సన్‌రైజర్స్ బలం బౌలింగే. ఇంటాబయటా హైదరాబాద్ విజయాల్లో బౌల ర్లదే కీలక భూమిక. కానీ ఫిరోజ్ షా కోట్లాలో సీన్ మారింది. ముందుగా బౌలింగ్‌లో తేలిపోయింది. రిషభ్ తుఫాను సెంచరీలో నిండా మునిగింది. కానీ బ్యాటింగ్‌లో ఎగిసిపడింది. కష్టమైన లక్ష్యాన్ని హైదరాబాద్ ధనాధన్ మెరుపులతో అధిగమించింది. గురువారం జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా ఆరో విజయంతో ఈ సీజన్‌లో తొమ్మిదో గెలుపుతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.