దుమ్మురేపిన సన్ రైజర్స్..
► పంజాబ్ లక్ష్యం 208
► అర్ధసెంచరీలు సాధించిన విలియమ్సన్, శిఖర్ ధావన్, వార్నర్
మోహాలీ: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు డెవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, విలియమ్సన్ లు అర్ధ సెంచరీలతో కదం తొక్కడంతో హైదరాబాద్ పంజాబ్ కు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ఓపెనర్లు డెవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ ధాటిగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సరికి జట్టు 60 పరుగులు చేసింది. అదే ఊపును కొనసాగిస్తూ వార్నర్ 25 బంతుల్లో, ధావన్ 31 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేశారు.
అయితే మాక్స్ వెల్ 9 ఓవర్లో వార్నర్ 51( 4 ఫోర్లు, 4 సిక్సర్లు)ను అవుట్ చేయడంతో వీరద్దరీ 107 పరుగుల అజేయ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విలయమ్సన్ కూడా దాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 9 ఫోర్లు ఒక సిక్సర్ తో 77 పరుగులు చేసిన ధావన్ మోహిత్ శర్మ బౌలింగ్ లో ఓ భారీషాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్(15) త్వరగా అవుటై మరోసారి నిరాశపర్చగా విలయమ్సన్, హెన్రిక్స్ తో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 బంతుల్లో విలయమ్సన్ అర్ధసెంచరీ సాధించడంతో హైదరబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో మాక్స్ వెల్ కు 2 వికెట్లు దక్కగా, మోహీత్ ఒక వికెట్ దక్కింది.