Shubman Gill Vs Ishan Kishan: శుబ్‌మన్ గిల్.. ఇషాన్ కిషన్.. ఈ ఇద్దరు యువ బ్యాటర్లు టీమిండియా ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్నారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఐదో స్థానానికి డిమోట్ అయిన తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా వీరిలో ఒకరికి అవకాశం రావడం తథ్యం. అయితే, ఇషాన్ కంటే గిల్‌వైపే యాజమాన్యం మొగ్గుచూపుతోంది.
శ్రీలంకతో స్వదేశంలో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లోనూ ఈ విషయం మరోసారి నిరూపితమైంది. రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో టీ20 సిరీస్‌లో గిల్- ఇషాన్ ఓపెనర్లుగా వచ్చారు. ఇక వన్డే సిరీస్‌లో మాత్రం హిట్‌మ్యాన్‌కు జోడీగా శుబ్‌మన్ గిల్ వచ్చాడు. ఇషాన్‌ను పక్కన పెట్టి తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
శుబ్‌మన్ గిల్
అద్భుత ప్రదర్శన
లంకతో మూడు వన్డేల్లో వరుసగా 70, 21, 116 పరుగులు చేశాడు గిల్. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఉప్పల్ వేదికగా మొదలుకానున్న వన్డే సిరీస్‌లోనూ ఇషాన్ కిషన్‌కు మొండిచేయి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ప్రపంచకప్-2023 నాటికి బ్యాకప్ ఓపెనర్లను సిద్ధం చేసే క్రమంలో ఇద్దరికీ ఛాన్స్ వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఇందుకు పరిష్కారం తాను చెబుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్, ఇషాన్ ఇద్దరికీ వన్డేల్లో ఆడే అవకాశం రావాలంటే రన్‌మెషీన్ విరాట్ కోహ్లి తన మూడో స్థానాన్ని త్యాగం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్
ఎవరో ఒకరికే.. కాబట్టి
ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షో గ్లేమ్ ప్లాన్ చర్చలో భాగంగా సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ఇది నిజంగా క్లిష్టతరమైన ప్రశ్నే! యువ బ్యాటర్లలో ఒకరికి ఓపెనర్‌గా చోటు ఇస్తే మరొకరికి భంగపాటు తప్పదు. అయితే, ఈ సమస్యను పరిష్కరించే కిటుకు ఒకటి చెప్తాను.
అప్పుడు రాయుడు కోసం
శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి విరాట్ కోహ్లి తన మూడో స్థానాన్ని త్యాగం చేసి నాలుగో స్థానంలో ఆడితే బాగుంటుంది. గతంలో.. చాలా ఏళ్ల క్రితం శ్రీలంకతో సిరీస్‌లో అంబటి రాయుడు కోసం కోహ్లి ఈ పని చేశాడు. ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తే.. ఇషాన్ కిషన్‌కు మార్గం సుగమమవుతుంది.
ఇషాన్ వస్తే..
వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ ఓపెనర్‌గా వస్తే లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ కుదురుతుంది’’ అని తన అభిప్రాయం పంచుకున్నాడు. రోహిత్- ఇషాన్ ఓపెనర్లుగా వస్తే.. గిల్ వన్‌డౌన్‌లో.. కోహ్లి నాలుగో స్థానంలో రావాలని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. కాగా బంగ్లాదేశ్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేల్లో ఇషాన్ ద్విశతకం బాది పలు రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.
చదవండి: Suryakumar Yadav: జూనియర్ ఎన్టీఆర్‌తో సూర్య, దేవిషా..! బ్రదర్ అంటూ ట్వీట్.. ఫొటో వైరల్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. కీలక ఆటగాడు ఔట్
Comments
Please login to add a commentAdd a comment