అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ యశస్వీ జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. అద్బుతమైన క్యాచ్‌తో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను యశస్వి పెవిలియన్‌కు పంపాడు.
గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న లబుషేన్ ఈ మ్యాచ్‌లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ వంటి బౌలర్లు సైతం సమర్ధవంతంగా ఎదుర్కొంటూ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. మరో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు నితీశ్ రెడ్డిని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎటాక్‌లో తీసుకువచ్చాడు. అయితే రోహిత్ ప్లాన్ సఫలమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ 55వ ఓవర్ వేసిన నితీష్ మూడో బంతిని షార్ట్ అండ్ వైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. ఆ బంతిని లబుషేన్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న జైశ్వాల్ అద్బుతం చేశాడు. తన పొజిషన్‌కు కుడివైపునకు కదులుతూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన లబుషేన్(64) బిత్తరపోయాడు.
కోహ్లి రియాక్షన్ వైరల్..
ఇక జైశ్వాల్ క్యాచ్ అందుకోగానే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కోహ్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆసీస్ ప్రేక్షకుల వైపు చూస్తూ సైలెంట్‌గా ఉండమని సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.
చదవండి: IND vs AUS:బుమ్రా మాస్టర్ మైండ్.. ట్రాప్‌లో చిక్కుకున్న స్మిత్! వీడియో
— Sunil Gavaskar (@gavaskar_theman) December 7, 2024
Comments
Please login to add a commentAdd a comment