ఆఖర్లో పంచ్ | India's defeat in the second warm-up match | Sakshi
Sakshi News home page

ఆఖర్లో పంచ్

Published Sun, Mar 13 2016 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

ఆఖర్లో పంచ్

ఆఖర్లో పంచ్

రెండోప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓడిన భారత్ 4 పరుగులతో దక్షిణాఫ్రికా గెలుపు
చెలరేగిన డుమిని, డికాక్ ధావన్, రైనా, ధోనిల శ్రమ వృథా

 
ముంబై: పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న భారత్‌కు టి20 ప్రపంచకప్‌కు ముందు పంచ్ పడింది. శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోనిసేన 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 196 పరుగులు చేసింది. డుమిని (44 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ (33 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోయారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. మిల్లర్ (18) ఓ మాదిరిగా ఆడినా మిగతా వారు విఫలమయ్యారు. పాండ్యా 3, షమీ, బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు.

తర్వాత భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు మాత్రమే చేసింది. ధావన్ (53 బంతుల్లో 73; 10 ఫోర్లు), రైనా (26 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ధావన్, రైనా నాలుగో వికెట్‌కు 94 పరుగులు జోడించి ఆదుకున్నారు.

అయితే 24 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన దశలో ధావన్, రైనా రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. ఈ దశలో వచ్చిన యువరాజ్ (16 నాటౌట్), ధోని వీరవిహారం చేశారు. 18 బంతుల్లో 41 పరుగులు చేశారు. ఇక ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు చేయాల్సిన దశలో 9 పరుగులు మాత్రమే రాబట్టడంతో ఓటమి తప్పలేదు.
 
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (సి) ధోని (బి) బుమ్రా 5; డికాక్ రిటైర్డ్ అవుట్ 56; డు ప్లెసిస్ (సి) జడేజా (బి) షమీ 12; డుమిని (సి) జడేజా (బి) షమీ 67; మిల్లర్ (సి) ధోని (బి) పాండ్యా 18; రోసోవ్ (సి) జడేజా (బి) పాండ్యా 11; వీస్ (సి) ధోని (బి) పాండ్యా 0; మోరిస్ (బి) బుమ్రా 14; బెహర్డిన్ రనౌట్ 5; అబాట్ నాటౌట్ 0; ఫాంగిసో నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 196.
వికెట్ల పతనం: 1-15; 2-33; 3-110; 4-148; 5-170; 6-171; 7-186; 8-194; 9-195.

బౌలింగ్: హర్భజన్ 4-0-27-0; షమీ 4-0-37-2; బుమ్రా 4-0-51-2; పాండ్యా 4-0-36-3; నేగి 1-0-12-0; జడేజా 2-0-18-0; రైనా 1-0-13-0.

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) అబాట్ 10; ధావన్ రిటైర్డ్ అవుట్ 73; కోహ్లి (సి) డికాక్ (బి) స్టెయిన్ 1; రహానే రనౌట్ 11; రైనా రిటైర్డ్ అవుట్ 41; యువరాజ్ నాటౌట్ 16; ధోని నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192.

వికెట్ల పతనం: 1-11; 2-16; 3-48; 4-142; 5-142.
బౌలింగ్: స్టెయిన్ 4-0-36-1; అబాట్ 4-0-32-1; మోరిస్ 4-0-43-0; వీస్ 2-0-26-0; తాహిర్ 3-0-25-1; డుమిని 2-0-16-0; ఫాంగిసో 1-0-13-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement