ఓహ్‌ డియ‌ర్‌..! కోహ్లి కెరీర్‌లోనే చెత్త షాట్‌: భారత మాజీ క్రికెటర్‌ | Sanjay Manjrekar shares major concerns after Virat Kohlis dismissal | Sakshi
Sakshi News home page

ఓహ్‌ డియ‌ర్‌..! కోహ్లి కెరీర్‌లోనే చెత్త షాట్‌: భారత మాజీ క్రికెటర్‌

Published Fri, Oct 25 2024 3:00 PM | Last Updated on Fri, Oct 25 2024 3:14 PM

Sanjay Manjrekar shares major concerns after Virat Kohlis dismissal

టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ కొనసాగుతోంది. పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లి తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 9 బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్ చేరాడు.

కివీస్ స్పిన్న‌ర్ మిచెల్ శాంట‌ర్న‌ర్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ‌య్యాడు. ఫుల్ టాస్ బంతిని సరిగ్గా ఆర్థం చేసుకోవడంలో విఫలమైన విరాట్ త‌న వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నాడు. దీంతో అత‌డు ఔటైన తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కోహ్లి ఔట్‌పై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ సైతం సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శించాడు.

"ఓహ్‌ డియర్‌! ఔటైన త‌ర్వాత త‌న‌ కెరీర్‌లోనే చెత్త షాట్ ఆడినట్లు విరాట్‌కే అన్పించింటుంది. అతడు కచ్చితంగా బాధపడి ఉంటాడు. ఎందుకంటే అతడు ఎప్పుడూ పరుగులు చేయాలనే ఉద్దేశంతోనే మైదానంలో అడుగుపెడతాడని" ఎక్స్‌లో మంజ్రేకర్ రాసుకొచ్చాడు.

ఒకే ఒక ఫిప్టీ..
కాగా కోహ్లి 2024 క్యాలెండ‌ర్ ఈయ‌ర్‌లో టెస్టుల్లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఒక హాఫ్ సెంచ‌రీ మాత్రమే చేశాడు. బెంగ‌ళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో చేసిన 70 ప‌రుగులే ఈ ఏడాది విరాట్‌ అత్య‌ధిక స్కోర్ కావడం గ‌మ‌నార్హం.

ముఖ్యంగా స్పిన్న‌ర్ల‌ను ఆడ‌టంలో విరాట్ త‌డ‌బ‌డుతున్నాడు. త‌న వికెట్‌ను ఈజీగా స్పిన్న‌ర్ల‌కు స‌మ‌ర్పించుకుంటున్నాడు. గ‌త నాలుగేళ్లలో 26 ఇన్నింగ్స్‌ల్లో 21 సార్లు స్పిన్నర్లకే త‌న వికెట్‌ను కోహ్లి ఇచ్చేశాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement