విలియమ్సన్ విలయతాండవం
విలియమ్సన్ విలయతాండవం
Published Wed, Apr 19 2017 9:59 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
► 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 89 పరుగులు చేసిన విలియమ్సన్
► రాణించిన శిఖర్ ధావన్ (70)
హైదరాబాద్: ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆటగాడు విలియమ్సన్ విలయ తాండవానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం స్టేడియం దద్దరిల్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణిత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి192 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలి మ్యాచ్ ఆడుతున్నవిలయమ్సన్ కు శిఖర్ ధావన్ జత కావడంతో జట్టు భారీ స్కోరు చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ 21 పరుగుల వద్ద ఓపెనర్ వార్నర్ (4) వికెట్ ను కోల్పోయింది. 17 ఇన్నింగ్స్ ల తర్వాత వార్నర్ సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విలయమ్సన్, ధావన్ తో జత కలిసి దాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ దశలో 33 బంతుల్లో విలయమ్సన్ అర్ద సెంచరీ పూర్తి చేయగా ధావన్ 40 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 89 పరుగులు చేసిన విలయమ్సన్ క్రిస్ మోరిస్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యడు. రెండో వికెట్ కు విలియమ్సన్, ధావన్ లు 136 పరుగుల జోడించారు. 200 పరుగుల భారీ లక్ష్యం నిర్ధేశిస్తునుకున్న తరుణంలో క్రిస్ మోరిస్ వరుస బంతుల్లో ధావన్ (70), యువరాజ్ (3)లను పెవిలియన్ కు పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్, సందీప్ హుడా చివరి ఓవర్లో 17 పరుగులు రాబట్టడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 191 పరుగులు చేయగలిగింది. క్రిస్ మోరిస్ కు నాలుగు వికెట్లు దక్కాయి.
Advertisement