
PC: BCCI/IPL.com
LSG vs MI Live Updates: ఐపీఎల్-2025లో భాగంగా లక్నో వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి.
ముంబై ఇండియన్స్‌పై లక్నో విజయం..
ఏక్నా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది.
ఆఖరి ఓవర్‌లో అవేష్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(67) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నమాన్ ధీర్(46) పరుగులతో పర్వాలేదన్పించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(28) ఆఖరిలో పోరాడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్, దిగ్వేష్, శార్ధూల్ ఠాకూర్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.
17 ఓవర్లకు ముంబై స్కోర్:164/4
సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 21 బంతుల్లో 46 పరుగులు కావాలి. క్రీజులో ప్రస్తుతం తిలక్ వర్మ(18), హార్దిక్(5) పరుగులతో ఉన్నారు.
13 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 125/3
13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(46), తిలక్ వర్మ(12) ఉన్నారు.
ముంబై మూడో వికెట్ డౌన్..
నమన్ ధీర్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన ధీర్.. దిగ్వేష్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
దూకుడుగా ఆడుతున్న ధిర్, సూర్య
ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. నమాన్ ధిర్(46), సూర్యకుమార్ యాదవ్(21) దూకుడుగా ఆడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.
ముంబైకి ఆదిలోనే భారీ షాక్..
204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్‌లో ఆకాష్ దీప్ బౌలింగ్‌లో విల్ జాక్స్(5) తొలి వికెట్ కోల్పోవగా.. తర్వాత శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ర్యాన్ రికెల్టన్(10) ఔటయ్యారు. 3 ఓవర్లు ముగిసే సరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది.
చెలరేగిన లక్నో బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్
లక్నో వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), మార్‌క్రమ్(53) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్ మిల్లర్(27), బదోని(27) రాణించారు. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగగా.. పుత్తార్, బౌల్ట్, అశ్వినీ కుమార్ తలా వికెట్ సాధించారు.
లక్నో నాలుగో వికెట్ డౌన్..
ఆయూష్ బదోని రూపంలో లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన బదోని.. అశ్వినీ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో మార్‌క్రమ్(49), డేవిడ్ మిల్లర్(1) ఉన్నారు. 16 ఓవర్లు ముగిసే సరికి లక్నో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
పంత్ మరోసారి ఫెయిల్..
రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పంత్ ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. 12 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.
లక్నో రెండో వికెట్ డౌన్..
నికోలస్ పూరన్(12) రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో దీపక్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి లక్నో రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజులో మార్క్‌రామ్(23) ఉన్నాడు.
లక్నో తొలి వికెట్ డౌన్..
మిచెల్ మార్ష్ రూపంలో లక్నో సూపర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన మార్ష్.. విఘ్నేష్ పుత్తార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చాడు. 7 ఓవర్లకు ముంబై స్కోర్
దుమ్ములేపుతున్న మార్ష్..
మిచెల్ మార్ష్ దుమ్ములేపుతున్నాడు. కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ సాధించాడు. 60 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో 69 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడుతున్న లక్నో..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్(26), మార్‌క్రమ్(5) ఉన్నారు.
ఐపీఎల్-2025లో భాగంగా లక్నో వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్‌లో మోకాలికి గాయమైంది. అతడి స్ధానంలో రాజ్ అంగద్ తుది జట్టులోకి బావా వచ్చాడు.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేష్ పుత్తూర్