రాణించిన భారత ఓపెనర్లు | Team India opener rahane out as first wicket | Sakshi
Sakshi News home page

రాణించిన భారత ఓపెనర్లు

Published Fri, Jun 23 2017 8:52 PM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM

రాణించిన భారత ఓపెనర్లు

రాణించిన భారత ఓపెనర్లు

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో  భారత ఓపెనర్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో వరుసగా ఐదు మ్యాచ్‌లలో 50కి పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించిన ఆటగాళ్లుగా నిలిచారు. 2015లో చివరిసారి ఈ జోడీ 50కి పైగా పరుగులు సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, అజింక్యా రహానే శుభారంభాన్నిచ్చారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ ఆటగాళ్లు ఆపై రన్‌రేట్‌ను మెరుగు పరిచారు.

25 ఓవర్లలో శతక భాగస్వామ్యం అందించాక 132 పరుగుల వద్ద రహానే(78 బంతుల్లో 62: 8 ఫోర్లు) ను విండీస్ బౌలర్ జోసెఫ్ ఔట్ చేశాడు. మిడాన్‌లో విండీస్ కెప్టెన్ హోల్డర్ క్యాచ్ పట్టడంతో రహానే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. 32వ ఓవర్లో మరో ఓపెనర్ ధావన్(78 బంతుల్లో 87: 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. విండీస్ బౌలర్ బిషూకు ధావన్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయి రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 32 ఓవర్లలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement