టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి ఉన్న ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా ఈ రన్‌మెషీన్ కొనసాగుతున్నాడు.
అత్యధిక పరుగుల వీరుడు
ప్రపంచకప్- 2012లో భాగంగా తొలిసారి టీమిండియా తరఫున టీ20 ప్రపంచకప్ బరిలో దిగిన కోహ్లి ఇప్పటి వరకు.. 25 ఇన్నింగ్స్ ఆడి 1141 పరుగులు సాధించాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో అత్యధిక హాఫ్ సెంచరీల(50కి పైగా స్కోర్లు) రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది.
ఇక ఐపీఎల్-2024లో 741 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఈ ఆర్సీబీ బ్యాటర్.. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్-2024కు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అన్నీ తానే అంటాడు
‘‘కీలక మ్యాచ్‌లలో విరాట్ కోహ్లి అన్నీ తానై వ్యవహరించాలనుకోవడమే అన్నింటికంటే ఎక్కువగా ఆందోళన కలిగించే అంశం. భారం మొత్తం తానే మోస్తానంటాడు.
గతంలో ఇలాంటివెన్నో చూశాం. స్వేచ్ఛగా బ్యాటింగ్ ఝులిపించడం కన్నా క్రీజులో ఎక్కువసేపు నిలబడటానికి ప్రాధాన్యం ఇస్తాడు. భారత క్రికెట్ జట్టులో తనకున్న స్థాయిని బట్టి అలా వ్యవహరిస్తాడేమో!
కోహ్లి రోహిత్‌లా కాదు
రోహిత్ శర్మ మాత్రం ఇందుకు భిన్నం. అతడు ఫ్రీగా బ్యాటింగ్ చేయగలడు. అందుకే సెమీ ఫైనల్స్, ఫైనల్స్ వచ్చేసరికి కోహ్లిని చూస్తే కాస్త కంగారుగా అనిపిస్తుంది.
నిజానికి టీ20 క్రికెట్‌లో యాంకర్(డిఫెన్సివ్) పాత్ర అవసరం లేదు. ముఖ్యంగా తొలుత మన జట్టు బ్యాటింగ్ చేస్తున్నపుడు అస్సలు అవసరం లేదు. వికెట్లు పడుతున్నాయి కదా.. ప్రత్యర్థి జట్టు బౌలర్‌కు కాస్త వెసలు బాటు ఇచ్చామంటే కనీసం రెండు ఓవర్లపాటు నష్టపోవాల్సి ఉంటుంది.
అది జట్టుకు నష్టం చేకూరుస్తుంది’’ అని సంజయ్ మంజ్రేకర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. కీలక మ్యాచ్‌లలో కోహ్లి బంతులు వృథా చేస్తాడన్నదే తనకు ఆందోళన కలిగించే అంశమని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
చదవండి: ట్రోఫీ గెలిచే వ్యూహాలే లేవు.. ఇకనైనా: ద్రవిడ్‌పై లారా సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment