పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సత్తాచాటాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన మొదటి టెస్టు మ్యాచ్‌లోనే జైశ్వాల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైనా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కంగారులను కంగరెత్తించాడు.
స్టార్క్, హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను ఆలోవకగా ఎదుర్కొని శెభాష్ అన్పించుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్హగ్‌ను గుర్తు చేసేలా సిక్సర్‌తో తన సెంచరీ మార్క్‌ను జైశ్వాల్ అందుకున్నాడు. ఓవరాల్‌గా జైశ్వాల్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం.
ఓవరాల్‌గా 297 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 161 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో జైశ్వాల్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితుల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని మంజ్రేకర్ కొనియాడాడు. అదేవిధంగా బ్యాక్ ఫుట్‌లో జైశ్వాల్ అద్బుతంగా ఆడుతున్నాడని అతడు మెచ్చుకున్నాడు.
"జైశ్వాల్ ఒక సంచలనం. అతడు షాట్ సెలక్షన్ చాలా బాగుంది. ఈ మ్యాచ్‌లో అతడు కట్ షాట్ వైట్‌బాల్ క్రికెట్‌లో ఆడినట్లు ఆడాడు. సాధారణంగా ఆటగాళ్ళు కట్‌షాట్ ఆడేందుకు ముందుగానే పొజిషన్‌లోకి వస్తారు. కానీ జైశ్వాల్ మాత్రం చాలా ఆలస్యంగా ఆడుతున్నాడు.
అదే అతడి స్పెషల్. బ్యాక్‌ఫుట్‌లో నుంచి అద్బుతంగా కట్ షాట్ ఆడుతున్నాడు. బ్యాక్‌ఫుట్ నుంచి షాట్ ఆడి స్క్వేర్ వెనక దిశగా పరుగులు రాబడుతున్నాడు. విరాట్ కోహ్లి కంటే జైశ్వాల్ బాగా కట్ షాట్ ఆడుతున్నాడు.
విరాట్ కోహ్లి మాత్రం ఫ్రంట్ ఫుట్‌లో ఉండి ఆడేందుకు ఇష్టపడతాడు. అందువల్ల పెద్దగా పరుగులు సాధించలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా వంటి పరిస్థితుల్లో బ్యాక్‌ఫుట్‌లో ఎలా ఆడాలన్నది యశస్వి నుంచి కోహ్లి నేర్చుకోవాలి" అని స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో సంజయ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment