
ధావన్ కు జీవనదానం
హామిల్టన్: ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ భారత్ 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయే ప్రమాదాన్ని తప్పించుకుంది. డాషింగ్ ఓపెనర్ శిఖర్ కు జీవనదానం లభించింది. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
మూనీ బౌలింగ్ లో ధావన్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను పోర్టర్ ఫీల్డ్ నేలపాలు చేశాడు. దీంతో ధావన్ ఊపిరి పీల్చుకున్నాడు. టిమిండియా 8 ఓవర్లలో 40/0 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.