సంజయ్ మంజ్రేకర్
ఆస్ట్రేలియాతో చావోరేవోలాంటి మ్యాచ్‌లో భారత్ స్థాయికి తగ్గట్లుగా ఆడి గెలిచింది. మొహాలీలో విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓ భారతీయుడు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్. భారత్‌ను సెమీస్‌కు చేర్చినందుకు కోహ్లికి థ్యాంక్స్ చెప్పాలి. గత రెండు మ్యాచ్‌లలో వెస్టిండీస్ ప్రదర్శన చూసిన తర్వాత భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత అఫ్ఘానిస్తాన్ చేతిలోనూ ఓడిపోయారు. చాలామంది గేల్ గురించి మాట్లాడేటప్పుడు అతడి పవర్ గురించి మాత్రమే చెబుతారు. కానీ అతడిలో అంతకు మించి చాలా ఉంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో గేల్ చూపించిన టెంపర్‌మెంట్ అద్భుతం. భారత్‌తో మ్యాచ్‌లో గేల్‌ది ఎంత పెద్ద వికెట్టో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
భారత బ్యాటింగ్ లైనప్‌లోని లోపాలు కోహ్లి అద్భుత ప్రదర్శనల వల్ల కనిపించడం లేదు. ఇక బౌలింగ్ మాత్రం అద్భుతంగా, నిలకడగా ఉంది. భారత జట్టు బౌలింగ్ బలంతో ఆడుతుండటం చాలా అరుదుగా జరిగే విషయం. యువరాజ్ సింగ్ అందుబాటులో లేనందున మనీష్ పాండేను తుది జట్టులోకి తీసుకోవాలి. ఈ ఫార్మాట్‌లో రహానే కంటే కూడా పాండే ప్రమాదకర ఆటగాడు. వాంఖడే పిచ్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం. కాబట్టి ధావన్‌కు మరో మ్యాచ్‌లో అవకాశం ఇవ్వొచ్చు.
ఆస్ట్రేలియాతో చావోరేవోలాంటి మ్యాచ్‌లో భారత్ స్థాయికి తగ్గట్లుగా ఆడి గెలిచింది. మొహాలీలో విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓ భారతీయుడు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్. భారత్‌ను సెమీస్‌కు చేర్చినందుకు కోహ్లికి థ్యాంక్స్ చెప్పాలి. గత రెండు మ్యాచ్‌లలో వెస్టిండీస్ ప్రదర్శన చూసిన తర్వాత భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత అఫ్ఘానిస్తాన్ చేతిలోనూ ఓడిపోయారు. చాలామంది గేల్ గురించి మాట్లాడేటప్పుడు అతడి పవర్ గురించి మాత్రమే చెబుతారు.
కానీ అతడిలో అంతకు మించి చాలా ఉంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో గేల్ చూపించిన టెంపర్‌మెంట్ అద్భుతం. భారత్‌తో మ్యాచ్‌లో గేల్‌ది ఎంత పెద్ద వికెట్టో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత బ్యాటింగ్ లైనప్‌లోని లోపాలు కోహ్లి అద్భుత ప్రదర్శనల వల్ల కనిపించడం లేదు. ఇక బౌలింగ్ మాత్రం అద్భుతంగా, నిలకడగా ఉంది. భారత జట్టు బౌలింగ్ బలంతో ఆడుతుండటం చాలా అరుదుగా జరిగే విషయం. యువరాజ్ సింగ్ అందుబాటులో లేనందున మనీష్ పాండేను తుది జట్టులోకి తీసుకోవాలి. ఈ ఫార్మాట్‌లో రహానే కంటే కూడా పాండే ప్రమాదకర ఆటగాడు. వాంఖడే పిచ్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం. కాబట్టి ధావన్‌కు మరో మ్యాచ్‌లో అవకాశం ఇవ్వొచ్చు.
మనీష్ పాండేను ఆడించాలి
Published Thu, Mar 31 2016 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM
Advertisement