్టుదలగా ఆడిన కోహ్లి ఆ ఉత్కంఠ క్షణాలను అధిగమించాడు. తన బ్యాక్ లిఫ్ట్‌లు మార్పు చేసి, బ్యాట్ వేగాన్ని తగ్గించి అతను ఫలితం సాధించాడు. ఆ తర్వాత తనదైన శైలిలో చక్కటి షాట్లతో చెలరేగిపోయాడు. దురదృష్టవశాత్తూ ఇతర ఆటగాళ్లు మాత్రం మానసికంగా సన్నద్ధం కాలేకపోయారు. ధావన్‌ను రెండో టెస్టునుంచి తప్పిస్తారనే వార్తలు వినిపించాయి. అది నిజమైతే మాత్రం నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. జట్టు ఎప్పుడు ఓడిపోయినా అందరికంటే ముందు అతనిపైనే వేటు పడుతూ వస్తోంది. ఓడిన మ్యాచ్‌లలో సహచరులకంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాల్లో కూడా ధావన్పైనే వేటు వేశారు. అతనిపై అంత అపనమ్మకం ఉంటే అసలు విదేశీ పర్యటనల్లో ఎంపిక చేయడమెందుకు? దీనికి ధావన్ తనను తాను నిందించుకోవాలి. చక్కగా ఆడుతున్న సమయంలో కూడా అనవసరంగా వికెట్ పారేసుకునే తత్వం అతనిది. కనీసం డబుల్ సెంచరీలాంటి ఇన్నింగ్స్ ఆడితే అతనిపై టీమ్ మేనేజ్మెంట్కు నమ్మకం పెరిగి ఇతరులలాగే అదనపు అవకాశాలు ఇస్తారు కదా. పిచ్‌లు బ్యాటింగ్‌కు స్వర్గధామంలా నిలిస్తే తప్ప ఈ సిరీస్‌లో తక్కువ స్కోర్లు నమోదు కాబోతున్నాయని తొలి టెస్టు రుజువు చేసింది. కాబట్టి అదనపు బ్యాట్స్‌మన్‌తో ఆడటం జట్టుకు ఉపయోగకరం. పుజారాకు అవకాశం ఉంది కానీ కార్తీక్, అశ్విన్, పాండ్యా కూడా స్వింగ్ అవుతు న్న బంతిని ఆడలేకపోతున్నారు కాబట్టి ఆరో బ్యాట్స్‌మన్ పనికొస్తాడు. అయితే పుజారాను తీసుకురావాలంటే ఒక నమ్మకమైన ఆటగాడిని తప్పించాల్సి వస్తుంది. అది మాటల్లో చెప్పినంత సులువు కాదు. -
ధావన్ బాదేశాడు
-
ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్
-
హైదరా'బాద్షా'
ధావన్ ధనాధన్ ముందు రిషభ్ పంత్ మెరుపులు వెలవెలబోయాయి. ఇప్పటిదాకా బౌలింగ్ సత్తాతో గెలిచిన సన్‌రైజర్స్ ఈసారి బ్యాట్‌తో పరుగుల వాన కురిపించింది. తొమ్మిదో విజయంతో ఐపీఎల్–11లో ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా గుర్తింపు పొందిది. లీగ్ కీలక సమయంలో బ్యాటింగ్ కూడా బలపడటం హైదరాబాద్ ఆల్‌రౌండ్ సామర్థ్యాన్ని పరిపూర్ణం చేసింది. న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ బలం బౌలింగే. ఇంటాబయటా హైదరాబాద్ విజయాల్లో బౌల ర్లదే కీలక భూమిక. కానీ ఫిరోజ్ షా కోట్లాలో సీన్ మారింది. ముందుగా బౌలింగ్‌లో తేలిపోయింది. రిషభ్ తుఫాను సెంచరీలో నిండా మునిగింది. కానీ బ్యాటింగ్‌లో ఎగిసిపడింది. కష్టమైన లక్ష్యాన్ని హైదరాబాద్ ధనాధన్ మెరుపులతో అధిగమించింది. గురువారం జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా ఆరో విజయంతో ఈ సీజన్లో తొమ్మిదో గెలుపుతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (63 బంతుల్లో 128 నాటౌట్; 15 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తర్వాత హైదరాబాద్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 191 పరుగులు చేసి గెలిచింది. ధావన్ (50 బంతుల్లో 92 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి గెలిపించారు. 60 బంతుల్లో 60 చేయలేదు కానీ... ఈ టి20 మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను 10–10 ఓవర్లుగా విడదీసి చూసుకుంటే ఆరంభం పేలవంగానే కనబడుతుంది. తొలి సగం ఇన్నింగ్స్‌లో డేర్‌డెవిల్స్ బంతికో పరుగైనా చేయలేదు. పది ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 52 పరుగులే చేసింది. రెండో సగం మాత్రం దద్దరిల్లింది. ఈ సెకండాఫ్‌లో నష్టపోయింది రెండే వికెట్లు... కానీ తుఫాన్ వేగంతో ఏకంగా 135 పరుగులు చేసేసింది. పవర్ స్టార్ పంత్ డెత్ ఓవర్లలో సన్ బౌలర్లను చితగ్గొట్టాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి నాలుగో ఓవర్లోనే కష్టాలు రెట్టింపయ్యాయి. ఓపెనర్లు పృథ్వీ షా (9), జాసన్ రాయ్ (11) ఇద్దరూ షకీబ్ వేసిన నాలుగో ఓవర్లో వరుస బంతుల్లోనే నిష్క్రమించారు. అప్పటికి ఢిల్లీ స్కోరు 21/2. తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌ల ఆట మొదలైంది. సిద్ధార్థ్ కౌల్ వేసిన ఆరో ఓవర్లో పంత్ ‘హ్యాట్రిక్’ ఫోర్లతో ఢిల్లీకి ఊపు తెచ్చాడు. కానీ అతని అనవసర పిలుపు కెప్టెన్ అయ్యర్ (3)ను రనౌట్ చేసింది... ఢిల్లీని ఆత్మరక్షణలో పడేసింది. ఈ దశలో రిషభ్‌కు హర్షల్ పటేల్ జతయ్యాడు. పదో ఓవర్‌దాకా సాదాసీదాగానే ఇన్నింగ్స్ సాగింది. సరిగ్గా 11వ ఓవర్ నుంచి పంత్ ప్రతాపం మొదలైంది. కౌల్ వేసిన ఆ ఓవర్లో అతను సిక్స్, ఫోర్‌తో 14 పరుగులు రాబట్టాడు. 12వ ఓవర్లో రషీద్‌నూ వదిలిపెట్టలేదు. మూడు బౌండరీలతో మరో 15 పరుగులు పిండుకున్నాడు. ‘భువి’కి దించాడు... హైదరాబాద్ డెత్ ఓవర్ల కింగ్ భువనేశ్వర్. అలాంటి అనుభవజ్ఞుడైన భువీని ఒక్కో షాట్‌తో నేలకు దించాడు రిషభ్ పంత్. ఇంతవరకు పూర్తి కోటాలో 25, 30 పరుగులిచ్చుకోని ఈ పేసర్‌ను ఫిఫ్టీ పరుగుల క్లబ్లో చేర్చాడు. భువీ వేసిన 18 ఓవర్లో 18 పరుగులు బాదేసిన యువ సంచలనం... చివరి ఓవర్లో అయితే శివమెత్తాడు. ఫీల్డర్లకు చిక్కని బౌండరీలను, ప్రేక్షకుల చేతికందే సిక్సర్లతో ఏకంగా 26 పరుగులు సాధించాడు. ఆడుతూ పాడుతూ... 18.5 ఓవర్లు వేసిన ఢిల్లీకి ఏ ఓవరూ కలిసిరాలేదు. 113 బంతులేస్తే... ఒకే ఒక్క బంతి మాత్రం హేల్స్ (14)ను ఔట్ చేసింది. ఢిల్లీని మురిపించింది. కానీ ఇది క్షణాలపాటే! తర్వాత ప్రతి బంతి, ప్రతి ఓవర్ అన్ని హైదరాబాద్‌ను విజయబావుటావైపే తీసుకెళ్లాయి. రెండో ఓవర్లోనే ఓపెనర్ ధావన్‌కు జతయిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ కడదాకా సమన్వయంతోనే బ్యాటింగ్ చేశాడు. పరస్పరం స్ట్రయికింగ్ మార్చుకుంటూ, చేయాల్సిన రన్‌రేట్‌ను ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ హైదరాబాద్ పరుగుల నావను నడిపించారు. ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసిన సన్‌రైజర్స్ సగం ఓవర్లు ముగిసేసరికి 91/1తో పటిష్టస్థితికి చేరింది. ధావన్ 30 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు), విలియమ్సన్ 38 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. శ్రేయస్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. ఆఖరిదాకా ఆడుతూ పాడుతూనే పని ముగించారు. అబేధ్యమైన రెండో వికెట్‌కు 176 పరుగులు జోడించి సన్‌రైజర్స్‌ను గెలిపించారు. ఈ విధ్వంసం వీరోచితం... లీగ్‌లో హైదరాబాద్ భీకర బౌలింగ్ లైనప్‌ను చూసి బరిలో దిగకముందే జట్లకు జట్లు జావగారిపోతున్న వేళ... రిషభ్ పంత్ ఒక్కడు నిలిచాడు. షాట్లకు వీలుచిక్కని బంతులతో ప్రత్యర్థులను ముప్పేట చుట్టేస్తున్న భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్ త్రయాన్ని గురువారం మ్యాచ్‌లో నాలుగు చెరువుల నీళ్లు తాగించాడు. కసిగా కొట్టాలన్న పంతం పట్టాడో, మ్యాచ్‌లో తనవల్ల జరిగిన రెండు రనౌట్ తప్పులను దిద్దుకోవాలన్న దీక్షబూనాడో కాని ర్యాంప్ షాట్లతో చెరిగేశాడు. వాస్తవానికి మ్యాచ్‌లో రిషభ్ వస్తూనే వరుసగా మూడు ఫోర్లు కొట్టి దూకుడుగా కనిపించాడు. కానీ, కెప్టెన్ అయ్యర్ రనౌట్‌తో పరిస్థితిని గ్రహించి కొంత తగ్గాడు. కుదురుకున్నాక మాత్రం వెనుదిరిగి చూడలేదు. అతడి దెబ్బకు మొదటి నుంచి బలైంది సిద్ధార్థ్ కౌల్. తర్వాతి వంతు రషీద్ ఖాన్‌ది. మధ్యలో షకీబ్ కూడా చిక్కినా అప్పటికి కోటా అయిపోవడంతో బతికిపోయాడు. ఇక డెత్ ఓవర్ల స్పెషలిస్టు భువనేశ్వర్‌కు 18, 20వ ఓవర్లలో ఏకంగా చుక్కలు చూపాడు. క్రీజుకు ముందు నిల్చొని, పాదాలను వేగంగా కదిలిస్తూ, ర్యాంప్ షాట్‌కు బ్యాట్‌ను పూర్తిగా తెరిచేసి... ఇలా అతడి బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ఇతరులకు పాఠం చెబుతున్నట్లుగా ఆడాడు. ఈ రెండు ఓవర్లలో భువీ వైడ్ సహా 44 పరుగులివ్వగా... అందులో పంత్ చేసినవే 43. చివరి ఓవర్లో అయితే రిషభ్ విధ్వంసమే సృష్టించాడు. రెండు ఫోర్లు, మూడు వరుస సిక్స్‌లతో 26 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో రిషభ్... ఇషాన్ కిషన్, సంజు శామ్సన్ వంటి యువ వికెట్ కీపర్లతో పోటీలో ఒక మెట్టు పైకెదిగాడనేది కాదనలేని నిజం. ►50 ఐపీఎల్ చరిత్రలో నమోదైన సెంచరీల సంఖ్య ►12 ఐపీఎల్లో సెంచరీ చేసిన 12వ భారతీయ క్రికెటర్ రిషభ్ పంత్. గతంలో మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, పాల్ వాల్తాటి, రహానే, సచిన్, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రైనా ఒక్కో సెంచరీ చేశారు. మురళీ విజయ్, సెహ్వాగ్ రెండేసి సెంచరీలు సాధించారు. విరాట్ కోహ్లి అత్యధికంగా నాలుగు సెంచరీలు చేశాడు. ►128 ఐపీఎల్లో, టి20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రిషభ్ పంత్. ►2 మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు–2009లో) తర్వాత ఐపీఎల్లో సెంచరీ చేసిన రెండో పిన్న వయస్కుడిగా పంత్ (20 ఏళ్ల 218 రోజులు). -
శిఖర్ నడిపించగా...
శ్రీలంక చేతిలో పరాజయం నుంచి భారత్ వెంటనే కోలుకుంది. బౌలర్ల సమష్టి ప్రదర్శనకు తోడు శిఖర్ ధావన్ మరోసారి కదం తొక్కడంతో ముక్కోణపు టి20 టోర్నీలో బోణీ చేసింది. ఆడుతూ పాడుతూ బంగ్లాదేశ్‌పై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. టి20 తరహాలో భారీ షాట్లు, మెరుపు బ్యాటింగ్ పెద్దగా కనిపించని ఈ మ్యాచ్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం కొనసాగించగా... బంగ్లాదేశ్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఫలితంగా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే గెలుపు రోహిత్ సేన ఖాతాలో చేరింది. కొలంబో: ముక్కోణపు టి20 టోర్నీ (నిదహాస్ ట్రోఫీ)లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. లిటన్ దాస్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), షబ్బీర్ రహమాన్ (26 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో ఉనాద్కట్ 3, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విజయ్ శంకర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (43 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ నమోదు చేయగా, సురేశ్ రైనా (27 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) సహకారం అందించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 54 బంతుల్లో 68 పరుగులు జోడించారు. చివర్లో మనీశ్ పాండే (19 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్ సోమవారం శ్రీలంకతో తలపడుతుంది. నిస్సారంగా... భారత్‌తో గతంలో ఆడిన ఐదు టి20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఈ మ్యాచ్‌లోనూ నాసిరకంగా కనిపించింది. టి20 స్థాయిలో ఎలాంటి మెరుపులు లేకుండా, ఒక్క ఆటగాడు కూడా ధాటిగా ఆడకుండా జట్టు ఇన్నింగ్స్ సాగింది. మధ్యలో భారత్ రెండు క్యాచ్‌లు వదిలేసినా, రనౌట్ అవకాశాలు వృథా చేసినా ఆ జట్టు వాటిని ఉపయోగించుకోలేకపోయింది. జట్టు ఇన్నింగ్స్‌లో ఏకంగా 55 డాట్ బాల్స్ ఉండటం పరిస్థితిని సూచిస్తోంది. ఉనాద్కట్ వేసిన మూడో ఓవర్లో సిక్సర్ కొట్టిన సర్కార్ (14) అదే ఓవర్లో వెనుదిరగడంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శార్దుల్ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన తమీమ్ (15) తర్వాతి బంతికే అవుటయ్యాడు. విజయ్ శంకర్ తొలి ఓవర్లో రైనా, సుందర్ క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన దాస్ ఆ తర్వాత మరికొన్ని పరుగులు జోడించగలిగాడు. కీపర్ కార్తీక్ క్యాచ్‌తో ముష్ఫికర్ (18) ఆట ముగిసింది. రివ్యూ ద్వారా భారత్ ఈ ఫలితం పొందగా... విజయ్ శంకర్ కెరీర్లో ఇది తొలి వికెట్ కావడం విశేషం. కెప్టెన్ మహ్ముదుల్లా (1) కూడా ప్రభావం చూపలేకపోయాడు. దాస్‌ను చహల్ ఔట్ చేయగా, చివర్లో వేగంగా ఆడే ప్రయత్నం చేసిన షబ్బీర్‌ను చక్కటి బంతితో ఉనాద్కట్ డగౌట్‌కు పంపించాడు. బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన మన బౌలర్లు కొన్ని సార్లు గతి తప్పారు. 11 వైడ్లు, 2 నోబాల్‌లు సహా మొత్తం 15 పరుగులు ఎక్స్‌ట్రాలు ఇచ్చారు. అర్ధసెంచరీ భాగస్వామ్యం... స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా టీమిండియా విజయం దిశగా దూసుకెళ్లింది. ఇన్నింగ్స్ రెండో బంతిని ఫోర్‌గా మలచి ధావన్ శుభారంభం చేయగా, రెండో ఓవర్లో రోహిత్ (17) తాను ఎదుర్కొన్న ఐదు బంతుల వ్యవధిలో మూడు బౌండరీలు బాదాడు. అయితే ముస్తఫిజుర్ బంతిని రోహిత్ వికెట్లపైకి ఆడుకోగా, కొద్ది సేపటికి రూబెల్ బౌలింగ్‌లో రిషభ్ పంత్ (7) కూడా అదే తరహాలో అవుటయ్యాడు. ఈ దశలో ధావన్, రైనా చకచకా పరుగులు సాధిస్తూ పోయారు. ధావన్ గత మ్యాచ్ జోరును కొనసాగించగా, రైనా మాత్రం తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. మెహదీ హసన్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ ద్వారా కొట్టిన సిక్సర్‌తో రైనా అంతర్జాతీయ టి20ల్లో 50 సిక్సర్లు పూర్తి చేసుకోవడం విశేషం. నజ్ముల్ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్ దిశగా ఫోర్ కొట్టిన ధావన్ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో తక్కువ వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగినా... దినేశ్ కార్తీక్ (2 నాటౌట్)తో కలిసి పాండే జట్టును గెలిపించారు. -
ఇంటాబయటా ఎక్కడైనా గెలుస్తాం: ధావన్
భారత వన్డే జట్టు అద్భుతంగా రాణిస్తోందని, ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలిగే సత్తా ప్రస్తుత కోహ్లి సేనలో ఉందని ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ‘జట్టులో చాలా మంది అనుభవజ్ఞులున్నారు. సత్తాగల కుర్రాళ్లతో సమతూకంగా ఉంది. పాండ్యాలాంటి ఆల్‌రౌండర్ జట్టుకు అదనపు బలం. దీంతో దక్షిణాఫ్రికాల పేలవమైన రికార్డును చెరిపేసేందుకు టీమిండియా సిద్ధంగా ఉంది’ అని ధావన్ అన్నాడు. ఫ్లాట్ పిచ్‌లపై కూడా చెలరేగే మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్లను ఎదుర్కోవడం ఇప్పుడు ఏ జట్టుకైనా కష్టమేనన్నాడు. -
ఎమిరేట్స్ అనుచిత ప్రవర్తన!
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌కు దక్షిణాఫ్రికాకు వెళ్లే సమయంలో అనూహ్య ఘటన ఎదురైంది. దుబాయ్ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ధావన్ కుటుంబ సభ్యులను అడ్డుకున్నారు. అతని భార్య, పిల్లల గుర్తింపు కోసం బర్త్ సర్టిఫికెట్తో పాటు ఇతర డాక్యుమెంట్లు చూపించాల్సిందిగా కోరారు. దాంతో సర్టిఫికెట్లు వచ్చే వరకు వారిని అక్కడే ఉంచి ధావన్ జట్టుతో పాటు దక్షిణాఫ్రికా వెళ్లిపోవాల్సి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో ధావన్ తన ఆగ్రహాన్ని ప్రకటించాడు. ‘ఎమిరేట్స్ సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. కేప్‌టౌన్ ఫ్లయిట్ ఎక్కే సమయంలో నా కుటుంబ సభ్యులు ప్రయాణించడానికి వీల్లేదని వారు చెప్పారు. నా భార్యా పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర డాక్యుమెంట్లు చూపించమన్నారు. మేం వాటిని వెంట తీసుకుపోలేదు. దాంతో డాక్యుమెంట్ల కోసం ఎదురు చూస్తూ వారు ఇంకా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నారు. అలాంటివి అవసరం అని భావిస్తే మేం ముంబైలో ఫ్లయిట్ ఎక్కే సమయంలోనే అధికారులు చెప్పాలి కదా. కారణం లేకుండా ఎమిరేట్స్ ఉద్యోగి ఒకరు దురుసుగా ప్రవర్తించాడు’ అని ధావన్ ఆక్రోశించాడు. -
చెలరేగిన ధావన్
సాక్షి, న్యూఢిల్లీ : న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ధావన్ (63 నాటౌట్), మరో ఓపెనర్ రోహిత్ శర్మ(43 నాటౌట్) రాణిస్తున్నారు. శిఖర్ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డులో వేగం పెంచాడు. శాంట్నర్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సింగిల్ తీసిన ధావన్ అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 13 ఓవర్లలో భారత్ స్కోరు 114/0. -
రాణించిన భారత ఓపెనర్లు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో వరుసగా ఐదు మ్యాచ్‌లలో 50కి పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించిన ఆటగాళ్లుగా నిలిచారు. 2015లో చివరిసారి ఈ జోడీ 50కి పైగా పరుగులు సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, అజింక్యా రహానే శుభారంభాన్నిచ్చారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ ఆటగాళ్లు ఆపై రన్‌రేట్‌ను మెరుగు పరిచారు. 25 ఓవర్లలో శతక భాగస్వామ్యం అందించాక 132 పరుగుల వద్ద రహానే(78 బంతుల్లో 62: 8 ఫోర్లు) ను విండీస్ బౌలర్ జోసెఫ్ ఔట్ చేశాడు. మిడాన్‌లో విండీస్ కెప్టెన్ హోల్డర్ క్యాచ్ పట్టడంతో రహానే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. 32వ ఓవర్లో మరో ఓపెనర్ ధావన్(78 బంతుల్లో 87: 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. విండీస్ బౌలర్ బిషూకు ధావన్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయి రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 32 ఓవర్లలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. -
ముంబైని పడగొట్టి ముందడుగు..
-
ముంబైని పడగొట్టి ముందడుగు...
⇒హైదరాబాద్ కీలక విజయం ⇒ప్లే ఆఫ్‌కు మరింత చేరువ ⇒7 వికెట్లతో ముంబై చిత్తు ⇒రాణించిన ధావన్, కౌల్ డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక సమయంలో స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించింది. ఓడితే ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతయ్యే స్థితిలో బరిలోకి దిగిన జట్టు సొంతగడ్డపై తమ బలాన్ని ప్రదర్శించింది. ముందు బౌలింగ్‌లో, ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ సమష్టి ప్రదర్శనతో పటిష్ట ముంబైని కంగుతినిపించింది. ఫలితంగా లీగ్‌లో ముందుకెళ్లే అవకాశాలు మెరుగుపర్చుకుంది. ఉప్పల్ స్టేడియంలో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నెగ్గి సీజన్లో సొంత మైదానంలో తమ విజయాల రికార్డును 6–1తో ముగించింది. హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్లో మరో చక్కటి విజయం దక్కింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. సునాయాస లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (45 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 140 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (46 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి బ్యాటింగ్‌తో ముందుండి నడిపించగా... హెన్రిక్స్ (35 బంతుల్లో 44; 6 ఫోర్లు) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 66 బంతుల్లో 91 పరుగులు జోడించారు. హైదరాబాద్ శనివారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌తో కాన్పూర్‌లో తలపడుతుంది. కెప్టెన్ ఇన్నింగ్స్... భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు మైదానంలో మాత్రం తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోయింది. 20 ఓవర్లలో ఏ దశలోనూ ఆ జట్టు రన్‌రేట్ ఓవర్‌కు 7 పరుగులు దాటలేదు. నెమ్మదైన పిచ్‌తో పాటు సన్‌రైజర్స్ బౌలర్లు ప్రత్యర్థిని పూర్తిగా కట్టి పడేశారు. తొలి రెండు ఓవర్లలో 4 పరుగులే చేసిన ముంబై, సిమన్స్ (1) వికెట్ కూడా కోల్పోయింది. సిరాజ్ వేసిన మూడో ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్ సహా 16 పరుగులు రాగా, ఒత్తిడిలో నితీశ్ రాణా (9) విఫలమయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 36 పరుగులే చేయగా, దూకుడుగా ఆడే ప్రయత్నంలో పార్థివ్ (17 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో రోహిత్, హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 15) కలిసి జట్టును ఆదుకున్నారు. రోహిత్ ధాటిని ప్రదర్శించగా, పాండ్యా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. హెన్రిక్స్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన రోహిత్ 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 49 బంతుల్లో 60 పరుగులు జోడించిన తర్వాత పాండ్యా అవుటయ్యాడు. కొద్ది సేపటికే కౌల్ బౌలింగ్‌లో రోహిత్ కూడా బౌల్డ్ కాగా, పొలార్డ్ (5) ప్రభావం చూపలేకపోయాడు. భారీ భాగస్వామ్యం... ఫామ్‌లో ఉన్న కెప్టెన్ వార్నర్ (6)ను ఆరంభంలోనే అవుట్ చేసి ముంబై సంబరాల్లో మునిగింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ధావన్, హెన్రిక్స్ సాధికారిక బ్యాటింగ్ ముందు ఎలాంటి వ్యూహాలు పని చేయలేదు. ఎలాంటి తడబాటు లేకుండా చకచకా పరుగులు రాబట్టిన ధావన్, హెన్రిక్స్లను ఏ ముంబై బౌలర్ కూడా నియంత్రించలేకపోయాడు. కరణ్ శర్మ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లతో ధావన్ దూకుడు కనబర్చగా, పాండ్యా, మలింగ ఓవర్లలో హెన్రిక్స్ రెండేసి ఫోర్లు కొట్టాడు. చివరకు బుమ్రా ఈ జోడీని విడదీశాడు. మరో ఎండ్‌లో ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, యువరాజ్ (9) విఫలమయ్యాడు. అయితే విజయ్ శంకర్ (15 నాటౌట్) సహకారంతో ధావన్ మ్యాచ్ ముగించాడు. ఇదీ సమీకరణం... ఐపీఎల్లో అధికారికంగా ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ మాత్రమే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న కోల్‌కతా, పుణే కూడా దాదాపుగా ముందుకు వెళ్లినట్లే. తాజా విజయంతో సన్‌రైజర్స్ 15 పాయింట్లతో తమ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా... గుజరాత్‌పై చివరి మ్యాచ్ కూడా గెలిస్తే ఎలాంటి లెక్కల అవసరం లేకుండా 17 పాయింట్లతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు వెళుతుంది. హైదరాబాద్‌ను దాటి పంజాబ్ ముందుకు వెళ్లాలంటే అది తమ మిగిలిన మూడు మ్యాచ్‌లలో కూడా తప్పనిసరిగా విజయం సా«ధించాల్సి ఉంటుంది. అది అంత సులువు కాదు కాబట్టి హైదరాబాద్‌కు ప్రమాదం ఉండకపోవచ్చు. ముంబైపై సన్‌రైజర్స్ గెలుపుతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కూడా ప్లే ఆఫ్ రేసు నుంచి అవుటైంది. -
దుమ్మురేపిన సన్ రైజర్స్..
► పంజాబ్ లక్ష్యం 208 ► అర్ధసెంచరీలు సాధించిన విలియమ్సన్, శిఖర్ ధావన్, వార్నర్ మోహాలీ: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు డెవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, విలియమ్సన్ లు అర్ధ సెంచరీలతో కదం తొక్కడంతో హైదరాబాద్ పంజాబ్ కు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ఓపెనర్లు డెవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ ధాటిగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సరికి జట్టు 60 పరుగులు చేసింది. అదే ఊపును కొనసాగిస్తూ వార్నర్ 25 బంతుల్లో, ధావన్ 31 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. అయితే మాక్స్ వెల్ 9 ఓవర్లో వార్నర్ 51( 4 ఫోర్లు, 4 సిక్సర్లు)ను అవుట్ చేయడంతో వీరద్దరీ 107 పరుగుల అజేయ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విలయమ్సన్ కూడా దాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 9 ఫోర్లు ఒక సిక్సర్ తో 77 పరుగులు చేసిన ధావన్ మోహిత్ శర్మ బౌలింగ్ లో ఓ భారీషాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్(15) త్వరగా అవుటై మరోసారి నిరాశపర్చగా విలయమ్సన్, హెన్రిక్స్ తో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 బంతుల్లో విలయమ్సన్ అర్ధసెంచరీ సాధించడంతో హైదరబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో మాక్స్ వెల్ కు 2 వికెట్లు దక్కగా, మోహీత్ ఒక వికెట్ దక్కింది. -
విలియమ్సన్ విలయతాండవం
-
విలియమ్సన్ విలయతాండవం
► 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 89 పరుగులు చేసిన విలియమ్సన్ ► రాణించిన శిఖర్ ధావన్ (70) హైదరాబాద్: ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆటగాడు విలియమ్సన్ విలయ తాండవానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం స్టేడియం దద్దరిల్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణిత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి192 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలి మ్యాచ్ ఆడుతున్నవిలయమ్సన్ కు శిఖర్ ధావన్ జత కావడంతో జట్టు భారీ స్కోరు చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ 21 పరుగుల వద్ద ఓపెనర్ వార్నర్ (4) వికెట్ ను కోల్పోయింది. 17 ఇన్నింగ్స్ ల తర్వాత వార్నర్ సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విలయమ్సన్, ధావన్ తో జత కలిసి దాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ దశలో 33 బంతుల్లో విలయమ్సన్ అర్ద సెంచరీ పూర్తి చేయగా ధావన్ 40 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 89 పరుగులు చేసిన విలయమ్సన్ క్రిస్ మోరిస్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యడు. రెండో వికెట్ కు విలియమ్సన్, ధావన్ లు 136 పరుగుల జోడించారు. 200 పరుగుల భారీ లక్ష్యం నిర్ధేశిస్తునుకున్న తరుణంలో క్రిస్ మోరిస్ వరుస బంతుల్లో ధావన్ (70), యువరాజ్ (3)లను పెవిలియన్ కు పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్, సందీప్ హుడా చివరి ఓవర్లో 17 పరుగులు రాబట్టడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 191 పరుగులు చేయగలిగింది. క్రిస్ మోరిస్ కు నాలుగు వికెట్లు దక్కాయి. -
తొలి టి20లో భారత్ ఓటమి
-
చివర్లో చేతులెత్తేశారు...
తొలి టి20లో భారత్ ఓటమి రెండు పరుగులతో గెలిచిన జింబాబ్వే భారత్ గెలవాలంటే 6 బంతుల్లో 8 పరుగులు కావాలి. క్రీజులో సూపర్ ఫినిషర్ ధోనితో పాటు అక్షర్ పటేల్ ఉన్నాడు... మామూలుగా అయితే ఈ జోడీకిది పెద్ద స్కోరు కాదు... అందులోనూ బౌలింగ్ వేయడానికి వచ్చిన మద్జీవా కూడా ఓవర్‌కు 9కి పైగా పరుగులు ఇచ్చాడు. దీంతో ఇక భారత్ గెలుపు నల్లేరు మీద నడకే అనుకుంటున్న తరుణంలో జింబాబ్వే అనూహ్యంగా షాకిచ్చింది. క్రీజులో ఉన్న ధోనికి సరైన అవకాశం ఇవ్వకుండా ఇతర బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి కేవలం ఐదు పరుగులతోనే సరిపెట్టింది. దీంతో ఈ టూర్లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. హరారే: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఊపుమీదున్న భారత్‌ను జింబాబ్వే ఒకే ఒక్క మ్యాచ్‌తో కిందకు దించింది. అన్ని రంగాల్లో సమష్టిగా రాణిస్తూ టి20 సిరీస్‌లో శుభారంభం చేసింది. చిగుంబురా (26 బంతుల్లో 54 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్‌తో... శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 2 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు మాత్రమే చేసింది. మనీష్ పాండే (35 బంతుల్లో 48; 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. సిరీస్‌లో రెండో టి20 మ్యాచ్ సోమవారం జరుగుతుంది. సిక్సర్ల జాతర... అనుభవం లేని భారత కుర్ర పేసర్లపై ఓపెనర్ మసకద్జా మూడు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డా... ఐదో ఓవర్లో బుమ్రా దెబ్బకు వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాతి ఓవర్లో ముతుబామి (0) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన జింబాబ్వే.. ఏడో ఓవర్లో చిబాబా (19 బంతుల్లో 20; 3 ఫోర్లు) వికెట్‌ను చేజార్చుకుంది. ఈ దశలో రజా (18 బంతుల్లో 20; 2 ఫోర్లు), వాలర్ (30) సింగిల్స్‌తో పాటు వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్‌రేట్ తగ్గకుండా చూశారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 34 బంతుల్లో 47 పరుగులు జత చేశారు. ఆఖర్లో చిగుంబురా భారత బౌలర్ల దుమ్ముదులిపాడు. ఏడు సిక్సర్లు బాది 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు సాధించాడు. మనీష్ హవా... వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించిన లోకేశ్ రాహుల్ (0) తొలి బంతికే డకౌట్ అయినా... మన్దీప్ సింగ్, రాయుడు (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఒకర్నిమించి ఒకరు బౌండరీలు బాదారు. అయితే ఆరో ఓవర్లో రాయుడు అనూహ్యంగా అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో మనీష్ పాండే నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నా.. రెండో ఎండ్‌లో మన్దీప్ వికెట్ చేజార్చుకున్నాడు. ఇక కేదార్ జాదవ్ (19), మనీష్‌లు సింగిల్స్‌కు పరిమితమైనా.. చెరో సిక్సర్ బాది ఒత్తిడిని తగ్గించుకున్నారు. నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించాకా జాదవ్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 90/4. తర్వాత ధోని (19 నాటౌట్) అండతో మనీష్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. చకచకా ఐదో వికెట్‌కు 53 పరుగులు జత చేసి వెనుదిరిగాడు. దీంతో స్కోరు 143/5కి చేరుకుంది. ఇక 12 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన దశలో అక్షర్ పటేల్ (18)... 19వ ఓవర్లో 13 పరుగులు రాబట్టినా... ఆఖరి ఓవర్లో పేలవమైన బ్యాటింగ్‌తో భారత్ బోల్తా పడింది. ► 2 టి20ల్లో భారత్‌పై జింబాబ్వేకిది వరుసగా రెండో విజయం. గతేడాది జులై 19న హరారేలోనే జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 10 పరుగులతో నెగ్గింది. ► 1 టి20ల్లో ఒకే మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదుగురు ఆటగాళ్లు (రిషి ధావన్, మన్దీప్ సింగ్, ఉనాద్కట్, రాహుల్, చాహల్) అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి. ► 1 టి20 మ్యాచ్‌లో తొలి బంతికే భారత్ వికెట్ కోల్పోవడం ఇదే మొదటిసారి. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: చిబాబా (బి) ధావన్ 20; మసకద్జా (సి) ధోని (బి) బుమ్రా 25; ముతుబామి రిటైర్డ్ హర్ట్ 0; సికిందర్ రజా రనౌట్ 20; వాలర్ (బి) చాహల్ 30; ముటోంబోది (సి) ధావన్ (బి) పటేల్ 3; చిగుంబురా నాటౌట్ 54; క్రెమర్ (సి) ధావన్ (బి) బుమ్రా 4; మద్జీవా నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1-33; 2-50; 3-97; 4-98; 5-111; 6-130. బౌలింగ్: ఉనాద్కట్ 4-0-43-0; రిషీ ధావన్ 4-0-42-1; బుమ్రా 4-1-24-2; అక్షర్ పటేల్ 4-0-18-1; చాహల్ 4-0-38-1. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) తిరిపానో 0; మన్దీప్ (సి) ముటోంబోడి (బి) చిబాబా 31; రాయుడు (బి) చిబాబా 19; మనీష్ పాండే (సి) తిరిపానో (బి) ముజురబాని 48; కేదార్ జాదవ్ (బి) ముజురబాని 19; ధోని నాటౌట్ 19; అక్షర్ పటేల్ (సి) సబ్ మసకద్జా (బి) మద్జీవా 18; రిషీ ధావన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1-0; 2-44; 3-53; 4-90; 5-143; 6-164. బౌలింగ్: తిరిపానో 4-0-35-1; మద్జీవా 4-0-34-1; ముజురబాని 4-0-31-2; చిబాబా 2-0 -13-2; రజా 3-0-18-0; క్రెమెర్ 3-0-35-0. -
తీరంలో ‘సూర్యో’దయం
► సన్‌రైజర్స్ విజయాల హ్యాట్రిక్ 85 పరుగులతో ముంబై చిత్తు ► రాణించిన ధావన్, వార్నర్ చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు ‘సొంత మైదానం’ కాని సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన పట్టును ప్రదర్శించింది. గత ఏడాది ఇక్కడే హోం గ్రౌండ్‌గా మూడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ జట్టు ఇప్పుడు ప్రత్యర్థి స్థానంలో తలపడింది. అయితే వేదిక మారినా ఆ జట్టు జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఈసారి విశాఖ తీరంలో ముంబైని తుక్కుగా ఓడించి లీగ్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ముందుగా వార్నర్, ధావన్ మెరుపులకు తోడు అద్భుత బౌలింగ్ రైజర్స్‌ను నిలబెట్టింది. ఒకరు కాదు ఇద్దరు కాదు...నలుగురు సన్‌రైజర్స్ బౌలర్లు తమ తొలి ఓవర్లోనే వికెట్ తీస్తే భారీ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అచేతనంగా మారిపోయింది. 26 బంతులు ఆడే సరికే ఐదుగురు ఆటగాళ్లు అవుట్ కాగా... లీగ్‌లో ఛేదన అంటే చెలరేగిపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం మొదలు... పది ఓవర్ల లోపే ఏడు వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు ఏమీ చేయలేక చేతులెత్తేసింది. సీజన్లో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన రోహిత్ బృందం మూడు విజయాల తర్వాత ఓటమిని మూటగట్టుకుంది. సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుతమైన ప్రదర్శనతో ఆ జట్టు లీగ్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రైజర్స్ 85 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (57 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయమైన బ్యాటింగ్‌కు తోడు వార్నర్ (33 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారం జట్టుకు భారీ స్కోరు అందించాయి. అనంతరం ముంబై 16.3 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. సన్ బలమైన బౌలింగ్ ముందు ముంబై బ్యాటింగ్ సమష్టిగా విఫలమైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆశిష్ నెహ్రా (3/15), ముస్తఫిజుర్ రహమాన్ (3/16) చెలరేగగా, బరీందర్‌కు 2 వికెట్లు దక్కాయి. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం ఇదే మైదానంలో పుణేతో తలపడుతుంది. ఓపెనర్లు దూకుడు: ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు వార్నర్, ధావన్ మరోసారి హైదరాబాద్‌కు అదిరే ఆరంభం ఇచ్చారు. ముందుగా వార్నర్ జోరు మొదలు పెట్టగా, ఆ తర్వాత ధావన్ లయ అందుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్‌గా మలచిన వార్నర్...హర్భజన్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది దూకుడు ప్రదర్శించాడు. మెక్లీనగన్ బౌలింగ్‌లో కూడా వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 51 పరుగులకు చేరింది. అయితే భజ్జీ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన వార్నర్, అదే ఊపులో అవుట్ కావడంతో 85 పరుగుల (59 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. విలియమ్సన్ (2) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో ధావన్, యువరాజ్ కలిసి జట్టును నడిపించారు. గత మ్యాచ్‌లో విఫలమైన యువరాజ్ తన 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో చెలరేగాడు. పొలార్డ్ వేసిన ఓవర్లో యువీ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టడంతో రైజర్స్ ఇన్నింగ్స్ వేగం పెరిగింది. మరోవైపు 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ధావన్, అనంతరం బుమ్రా వేసిన రెండు ఓవర్లలో కలిపి నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది దూకుడు ప్రదర్శించాడు. చివరి ఓవర్ నాలు గో బంతికి యువీ హిట్ వికెట్‌గా వెనుదిరగ్గా, ఓవర్లో ఏడు పరుగులే వచ్చాయి. అయితే 15-19 మధ్య ఐదు ఓవర్లలో సన్‌రైజర్స్ 68 పరుగులు చేయడం జట్టు భారీ స్కోరుకు కారణమైంది. టపటపా...: భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ పూర్తిగా పట్టు తప్పింది. ఆ జట్టులో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీస స్థాయిలో పోరాడలేకపోయాడు. తొలి ఓవర్ చివరి బంతికి పార్థివ్ (0)ను అవుట్ చేసి భువనేశ్వర్ శుభారంభం ఇవ్వగా, నెహ్రా వేసిన రెండో ఓవర్ తొలి బంతినే రోహిత్ (5) వికెట్లపైకి ఆడుకున్నాడు. నెహ్రా తన రెండో ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. నాలుగో బంతికి రాయుడు (6) వెనుదిరగ్గా, ఆరో బంతిని బట్లర్ (2) నేరుగా కీపర్ చేతుల్లోకి పంపించాడు. భువీ, నెహ్రాలాగే తొలి ఓవర్లో వికెట్ పండగ చేసుకుంటూ బరీందర్ కూడా తన రెండో బంతికే కృనాల్ (11 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్)ను అవుట్ చేయడంతో ముంబై 30 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. బరీందర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి పొలార్డ్ (11) ఆదుకునే ప్రయత్నం చేసినా అతనూ వెంటనే అవుటయ్యాడు. ఈసారి నా వంతు అంటూ తొలి బంతికే హార్దిక్ (7)ను అవుట్ చేసిన ముస్తఫిజుర్, రెండో ఓవర్ తొలి బం తికి సౌతీ (3)ని వెనక్కి పంపడంతో ముంబై గెలు పు ఆశలు కోల్పోయింది. హర్భజన్ (21 నాటౌట్; 2 ఫోర్లు) కొద్దిసేపు పోరాడినా మరో 21 బంతులు ఉండగానే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 48; ధావన్ (నాటౌట్) 82; విలియమ్సన్ (సి) రోహిత్ (బి) హర్భజన్ 2; యువరాజ్ (హిట్‌వికెట్) (బి) మెక్లీనగన్ 39; హెన్రిక్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 177 వికెట్ల పతనం: 1-85; 2-91; 3-176. బౌలింగ్: సౌతీ 4-0-35-0; మెక్లీనగన్ 4-0-38-1; హర్భజన్ 4-0-29-2; బుమ్రా 4-0-35-0; హార్దిక్ 1-0-10-0; పొలార్డ్ 2-0-23-0; కృనాల్ 1-0-5-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) నెహ్రా 5; పార్థివ్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; రాయుడు (సి) విలియమ్సన్ (బి) నెహ్రా 6; కృనాల్ (సి) ధావన్ (బి) బరీందర్ 17; బట్లర్ (సి) ఓజా (బి) నెహ్రా 2; పొలార్డ్ (సి) బరీందర్ (బి) హెన్రిక్స్ 11; హార్దిక్ (సి) ఓజా (బి) ముస్తఫిజుర్ 7; హర్భజన్ (నాటౌట్) 21; సౌతీ (సి) ఓజా (బి) ముస్తఫిజుర్ 3; మెక్లీనగన్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తఫిజుర్ 8; బుమ్రా (సి) ఓజా (బి) బరీందర్ 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16.3 ఓవర్లలో ఆలౌట్) 92. వికెట్ల పతనం: 1-5; 2-5; 3-28; 4-30; 5-30; 6-49; 7-50; 8-58; 9-78; 10-92. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-23-1; నెహ్రా 3-0-15-3; బరీందర్ 3.3-0-18-2; హెన్రిక్స్ 4-0-18-1; ముస్తఫిజుర్ 3-0-16-3. -
మరింత రైజింగ్
► సన్‌రైజర్స్‌కు ఐదో విజయం ► 5 వికెట్లతో గుజరాత్ ఓటమి ► సమష్టిగా రాణించిన బౌలర్లు ► ధావన్ కీలక ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మొదటి రెండు ఓవర్లు మెయిడిన్లు... బౌలర్లంతా పోటాపోటీగా కట్టుదిట్టంగా బంతులు వేయడం... సన్‌రైజర్స్‌కు బలమైన బౌలర్లు మరోసారి చెలరేగారు. అయితే 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాట్స్‌మెన్ తడబడినా... శిఖర్ ధావన్ కీలక ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ లయన్స్‌పై గెలిచింది. సీజన్లో వార్నర్ సేనకు ఇది ఐదో విజయం. దీంతో ప్లే ఆఫ్ దిశగా హైదరాబాద్ మరో అడుగు ముందుకు వేసింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకుపోతోంది. సమర్థ బౌలింగ్‌కు తోడు ధావన్ బ్యాటింగ్ ప్రదర్శనతో మరో కీలక విజయం సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (42 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముస్తఫిజుర్, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (40 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఫించ్ మినహా...: మెకల్లమ్, స్మిత్... ఇద్దరూ విధ్వంసకర బ్యాట్స్‌మెన్. కానీ సన్ బౌలర్ల నిలకడతో కనీసం సింగిల్స్ తీయడానికి కూడా కిందామీదా పడ్డారు. మూడో ఓవర్ రెండో బంతికి ఆ జట్టు ఖాతా తెరిచింది. అయితే ఇదే ఒత్తిడిలో స్మిత్ (9 బంతుల్లో 1) అవుటయ్యాడు. రైనా (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు నిలవలేదు. పవర్‌ప్లేలో ఆ జట్టు 26 పరుగులు మాత్రమే చేయగలిగింది. విలియమ్సన్, వార్నర్‌ల అద్భుతమైన క్యాచ్‌లకు కార్తీక్ (0), మెకల్లమ్ (19 బంతుల్లో 7) వెనుదిరగడంతో లయన్స్ 34 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఫించ్, బ్రేవో (20 బంతుల్లో 18; 1 ఫోర్) కొద్దిగా ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కు 39 బంతుల్లో 45 పరుగులు జోడించిన తర్వాత బ్రేవో వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లాంగాఫ్‌లో వార్నర్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో ఫించ్ బతికిపోయాడు. ఆఖర్లో ఫించ్‌కు కొద్ది సేపు జడేజా (13 బంతుల్లో 18; 2 ఫోర్లు) అండగా నిలవడంతో లయన్స్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. లయన్స్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. ధావన్ యాంకర్ ఇన్నింగ్స్: స్వల్ప లక్ష్య ఛేదనలో రైజర్స్‌కు వార్నర్ (17 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడైన ఆరంభం అందించాడు. సాంగ్వాన్ వేసిన రెండో ఓవర్లో అతను రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు. అయితే ధావల్ తన తొలి బంతికే వార్నర్‌ను అవుట్ చేయడంతో గుజరాత్‌కు బ్రేక్ లభించింది. ఆ వెంటనే విలియమ్సన్ (6) వెనుదిరగ్గా, హెన్రిక్స్ (16 బంతుల్లో 14; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్‌లో ధావన్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 10 ఓవర్లు ముగిసే సరికి అతను 15 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే ఆ తర్వాత మరింత బాధ్యత తీసుకొని ఆడిన అతను జట్టును ముందుండి నడిపించాడు. ఐపీఎల్-9లో తొలి మ్యాచ్ ఆడిన యువరాజ్ (14 బంతుల్లో 5) పూర్తిగా నిరాశపరిచాడు. ఈ దశలో గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో కొంత ఒత్తిడి నెలకొంది. అయితే ధావన్ సంయమనంతో ఆడుతూ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు గుజరాత్ లయన్స్ బ్యాటింగ్: డ్వేన్ స్మిత్ (సి) ముస్తఫిజుర్ (బి) భువనేశ్వర్ 1; మెకల్లమ్ (సి) వార్నర్ (బి) హెన్రిక్స్ 7; రైనా (సి) అండ్ (బి) భువనేశ్వర్ 20; కార్తీక్ (సి) విలియమ్సన్ (బి) ముస్తఫిజుర్ 0; ఫించ్ (నాటౌట్) 51; బ్రేవో (సి) (సబ్) విజయ్ శంకర్ (బి) బరీందర్ 18; జడేజా (సి) భువనేశ్వర్ (బి) ముస్తఫిజుర్ 18; ప్రవీణ్ కుమార్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1-2; 2-24; 3-25; 4-34; 5-79; 6-106; బౌలింగ్: భువనేశ్వర్ 4-1-28-2; నెహ్రా 4-1-23-0; ముస్తఫిజుర్ 4-0-17-2; బరీందర్ 3-0-21-1; హెన్రిక్స్ 3-0-24-1; యువరాజ్ 2-0-13-0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) ప్రవీణ్ (బి) ధావల్ 24; ధావన్ (నాటౌట్) 47; విలియమ్సన్ (సి) స్మిత్ (బి) ప్రవీణ్ 6; హెన్రిక్స్ (సి) కార్తీక్ (బి) బ్రేవో 14; యువరాజ్ (సి) సాంగ్వాన్ (బి) ధావల్ 5; హుడా (సి) కార్తీక్ (బి) బ్రేవో 18; ఓజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1-26; 2-33; 3-55; 4-81; 5-108. బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-28-1; సాంగ్వాన్ 2-0-28-0; ధావల్ 4-1-17-2; కౌశిక్ 4-0-25-0; జడేజా 2-0-14-0; బ్రేవో 3-0-14-2. -
కొత్త ఉత్సాహంతో ఉన్నాం...
► విశ్రాంతి అనంతరం ► నేడు బరిలోకి సన్‌రైజర్స్ సాక్షి, హైదరాబాద్: దాదాపు వారం రోజుల క్రితం బెంగళూరుపై కీలక విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఆ తర్వాత దక్కిన ఐదు రోజుల విరామాన్ని ఆటగాళ్లు పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఈ విరామంలో ఆటగాళ్లు తమకు నచ్చిన రీతిలో సరదాగా గడిపారు. ఇప్పటికి సరిగ్గా సగం మ్యాచ్‌లు ఆడిన జట్టు, రెండో దశకు సిద్ధమైంది. కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగి ప్లే ఆఫ్ దిశగా దూసుకుపోవాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రైజర్స్ ప్రధాన ఆటగాళ్లు వార్నర్, ధావన్, భువనేశ్వర్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆటతో పాటు తమ ఆసక్తులను పంచుకున్నారు. విశేషాలు వారి మాటల్లోనే... నాకు నచ్చిందే చేస్తా! ఐపీఎల్ ఆరంభంలో కాస్త తడబడ్డాను. కానీ కొద్ది సేపు నిలదొక్కుకోగలిగితే రాణిస్తానని నాకు నమ్మకముంది. ఇప్పుడు మళ్లీ లయ అందుకున్నాను. కెప్టెన్‌గా, ఓపెనింగ్ సహచరుడిగా కూడా వార్నర్ ఎంతో అండగా నిలిచాడు. క్రీజ్‌లో ఉన్నప్పుడు నాపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు. రెండేళ్లుగా కలిసి ఆడటంతో అతనితో మంచి సమన్వయం ఉంది. టి20ల్లో టాపార్డర్ బాగా ఆడితే విజయం దక్కుతుంది. రైజర్స్‌కు ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి. అనుభవజ్ఞులు యువరాజ్, నెహ్రాల రాకతో జట్టు బలం పెరిగింది. మా ఫీల్డింగ్ కాస్త మెరుగైతే చాలు. పాతతరం ఆటగాళ్లకు ఎలా ఉండేదో తెలీదు కానీ సోషల్ మీడియా వల్ల మా జనరేషన్ క్రికెటర్లపై బాగా ఒత్తిడి పెరిగింది. ప్రతీ విషయం అందరికీ చేరిపోతోంది. నాకు నచ్చింది నేను చేస్తాను తప్ప ఎవరి కోసమో, స్టైల్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకో కాదు. మీసం మెలేసినా, పఠానీ సూట్ ధరించినా, చెవిపోగు అయినా అదంతా నేను ఇష్టంతో చేసే పని. వీటి వల్ల నాలో కొత్త ఉత్సాహం వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక నేను ఎవరికో చూపించడానికో, సరదాకో స్విచ్ హిట్లు, స్కూప్లులాంటి షాట్లు ఆడను. సాధారణ షాట్లతోనే పరుగులు వస్తుంటే ఇంక వాటి అవసరం లేదు’ - ధావన్ మందు మానేశా... అంతా బాగుంది! మనం ఏదైతే బాగా ఇష్టపడతామో దానిని వదిలేయడం అంత సులువు కాదు. గతంలో మ్యాచ్‌కు ముందు గానీ, మ్యాచ్ తర్వాత గానీ తప్పనిసరిగా మద్యం తీసుకునేవాడిని. దీనివల్ల నా మనసు ప్రశాంతంగా అనిపించేది. మానేశాక అంతా భిన్నంగా ఉంది. ఇప్పుడు నా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత 12 నెలల కాలంలో ఆస్ట్రేలియా తరఫున, ఐపీఎల్లో చాలా క్రికెట్ ఆడటమే కాదు బాగా ఆడుతున్నాను కూడా. ప్రతీ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నా. మందు మానేయడం వల్ల గాయాలయ్యే అవకాశాలు కూడా తక్కువ. దీని వల్ల నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించగలుగుతున్నా. అల్కహాల్‌కు గుడ్‌బై చెప్పి నాకు నేనే సవాల్ విసిరా. లక్ష్యం చేరుకోవడం సంతోషంగా ఉంది. నేను కెప్టెన్‌గా మరీ కొత్త వ్యూహాలు ఏమీ అమలు చేయడం లేదు. పైగా ప్రతీది చెప్పాల్సిన అవసరం లేకుండా ఆటగాళ్లంతా బాగా ఆడుతుండటంతో నా పని మరింత సులువైంది. జట్టులో 11 మందీ సమానమే. ఎవరినీ గొప్ప చేసి చెప్పను. యువరాజ్ ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు’ - వార్నర్ స్పీడున్నా ‘స్వింగ్’ మారదు ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్‌లో విఫలమైన తర్వాత నా బౌలింగ్‌పై కాస్త ఆందోళన కలిగింది. అయితే ఆ తర్వాత మరింత ప్రాక్టీస్‌తో నియంత్రణ సాధించాను. నేను ప్రధానంగా స్వింగ్ బౌలర్‌నే. కానీ వేగంగా వేసేందుకు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాను. బౌలింగ్‌లో వేగం పెరిగితే స్వింగ్ పోతుందని చాలా మంది అంటారు. కానీ నేను రెండింటినీ సమన్వయం చేసుకోగలననే నమ్మకముంది. దాని కోసం ప్రాక్టీస్ సెషన్లోనే ఎక్కువగా సాధన చేస్తున్నాను. తొలి ఆరు ఓవర్లలో, చివరి ఓవర్లలో నా బౌలింగ్‌లో కచ్చితంగా వైవిధ్యం ఉంటుంది. టి20 ఫార్మాట్లో బౌలర్ మరింత తెలివిగా వ్యవహరించాలి. యార్కర్లు, స్లో బౌన్సర్లు సమర్థంగా ఉపయోగించాలి. మా జట్టులో మంచి పేసర్లు ఉండటంతో ఒకరినుంచి మరొకరు నేర్చుకునే అవకాశం లభిస్తోంది. ముస్తఫిజుర్ గొప్పతనం అతని యాక్షన్‌లో ఉంది. అది అతనికి సహజంగా వచ్చింది. ఐపీఎల్‌లాంటి బిజీ షెడ్యూల్లో సుదీర్ఘ విశ్రాంతి లభించడం చాలా మంచి విషయం. కొత్తగా ఆలోచించేందుకు, బాగా ఆడేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని ఇది ఇస్తుంది. రాబోయే మ్యాచ్‌లలో మరింతగా రాణిస్తాను’ - భువనేశ్వర్ -
మనీష్ పాండేను ఆడించాలి
సంజయ్ మంజ్రేకర్ ఆస్ట్రేలియాతో చావోరేవోలాంటి మ్యాచ్‌లో భారత్ స్థాయికి తగ్గట్లుగా ఆడి గెలిచింది. మొహాలీలో విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓ భారతీయుడు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్. భారత్‌ను సెమీస్‌కు చేర్చినందుకు కోహ్లికి థ్యాంక్స్ చెప్పాలి. గత రెండు మ్యాచ్‌లలో వెస్టిండీస్ ప్రదర్శన చూసిన తర్వాత భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత అఫ్ఘానిస్తాన్ చేతిలోనూ ఓడిపోయారు. చాలామంది గేల్ గురించి మాట్లాడేటప్పుడు అతడి పవర్ గురించి మాత్రమే చెబుతారు. కానీ అతడిలో అంతకు మించి చాలా ఉంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో గేల్ చూపించిన టెంపర్మెంట్ అద్భుతం. భారత్‌తో మ్యాచ్‌లో గేల్‌ది ఎంత పెద్ద వికెట్టో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత బ్యాటింగ్ లైనప్‌లోని లోపాలు కోహ్లి అద్భుత ప్రదర్శనల వల్ల కనిపించడం లేదు. ఇక బౌలింగ్ మాత్రం అద్భుతంగా, నిలకడగా ఉంది. భారత జట్టు బౌలింగ్ బలంతో ఆడుతుండటం చాలా అరుదుగా జరిగే విషయం. యువరాజ్ సింగ్ అందుబాటులో లేనందున మనీష్ పాండేను తుది జట్టులోకి తీసుకోవాలి. ఈ ఫార్మాట్లో రహానే కంటే కూడా పాండే ప్రమాదకర ఆటగాడు. వాంఖడే పిచ్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం. కాబట్టి ధావన్‌కు మరో మ్యాచ్‌లో అవకాశం ఇవ్వొచ్చు. ఆస్ట్రేలియాతో చావోరేవోలాంటి మ్యాచ్‌లో భారత్ స్థాయికి తగ్గట్లుగా ఆడి గెలిచింది. మొహాలీలో విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓ భారతీయుడు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్. భారత్‌ను సెమీస్‌కు చేర్చినందుకు కోహ్లికి థ్యాంక్స్ చెప్పాలి. గత రెండు మ్యాచ్‌లలో వెస్టిండీస్ ప్రదర్శన చూసిన తర్వాత భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత అఫ్ఘానిస్తాన్ చేతిలోనూ ఓడిపోయారు. చాలామంది గేల్ గురించి మాట్లాడేటప్పుడు అతడి పవర్ గురించి మాత్రమే చెబుతారు. కానీ అతడిలో అంతకు మించి చాలా ఉంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో గేల్ చూపించిన టెంపర్మెంట్ అద్భుతం. భారత్‌తో మ్యాచ్‌లో గేల్‌ది ఎంత పెద్ద వికెట్టో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత బ్యాటింగ్ లైనప్‌లోని లోపాలు కోహ్లి అద్భుత ప్రదర్శనల వల్ల కనిపించడం లేదు. ఇక బౌలింగ్ మాత్రం అద్భుతంగా, నిలకడగా ఉంది. భారత జట్టు బౌలింగ్ బలంతో ఆడుతుండటం చాలా అరుదుగా జరిగే విషయం. యువరాజ్ సింగ్ అందుబాటులో లేనందున మనీష్ పాండేను తుది జట్టులోకి తీసుకోవాలి. ఈ ఫార్మాట్లో రహానే కంటే కూడా పాండే ప్రమాదకర ఆటగాడు. వాంఖడే పిచ్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం. కాబట్టి ధావన్‌కు మరో మ్యాచ్‌లో అవకాశం ఇవ్వొచ్చు. -
మీ సంగతేంటి..?
► ఆందోళన కలిగిస్తున్న ఓపెనర్లు ► మిడిలార్డర్ కూడా అంతంత మాత్రమే మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: భారత జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరినా జట్టు బ్యాటింగ్ ప్రదర్శన పట్ల పెద్దగా ఎవరికీ సంతృప్తి లేదు. కోహ్లి మినహా ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇప్పటివరకూ ఆడలేదు. కోహ్లి పుణ్యమాని పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై గెలిచాం. బంగ్లాదేశ్ స్వయంకృతాపరాధంతో గట్టెక్కాం. మొత్తానికి సెమీస్‌కు చేరాం. కానీ రేపు సెమీస్‌లో కోహ్లి పొరపాటున విఫలమైతే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు భారత జట్టు సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న ఇది. ఓపెనర్ల వైఫల్యం వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు, టి20ల్లో కూడా సెంచరీ ఉన్న ఘనత రోహిత్ శర్మ సొంతం. కానీ అదంతా బ్యాటింగ్ పిచ్‌ల మహిమే తప్ప రోహిత్ గొప్పతనం కాదేమో అన్నట్లుగా అతని ఆట కొనసాగుతోంది. నాలుగు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా అతను కనీస ప్రభావం చూపలేకపోయాడు. మొత్తం టోర్నీలో అతను ఇప్పటి వరకు 45 పరుగులే చేశాడు. పిచ్ కాస్త బౌలర్లకు అనుకూలిస్తుంటే చాలు చేతులెత్తేస్తున్నాడు. పోరాటపటిమ అనేది మచ్చుకైనా కనిపించక పోగా, అవుటైన తీరు నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. శిఖర్ ధావన్ కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈసారి టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా ప్రభావం చూపలేదు. ధావన్ వరుసగా 1, 6, 23, 13 పరుగులు చేశాడు. నేరుగా వచ్చిన బంతులను స్వీప్ ఆడి అతను రెండు సార్లు ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం ఇంకా డెరైక్టర్, కోచ్‌లు గుర్తించినట్లు లేదు. గతంలో చాలా సందర్భాల్లో టి20లైనా సరే వీరిద్దరు ఆరంభంలో కాస్త నిలదొక్కుకొని ఆ తర్వాత చెలరేగిపోయేవారు. ఫలితంగా స్ట్రైక్‌రేట్ కూడా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడూ నిలబడే ప్రయత్నంలో బంతులు తినేస్తున్నారు. కానీ ఆ వెంటనే అవుట్ కావడంతో పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారుతోంది. గత నాలుగు మ్యాచ్‌లలో భారత ఓపెనింగ్ భాగస్వామ్యం 5 పరుగులు (5 బంతుల్లో), 14 (13), 42 (36), 23 (23)గా ఉంది. టి20ల్లో సాధారణంగా పవర్‌ప్లేలో కనిపించే మెరుపు ఆరంభానికి ఇది భిన్నం. మిడిల్ అంతంత మాత్రమే ఇక ఈ టోర్నీలో అందరికంటే దారుణం రైనా. బంగ్లాదేశ్‌పై చేసిన 30 పరుగులు మినహా ఏమాత్రం ఆడలేదు. పడుతూ లేస్తూ పరుగులు చేస్తున్న యువరాజ్‌ను చూసి సంతోషించాలో లేక గతంలో అతడి స్థాయిని గుర్తు చేసుకుని బాధపడాలో తెలియడం లేదు. ఒకప్పుడు గొప్ప మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న యువరాజ్ ఇప్పుడు చివరి వరకూ నిలబడలేకపోతున్నాడు. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు కలిపి 52 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కొద్ది సేపు నిలబడగలిగితే ఆ మాత్రం పరుగులైనా వస్తున్నాయి కానీ లేదంటే ఆరంభంలో తడబడితే అక్కడితోనే సరి. కెప్టెన్ ధోని నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఇప్పటివరకూ పరుగులు రాలేదు. ఆల్‌రౌండర్ పేరున్న జడేజా బ్యాటింగ్ మరచిపోయి చాలా కాలం అయింది కాబట్టి అతనిపై ఆశలు పెట్టుకోవడం కూడా అనవసరం. టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో కనీసం 100 పరుగులు చేసిన 23 మందిలో కోహ్లి మినహా మరెవరూ భారతీయులు లేకపోవడం మన బ్యాట్స్‌మెన్ ఆటకు ఉదాహరణ. ఇక స్ట్రైక్‌రేట్ పరంగా చూస్తే కోహ్లి (132.37)నే 46వ స్థానంలో నిలిచాడంటే మన స్టార్ బ్యాట్స్‌మెన్ వేగంగా కూడా ఆడలేకపోతున్నారని అర్థమవుతుంది. యువరాజ్ సరిగ్గా 100 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తే...రోహిత్ (88.23), ధావన్ (82.69) బంతికో పరుగు కూడా చేయలేకపోయారు. మరోసారి టి20ల్లో విశ్వ విజేతగా నిలిచేందుకు, సొంతగడ్డపై వరుసగా ప్రపంచకప్ గెలిచేందుకు ఇక ఆడాల్సింది రెండు మ్యాచ్‌లే. ఇతర బ్యాట్స్‌మెన్ కూడా టోర్నీలో తమదైన ముద్ర వేసేందుకు ఇదే మిగిలిన అవకాశం. మరి ఇకనైనా కోలుకుంటారా..? -
ప్రాణం లేచొచ్చింది!
► ఒక్క పరుగుతో బంగ్లాదేశ్‌పై గెలిచిన భారత్ ► చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లతో సంచలనం ► టి20 ప్రపంచకప్‌లో సెమీస్ ఆశలు సజీవం ► తర్వాతి మ్యాచ్ ఆదివారం ఆస్ట్రేలియాతో కోట్లాది మంది ఊపిరి బిగపట్టి చూస్తున్న క్షణం.. లక్షలాది గొంతుకలు మూగబోతున్న తరుణం... వేలాది కనులు రెప్పార్పకుండా చూసిన సమయం... ఏదో జరుగుతోంది.... ఏదేదో అయిపోతోంది. ఊహకందని స్థాయిలో... ఊహించని రీతిలో... కళ్లముందే భారత్ స్వప్నం చెదిరిపోతోంది అభిమానుల మనసు మూగబోవడానికి ఇక మిగిలింది క్షణమే...స్వదేశంలో ధోనిసేన పరువు పాతాళంలో కలవడానికి మిగిలిందీ ఆ క్షణమే... కానీ ఆ ఒక్క క్షణమే.... భారత జట్టు తల రాతను తిరగరాసింది. జరిగింది కలో.. అద్భుతమో తెలుసుకునే లోపే... ఆశకు, నిరాశకు మధ్య ఊగిసలాడుతున్న ఎన్నో ప్రాణాలు లేచి వచ్చేలా మాయ జరిగింది.చివరి మూడు బంతులకు మూడు వికెట్లు తీసి... చేజారిన మ్యాచ్‌ను రెండు చేతులా భారత్ ఒడిసిపట్టింది. కేవలం రెండు పరుగులు చేయలేక బంగ్లా గుండె పగిలింది. టి20 ప్రపంచకప్‌లో భారత్ ఒక్క పరుగుతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బెంగళూరునుంచి సాక్షి క్రీడా ప్రతినిధి నరాలు తెగే ఉత్కంఠ... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ విజయం దోబూచులాడిన వేళ... భారత జట్టు ఒత్తిడిని జయించింది. చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి గట్టెక్కింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ఒక్క పరుగు తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసింది. సురేశ్ రైనా (23 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులకు పరిమితమయింది. తమీమ్ ఇక్బాల్ (32 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. 2 కీలక వికెట్లు తీసిన అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్‌కు చేరుతుంది. కనిపించని దూకుడు: తొలి ఐదు ఓవర్లలో 27 పరుగులు... తర్వాతి ఓవర్లో 15 పరుగులతో పాటు రోహిత్ శర్మ అవుట్. ఇదీ పవర్‌ప్లేలో భారత జట్టు ఆట కొనసాగిన తీరు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు దూకుడైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ధావన్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (16 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిని ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఆడారు. ముస్తఫిజుర్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్, ధావన్ చెరో సిక్సర్ బాది వేగం పెంచగా... చివరి బంతికి రోహిత్‌ను అవుట్ చేసి బౌలర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. మరుసటి ఓవర్లోనే చక్కటి బంతితో షకీబ్... ధావన్‌ను పెవిలియన్ పంపించాడు. కోహ్లి, రైనా మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించిన అనంతరం మరోసారి బంగ్లా ఆధిక్యం ప్రదర్శించింది. షువగత వేసిన 14వ ఓవర్లో 17 పరుగులు రాబట్టి భారత్ దూకుడు ప్రదర్శించినా...అదే ఓవర్లో కోహ్లి (24 బంతుల్లో 24; 1 సిక్స్) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం వరుస బంతుల్లో రైనా, పాండ్యా (7 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అమీన్ అవుట్ చేయగా, యువరాజ్ (3) విఫలమయ్యాడు. చివర్లో ధోని (13 నాటౌట్), జడేజా(12) కొన్ని పరుగులు జోడించినా స్కోరు 150 పరుగుల లోపే ఆగిపోయింది. అంతా కలిసికట్టుగా...: సాధారణ లక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన మ్యాచ్‌లో బుమ్రా... బంగ్లా ప్రధాన బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ నెత్తిన పాలు పోశాడు. ఫీల్డింగ్ వైఫల్యంతో ఇన్నింగ్స్ తొలి బంతికే తమీమ్‌కు బౌండరీని ఇచ్చిన బుమ్రా... 15 పరుగుల వద్ద అతను ఫైన్‌లెగ్‌లో ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను వదిలేశాడు. అంతే... ఈ అవకాశాన్ని అందుకున్న తమీమ్... బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లోనే చెలరేగిపోయి నాలుగు ఫోర్లు బాదాడు. అయితే అదే ఊపులో భారీ షాట్‌కు ప్రయత్నించి తమీమ్ వెనుదిరగ్గా, మరో వైపు దూకుడు ప్రదర్శించిన షబ్బీర్ (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్)ను ధోని అద్భుతంగా స్టంపౌట్ చేశాడు. ఎనిమిది పరుగుల వద్ద షకీబ్ (15 బంతుల్లో 22; 2 సిక్సర్లు) క్యాచ్‌ను అశ్విన్ వదిలేసినా... కొద్ది సేపటికే అద్భుత బంతికి అతనే అవుట్ చేశాడు. ఈ దశలో మహ్ముదుల్లా, సర్కార్ (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే చివరి ఓవర్లలో భారత బౌలర్లు పూర్తిగా కట్టి పడేశారు. 19వ ఓవర్లో బుమ్రా 6 పరుగులే ఇవ్వగా, ఆఖరి ఓవర్లో పాండ్యా 9 పరుగులు ఇచ్చినా 2 కీలక వికెట్లు తీయడం, చివరి బంతికి ధోని రనౌట్ చేయడంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) షబ్బీర్ (బి) ముస్తఫిజుర్ 18; ధావన్ (ఎల్బీ) (బి) షకీబ్ 23; కోహ్లి (బి) షువగత 24; రైనా (సి) షబ్బీర్ (బి) అమీన్ 30; పాండ్యా (సి) సర్కార్ (బి) అమీన్ 15; ధోని (నాటౌట్) 13; యువరాజ్ (సి) అమీన్ (బి) మహ్ముదుల్లా 3; జడేజా (బి) ముస్తఫిజుర్ 12; అశ్విన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-42; 2-45; 3-95; 4-112; 5-112; 6-117; 7-137. బౌలింగ్: మొర్తజా 4-0-22-0; షువగత 3-0-24-1; అమీన్ 4-0-37-2; ముస్తఫిజుర్ 4-0-34-2; షకీబ్ 4-0-23-1; మహ్ముదుల్లా 1-0-4-1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 35; మిథున్ (సి) పాండ్యా (బి) అశ్విన్ 1; షబ్బీర్ (స్టంప్డ్) ధోని (బి) రైనా 26; షకీబ్ (సి) రైనా (బి) అశ్విన్ 22; మొర్తజా (బి) జడేజా 6; మహ్ముదుల్లా (సి) జడేజా (బి) పాండ్యా 18; సర్కార్ (సి) కోహ్లి (బి) నెహ్రా 21; ముష్ఫికర్ (సి) ధావన్ (బి) పాండ్యా 11; షువగత (నాటౌట్) 0; ముస్తఫిజుర్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1-11; 2-55; 3-69; 4-87; 5-95; 6-126; 7-145; 8-145; 9-145 బౌలింగ్: నెహ్రా 4-0-29-1; బుమ్రా 4-0-32-0; అశ్విన్ 4-0-20-2; జడేజా 4-0-22-2; పాండ్యా 3-0-29-2; రైనా 1-0-9-1. హైడ్రామా సాగిందిలా... బంగ్లాదేశ్ విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు కావాలి. హార్దిక్ పాండ్యా బంతి అందుకున్నాడు.తొలి బంతి: మహ్మదుల్లా డీప్ కవర్లోకి ఆడి సింగిల్ తీశాడు.రెండో బంతి: లెంగ్త్ బాల్. ముష్ఫిఖర్ ఎక్స్ట్రా కవర్లోకి బౌండరీ కొట్టాడు.మూడో బంతి: ముష్ఫిఖర్ స్కూప్ షాట్ ఆడి బౌండరీ సాధించాడు. మిగిలిన మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుస్తుంది.నాలుగో బంతి: ముష్ఫికర్ పుల్‌షాట్ ఆడాడు. డీప్ మిడ్వికెట్లో ధావన్ క్యాచ్ పట్టాడు. ఐదో బంతి: పుల్‌టాస్ బంతిని మహ్మదుల్లా భారీ షాట్ కొట్టాడు. డీప్ మిడ్వికెట్లో జడేజా పరిగెడుతూ వచ్చి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.సింగిల్ తీస్తే మ్యాచ్ టై. రెండు పరుగులుచేస్తే బంగ్లా విజయంఆఖరి బంతి: ఆఫ్ స్టంప్ బయట పడిన బంతిని బ్యాట్స్‌మన్ షువగతా మిస్ చేశాడు. నాన్‌స్ట్రయికర్ ముస్తఫిజుర్ పరుగు పూర్తి చేసేలోపు... కీపర్ ధోని తెలివిగా పరిగెడుతూ వచ్చి బెయిల్స్ ఎగరగొట్టాడు. రనౌట్. భారత్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. బంగ్లా గుండె పగిలింది.